మోడీపై శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు | Shiv Sena fiercest attack on the Bharatiya Janata Party and Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీపై శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు

Published Tue, Oct 14 2014 3:34 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోడీపై శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

మోడీపై శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలపై శివసేన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమ మద్దతు లేకుంటే మోడీ తండ్రి దామోదర దాస్ కూడా గెలిచేవారు కాదని శివసేన తమ అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్నారు. మోడీకి సొంతంగా గెలిచే శక్తి లేదని శివసేన వ్యాఖ్యలు చేసింది. మోడీ ప్రధాని పదవి చేపట్టాక..మహారాష్ట్ర పార్టీ(శివసేన)ను గుర్తించడం మానేశారని సామ్నాలో పేర్కొన్నారు. అధికార దాహాంతో ఉన్న బీజేపీ...శివసేన పార్టీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆపార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే దుయ్యబట్టింది. 
 
రాజకీయ విమర్శల్లోకి మోడీ తండ్రి పేరును లాగడం వివాదస్పదంగా మారింది.  ముంబైలో ఉంటున్న గుజరాతీలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని శివసేన ఆరోపించింది. పాకిస్థాన్ ను ఓడించాలని బీజేపీకి అధికారమిస్తే.. ఆపార్టీ మమల్ని పెకిలించాలని ప్రయత్నాలు చేస్తున్నారని శివసేన మండిపడింది. బీజేపీ మోసాని బట్టబయలు చేస్తామని శివసేన తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ చచ్చిన పాములు అని సామ్నా ఎడిటోరియల్ తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement