
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రశంసల జల్లు కురిపించారు. మోదీని చూస్తే గర్వంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే అయోధ్యలో రామమందిరాన్ని కడుతుందని, అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి (సివిల్ కోడ్) అమల్లోకి తీసుకొస్తుందని ఆయన శనివారం పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.. ‘ఎన్నికలకు ముందు కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని మేం చెప్పాం. కానీ, ప్రతిపక్షాలు ఆర్టికల్ 370 రద్దు చేయరాదని పేర్కొన్నాయి. మోదీజీని చూస్తే నాకు గర్వంగా ఉంది’ అని ఉద్ధవ్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మిత్రపక్షంగా శివసేన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ దేశానికి నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని అందించారని, రాజకీయ నిర్ణయాలే కాదు.. దేశంలో అభివృద్ధి పనులు ఆయన చేపడుతున్నారని ఉద్ధవ్ కొనియాడారు.
చదవండి: నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి