మహా పోరు ఆసక్తికరం | After Sealing Poll Pact With BJP, Shiv Sena Releases List of 124 Seats | Sakshi
Sakshi News home page

మహా పోరు ఆసక్తికరం

Published Wed, Oct 2 2019 2:52 AM | Last Updated on Wed, Oct 2 2019 2:52 AM

After Sealing Poll Pact With BJP, Shiv Sena Releases List of 124 Seats - Sakshi

కలసి ఉంటే కలదు సుఖం అనే తత్వం బీజేపీ, శివసేనలకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదేమో. సీట్ల పంపిణీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపారీ్టలూ విడివిడిగా పోటీ చేశాయి. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 260 సీట్లలో పోటీ చేసి 122 స్థానాలు దక్కించుకోగా, శివసేన 282 స్థానాల్లో సొంతంగా బరిలోకి దిగి 63 సీట్లు గెల్చింది. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకే బీజేపీ, శివసేనలు దగ్గరైనా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలు 42, 41 స్థానాలకు పరిమితమయ్యాయి. బీజేపీ, శివసేనలు ఉమ్మడిగా 50 శాతానికిపైగా ఓట్లు సాధించగా, కాంగ్రెస్, ఎన్సీపీల ఓట్ల శాతం 35 శాతానికే పరిమితమైంది. తాజా ఎన్నికల్లో మాత్రం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. అధికార బీజేపీ అటు శివసేనతోపాటు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(అథవలే వర్గం), ధంగర్‌ వర్గానికి చెందిన మహాదేవ్‌ జంకర్‌కు చెందిన రాష్ట్రీయ సమాజ్‌ పార్టీ, మంత్రి, సదాభావు ఖోట్‌ నేతృత్వంలోని రైత్‌క్రాంతి, వినాయక్‌ మేటేకు చెందిన శివసంగ్రామ్‌ పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది.

ఫిరాయింపులతో..
ఎన్నికల సీజన్‌లో పార్టీ ఫిరాయింపులు మామూలే. తాజాగా ఎన్సీపీ, కాంగ్రెస్‌ పారీ్టల నుంచి నలుగురు నేతలు, ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌కు చెందిన షిర్పూర్, గోండియా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాశీరామ్‌ పవారా, గోపాల్‌దాస్‌ అగర్వాల్‌లతోపాటు బహుజన్‌ వికాస్‌ అఘాడికి చెందిన గోపీచంద్‌ పడాల్కర్‌లు బీజేపీలో చేరారు. ఎన్సీపికి చెందిన కీలక నేత నమిత ముందాడ కూడా కమల తీర్థం పుచ్చుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేవలం కొన్ని వారాల క్రితం వరకూ నమిత ముందాడ కైజ్‌ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేస్తారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ స్వయంగా ప్రకటించడం. గోపీచంద్‌ పడాల్కర్‌ పవార్‌ కుటుంబానికి కంచుకోటగా భావించే బారామతి నుంచి బీజేపీ తరఫున పోటీ చేయవచ్చునని అంచనా.  

పొత్తు రగిల్చిన చిచ్చు...
బీజేపీ, శివసేన పొత్తు కాస్తా ఆయా పార్టీల్లో కొత్త సమస్యలు తెచి్చపెట్టింది. ఐరోలి, బేలాపూర్‌ స్థానాలను బీజేపీకి కట్టబెట్టారన్న వార్తల నేపథ్యంలో స్థానిక శివసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. దీంతోపాటు నవీ ముంబై స్థానాన్ని బీజేపీకి చెందిన గణేశ్‌ నాయక్‌కు కేటాయించడంపై కూడా పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఎన్సీపీ నుంచి బీజేపీలోకి ఇటీవలే వచి్చన గణేశ్‌ నాయక్‌కు శివసేనకు మధ్య నవీ ముంబై స్థానంలో గట్టిపోరే నడుస్తోంది. మాజీ మంత్రి కూడా అయిన గణేశ్‌ నాయక్‌ కుమారుడు బీజేపీ తరఫున ఐరోలి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివసేన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం పార్టీ ముంబై అధ్యక్షుడితోపాటు జిల్లా ఉపాధ్యక్షుడు మరో 200 మంది నేతలు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసమ్మతి సమస్యను ఎదుర్కొనే ఉద్దేశంతో శివసేన ఎన్ని స్థానాల్లో ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో చివరి నిమిషం వరకూ స్పష్టం చేయలేదు. అయితే పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌  ఇప్పటికే అభ్యర్థులకు ఏ, బీ ఫారమ్‌లను అందించినట్టుగా సమాచారం.  ఏతావాతా.. అటు బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితా ప్రకటించడం, కాంగ్రెస్‌ కూడా 51 స్థానాల అభ్యర్థులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం... అభ్యర్థుల పేర్లు లేకుండా 124 స్థానాలకు పోటీ చేస్తున్నట్లు శివసేన ప్రకటించడంతో మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి మొదలైనట్లే.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మహారాష్ట్రలో ఎన్నికల రాజకీయం రాజుకుంది
శివసేన మధ్య పొత్తు కుదరడం,ప్రతిపక్ష బలాలను తమవైపు ఆకర్షించడంలో బిజీగా ఉన్న బీజేపీ... రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటూండగా.. పొత్తుతో బలాన్ని మరింత పెంచుకుని అధికారం పంచుకునేందుకు  శివసేన కూడా ఉవి్వళ్లు ఊరుతోంది. ఠాక్రే వంశంలో మూడోతరం నేత ఆదిత్య ఠాక్రే రంగంలో ఉండటంతో.. అక్టోబరు 21న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి!

►ఈసారి మహారాష్ట్రలో కాంగ్రెస్‌ తన భాగస్వామి ఎన్సీపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయడం విశేషం. మొత్తం 288 స్థానాల్లో కాంగ్రెస్‌ 135 నుంచి 138 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎన్సీపీ 122 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో కూటమిలోని చిన్న చిన్న పారీ్టల అభ్యర్థులు బరిలోకి దిగుతారు.

►గత ఎన్నికల్లో బారామతి నుంచి గెలుపొందిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement