మోదీకి శివసేన సలహా
ముంబై: ప్రధాని మోదీపై శివసేన దాడి తీవ్రమైంది. ఆయన మహారాష్ట్ర రాజకీయాలపై కాకుండా కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్న పాక్ ఆగడాలపై దృష్టి సారించాలని బుధవారం శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. సీమాంతర కాల్పులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడంతోపొరుగుదేశం బరితెగిస్తోందని విమర్శించిం ది.
కేంద్రంలో ఉండాల్సిన మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉండడం దేశ భద్రతను నిర్లక్ష్యం చేయడమేనంది. దేశాన్ని కాపాడుకోవడానికి 56 అంగుళాల ఛాతీ అక్కర్లేదని, దృఢసంకల్పం ఉంటే చాలని పేర్కొంది.
మహారాష్ట్రపై కాదు పాక్ ఆగడాలపై దృష్టి పెట్టండి
Published Thu, Oct 9 2014 2:45 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
Advertisement
Advertisement