విపక్షాలకు మరో షాక్‌ | Navaneeth Kaur Rana And Ravi Rana May Join In BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి నవనీత్‌కౌర్‌ రాణా, రవిరాణా!

Published Mon, Jun 24 2019 5:50 PM | Last Updated on Mon, Jun 24 2019 6:46 PM

Navaneeth Kaur Rana And Ravi Rana May Join In BJP - Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ విపక్షాలకు మరోసారి షాక్‌ ఇవ్వనుంది. ప్రముఖ నటి, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్‌కౌర్‌ రానా, ఆమె భర్త యువ స్వాభిమాన్‌ పార్టీ అధ్యక్షుడు రవిరాణా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన రవిరాణా దంపతులు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ మద్దతుతో నవనీత్‌ కౌర్‌ రానా అమరావతి నుంచి గెలిచారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బీజేపీలో చేరుతున్నట్లు వారు చెబుతున్నారు. వారి చేరికలు కాంగ్రెస్‌, ఎన్సీపీలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆ రెండు పార్టీల నాయకులైన రాధాకృష్ణ పాటిల్‌, జయదూత్‌లు బీజేపీలో చేరి మంత్రి పదవులు పొందారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, ఎన్సీపీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతుండటం గమనార్హం. రవిరాణా తమ పార్టీలోకి వస్తే తూర్పు విదర్భ ప్రాంతంలో పార్టీ బలం పెరుగుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రవిరాణా మాత్రం అమరావతికి ఎయిర్‌పోర్ట్‌, మహిళల​కు స్వతంత్ర పోలీస్‌ స్టేషన్ల నిర్మాణం కోసమే కలిశానని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement