Ravi Rana
-
నా భార్య పోటీ చేయదు: రవి రాణా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బద్నేరా నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తన సతీమణి, మాజీ ఎంపీ నవనీత్ రాణా పోటీ చేయబోరని అన్నారు. ఆమెకు రాజ్యసభ సీటును కేటాయిస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బీజేపీ హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నమని తెలిపారు. దీంతో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యాలు చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ మాజీ ఎంపీ నవనీత్ రాణా విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోరని భావిస్తున్నా. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఇతర పార్టీ నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆమెను రాజ్యసభకు పంపిస్తామని అంటున్నారు. ఆమెకు సముచితమని బాధ్యతగా భావిస్తున్నా’’ అని అన్నారు.ఇక.. అమరావతి నుంచి నవనీత్ రాణా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అమరావతి (ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే గెలుపొందారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె బీజేపీలో చేరిసిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ రాణా అమరావతి సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది. ఈ క్రమంలో వచ్చే నెల(నవంబర్)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా మద్దతు ఇస్తుందని రవి రాణా అన్నారు.చదవండి: ఫైరింగ్ ప్రాక్టిస్‌లో విషాదం.. ఇద్దరి అగ్ని వీరుల మృతి -
20 రోజుల్లో ఉద్దవ్ బీజేపీలో చేరుతారు: మహారాష్ట్ర ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్వం జరిగిన 20 రోజుల్లో ఉద్ధవ్ బీజేపీతో చేరుతారని జోస్యం చెప్పారు. జూన్ 20లోపు ఉద్ధవ్ వర్గం శివసేన ఎన్డీయే కూటమిలో చేరబోతుంని తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భార్య నవనీత్ కౌర్‌తో ఎమ్మెల్యే రవి రానా‘నేను నమ్మకంగా చెప్పగలను. కేంద్రలో మోదీ మళ్లీ ప్రధాని అయిన 20 రోజుల్లో ఉద్దవ్ ఠాక్రే మోదీ ప్రభుత్వంలో కలుస్తారు. రాబోయే కాలం మోదీదే.. ఆ విషయం ఉద్దవ్‌కు కూడా తెలుసు. బాబాసాహెబ్ థాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తేది మోదీనే. ఉద్దవ్ కోసం ప్రధాని మోదీ ఓ కిటికీ ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. ఈ విషయం మోదీనే స్వయంగా చెప్పారు కూడా. బీజేపీలో చేరేందుకు ఉద్ధవ్ ఈ ‘విండో’ను ఉపయోగించుకుంటారు’ అని పేర్కొన్నారు.గతంలోనూ శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వైదొలుగుతారని తాను ఖచ్చితంగా చెప్పానని, తరువాత అదే జరిగిందని అన్నారు. కాగా ఎన్సీపీ వ్యవస్థాపకుడు, శరద్ పవార్‌తోపాటు ఉద్దవ్ ఠాక్రేలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాని ఇటీవల మోదీ కోరారు. కాంగ్రెస్‌లో విలీనమై కనుమరుగవడం కంటే బీజేపీలో చేరడం మేలని అన్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయతను తాను ఎప్పటికీ మరచిపోలేనని మోదీ అన్నారు. -
ఆస్పత్రిలో నవనీత్ రాణా ఫొటో వైరల్‌పై కేసు నమోదు..ఫోటో తీసిందెవరు?
సాక్షి, ముంబై: లీలావతి ఆస్పత్రిలో ఎంఆర్ఐ చేస్తుండగా అమరావతి ఎంపీ నవనీత్ రాణా ఫొటో తీసిన గుర్తు తెలియని వ్యక్తిపై స్థానిక బాంద్రా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌లో ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్ ద్వారా ఫొటో తీసినట్లు కనిపిస్తోంది. కాని ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. దీంతో ఆ వ్యక్తి రాణాకు పరిచయం ఉన్నవారా.. లేక ఆస్పత్రి సిబ్బందా.. లేక బయట వ్యక్తులెవరైనా తీశారా..? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాంద్రాలోని కళానగర్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ బంగ్లా ఎదుట హనుమాన్ చాలీసా పఠనం చేయడానికి గత పక్షం రోజుల కిందట వచ్చిన ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవీ రాణాలపై రాజద్రోహం కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. దాదాపు పక్షం రోజులు జైలులో ఉన్న దంపతులు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె నడుము, మెడ నొప్పితో బాధపడుతుండటంతో బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ల సలహా మేరకు ఈ నెల ఆరో తేదీన రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమెకు ఎంఆర్ఐ చేయించేందుకు క్యాబిన్లోకి తీసుకెళ్లారు. అక్కడ తెల్ల చొక్కా ధరించిన రాణా అంగరక్షకుడు, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఎలాంటి అనుమతి తీసుకోకుండా తన మొబైల్ ద్వారా నవనీత్ రాణాను ట్రాలీపై పడుకోబెట్టి ఎంఆర్ఐ పరీక్ష చేస్తుండగా ఫొటో తీశాడు. ఆ ఫోటోను మీడియాకు ఇవ్వడమేగాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. నియమాల ప్రకారం ఎంఆర్ఐ క్యాబిన్లోకి ఇతరులెవరు వెళ్లకూడదు, ఫొటోలు తీయకూడదు. ముఖ్యంగా అయస్కాంత గుణం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహపు వస్తువులు అక్కడికి తీసుకెళ్లకూడదు. ఎంఆర్ఐ క్యాబిన్ బయట బోర్డు కూడా రాసి ఉంది. అయినప్పటికీ ఫొటో తీయడమేగాకుండా వైరల్ చేయడంపై శివసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంద్రా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయగానే లీలావతి ఆస్పత్రి యాజమాన్యం కూడా పోలీసు స్టేషన్‌కు పరుగులు తీసి ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి భద్రతా విభాగం సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటో తీసిన ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. మళ్లీ అరెస్టుకు అవకాశం!
ముంబై: హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో జైలుపాలై.. బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో.. వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. హనుమాన్ చాలీసా ఛాలెంజ్‌తో సీఎం ఉద్దవ్ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్‌ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఈ లోపు.. ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్‌లు విసిరింది. మీడియాతో మాట్లాడడమే కాకుండా.. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ జంట ప్రెస్ మీట్లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: దమ్ముంటే పోటీ చేయ్.. ఉద్దవ్‌కు నవనీత్ సవాల్ -
ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త.. వైరల్ వీడియో
ముంబై: తన భార్య నవనీత్ కౌర్ రాణా అనారోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేసినా బైకుల్లా జైలు అధికారులు కనీసం పట్టించుకోలేదని ఎంపీ రవి రాణా ఆరోపించారు. తలోజా జైలు నుంచి గురువారం రవిరాణా విడుదలయ్యారు. రవిరాణా విడుదలకు రెండుగంటల ముందు బైకుల్లా మహిళా జైలునుంచి ఆయన భార్య నవనీత్ కౌర్ రాణా విడుదలయ్యారు. గత నెల 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో వీరిద్దరినీ ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరికీ బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం కొన్ని గంటల వ్యవధిలో విడుదలయ్యారు.అనంతరం నవనీత్ రాణా అనారోగ్య సమస్యలతో సబ్ అర్బన్ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు. చదవండి: ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత ఆరు రోజుల నుంచి నవనీత్ ఆరోగ్యం బాగోలేదని బైకులా జైలు అధికారులకు ఫిర్యాదు చేసిందని, అయితే కనీసం జైలు అధికారులెవరూ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో రవిరాణాతో పాటు బీజేపీ నేత కృతి సోమయ్య వెంట ఉన్నారు. కాగా, వార్డులో నవనీత్‌రాణా కంటతడి పెడుతండగా.. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. pic.twitter.com/0Al31eJkCy — Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022 -
Navneet Rana: నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్
ముంబై: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది సెషన్స్ కోర్టు. సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ముంబైలో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు ఈ ఇండిపెండెంట్ ఎంపీ, ఎమ్మెల్యే భార్యాభర్తలు. ఈ తరుణంలో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ స్టేషన్ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ముంబై సెషన్స్ కోర్టు.. మీడియాతో మాట్లడవద్దని నవనీత్ కౌర్ దంపతులను ఆదేశించింది. చదవండి: ఎస్సీ కావడంతో నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు: నవనీత్ కౌర్ -
ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు హైకోర్టులో చుక్కెదురు
ముంబై: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు బాంబు హైకోర్టులో చుక్కెదురైంది. తమను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీస్ అధికారిపై దాడి చేశారంటూ నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సందర్భంగా నవనీత్ కౌర్ దంపతుల తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. కాగా ముంబైలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఇంటి ముందు హనుమాన్ చాలీసా ప్లే చేస్తామంటూ రానా దంపతులు ప్రకటించిన నేపథ్యంలో నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నవనీత్ కౌర్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేస్తూ.. ఎంపీ దంపతులకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఓ వ్యక్తి నివాసం వద్ద లేదా బహిరంగ ప్రదేశంలో మతపరమైన శ్లోకాలను పఠిస్తామంటూ ప్రకటించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు పేర్కొంది. అదే విధంగా ఒక నిర్ధిష్ట మతపరమైన ప్రవచనాలు బహిరంగ ప్రదేశాల్లో పఠిస్తామని ప్రకటించడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమేనని తెలిపింది. చదవండి: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్ ఇదిలా ఉండగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ అధినేత, ఉద్ధవ్ ఠాక్రే సోదరుడు రాజ్ ఠాక్రే.. మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్రానికి అల్టిమేటం ఇవ్వడంతో మహారాష్ట్రలో రాజకీయ రగడ మొదలైంది. మే 3లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే అజాన్ సమయంలో హనుమాన్ చాలీసా వినిపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకుంటే తామే సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్ రాణా, రవి రాణా ప్రకటన చేశారు. దాంతో ఆగ్రహం చెందిన శివసేన కార్యకర్తలు ఖార్లోని నవనీత్ రాణా నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నవీనీత్ రాణా దంపతులను బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నవనీత్ కౌర్‌ను ముంబైలోని బైకుల్లా జైలుకు ఆమె భర్తను న్యూ ముంబైలోని తలోజా జైల్‌కు తరలించారు -
ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్
ముంబై: మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో..ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. ఆపై ఎమ్మెల్యే రవి రానా, ఆయన భార్య ఎంపీ నవనీత్ కౌర్‌లు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో పాటు రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నవనీత్ కౌర్ ప్రకటన, ఆ తర్వాత పోలీసుల చర్యలతో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చదవండి👉🏾: బీజేపీ అండతో నవనీత్ కౌర్ రెచ్చిపోతోంది -
నటి నవనీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్
ముంబై : కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమెతోపాటు భర్త రవి రానా, పిల్లలకు కూడా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా నవనీత్ కౌర్ వెల్లడించారు. ‘నా కుమార్తె, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. వారిని చూసుకోవడం నా బాధ్యత. వారి బాగోగులు చూసుకునే క్రమంలో నేనూ కరోనా బారిన పడ్డాను’ అని ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. నవనీత్ కుటుంబంలో ఇప్పటికే 10 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారంతా నాగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (తిరుగులేదని నిరూపించుకున్న ‘ఖిలాడీ’!) తెలుగు ప్రజలకు నవనీత్ కౌర్ సుపరిచితురాలే. శీను వాసంతి లక్ష్మి సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన నవనీత్, ఆ తర్వాత రూమ్ మేట్స్, జగపతి తదితర సినిమాల్లో నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమాలోని ఓ ప్రత్యేక పాటలో కనిపించారు. పంజాబీ, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె పలు చిత్రాల్లో నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. (ఆర్ఆర్ఆర్ నిర్మాతకు కరోనా పాజిటివ్) -
విపక్షాలకు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ విపక్షాలకు మరోసారి షాక్ ఇవ్వనుంది. ప్రముఖ నటి, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్‌కౌర్ రానా, ఆమె భర్త యువ స్వాభిమాన్ పార్టీ అధ్యక్షుడు రవిరాణా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన రవిరాణా దంపతులు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో నవనీత్ కౌర్ రానా అమరావతి నుంచి గెలిచారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బీజేపీలో చేరుతున్నట్లు వారు చెబుతున్నారు. వారి చేరికలు కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆ రెండు పార్టీల నాయకులైన రాధాకృష్ణ పాటిల్, జయదూత్లు బీజేపీలో చేరి మంత్రి పదవులు పొందారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతుండటం గమనార్హం. రవిరాణా తమ పార్టీలోకి వస్తే తూర్పు విదర్భ ప్రాంతంలో పార్టీ బలం పెరుగుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. రవిరాణా మాత్రం అమరావతికి ఎయిర్పోర్ట్, మహిళలకు స్వతంత్ర పోలీస్ స్టేషన్ల నిర్మాణం కోసమే కలిశానని చెప్పారు. -
బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేల ఝలక్
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కమలనాథుల ముందు తమ డిమాండ్ల చిట్టా పెట్టారు. శివసేనను దారికి తెచ్చేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలను దువ్విన బీజేపీకి ఇప్పుడు వారే ప్రతిబంధకంగా మారే పరిస్థితి ఎదురైంది. ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రవి రాణా నాయకత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వీరంతా మంగళవారం ఒక హోటల్ లో సుదీర్ఘ సమయం పాటు మంతనాలు సాగించారు. అనంతరం తమ డిమాండ్లను వెల్లడించారు. ఒక మంత్రి పదవి, రెండు సహాయ మంత్రి పదవులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో నాలుగు చైర్మన్ పోస్టులు తమకివ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు విదర్భ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని సూచించారు.