బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేల ఝలక్ | Independents in a huddle in Maharashtra govt formation | Sakshi
Sakshi News home page

బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేల ఝలక్

Published Tue, Oct 28 2014 3:50 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేల ఝలక్ - Sakshi

బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేల ఝలక్

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కమలనాథుల ముందు తమ డిమాండ్ల చిట్టా పెట్టారు. శివసేనను దారికి తెచ్చేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలను దువ్విన బీజేపీకి ఇప్పుడు వారే ప్రతిబంధకంగా మారే పరిస్థితి ఎదురైంది.

ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రవి రాణా నాయకత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వీరంతా మంగళవారం ఒక హోటల్ లో సుదీర్ఘ సమయం పాటు మంతనాలు సాగించారు. అనంతరం తమ డిమాండ్లను వెల్లడించారు.

ఒక మంత్రి పదవి, రెండు సహాయ మంత్రి పదవులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో నాలుగు చైర్మన్ పోస్టులు తమకివ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు విదర్భ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement