ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బద్నేరా నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తన సతీమణి, మాజీ ఎంపీ నవనీత్ రాణా పోటీ చేయబోరని అన్నారు. ఆమెకు రాజ్యసభ సీటును కేటాయిస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బీజేపీ హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నమని తెలిపారు. దీంతో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యాలు చర్చనీయాంశంగా మారాయి.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ మాజీ ఎంపీ నవనీత్ రాణా విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోరని భావిస్తున్నా. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఇతర పార్టీ నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆమెను రాజ్యసభకు పంపిస్తామని అంటున్నారు. ఆమెకు సముచితమని బాధ్యతగా భావిస్తున్నా’’ అని అన్నారు.
ఇక.. అమరావతి నుంచి నవనీత్ రాణా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అమరావతి (ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే గెలుపొందారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె బీజేపీలో చేరిసిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ రాణా అమరావతి సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.
ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది. ఈ క్రమంలో వచ్చే నెల(నవంబర్)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా మద్దతు ఇస్తుందని రవి రాణా అన్నారు.
చదవండి: ఫైరింగ్ ప్రాక్టిస్‌లో విషాదం.. ఇద్దరి అగ్ని వీరుల మృతి
Comments
Please login to add a commentAdd a comment