Independent mlas
-
పెరిగిన బలం.. బీజేపీలో చేరిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ.. తిరుగులేని పార్టీగా అవతరించింది. 90 స్థానాల్లో 48 చోట్ల గెలుపొంది ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.తాజాగా అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు దేవేందర్ కద్యన్, రాజేష్ జూన్.. కేంద్రమంత్రి, హర్యానా ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మోహన్‌లాల్ బడోలీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగిన కద్యన్ గనౌర్ నుంచి గెలుపొందగా.. రాజేష్ జూన్ బహదూర్‌ఘర్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. అయితే మరో ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ గత మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. అయితే టికెట్ రాకపోవడంతో హిసార్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆమె కూడా బీజేపీకి తన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వీరి చేరికతో పదేళ్ల పాలన తర్వాత గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించిన బీజేపీకి మరింత బలం చేకూరింది. దీంతో అసెంబ్లీలో బీజేపీ బలం 52కి చేరనుంది. -
హిమాచల్‌లో సుఖు సర్కార్ సేఫ్!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరతకు తాత్కాలికంగా తెరపడింది. ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కే.ఎల్.ఠాకూర్, హోషియార్ సింగ్, ఆశిష్ శర్మలు మార్చి 22న రాజీనామా చేయగా, స్పీకర్ కుల్దీప్సింగ్ పథానియా సోమవారం వాటిని ఆమోదించారు. తొలుత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు.. ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహజన్ గెలుపునకు దోహదపడ్డారు. మెజారిటీ ఉండి కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని గెలిపించుకోలేకపోయింది. అప్పటి నుంచి బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పావులు కదుపుతోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా.. వారు బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుపై ఉప ఎన్నికల్లో పోటీచేశారు. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ బలం 68 కాగా... తొమ్మిది మంది పోను ప్రస్తుతం 59గా ఉంది. కాంగ్రెస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. మంగళవారం వెలువడే ఉప ఎన్నికల ఫలితాల్లో ఆరింటికి ఆరు స్థానాలు బీజేపీ నెగ్గినా వారి బలం 31 మాత్రమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో గనక ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం కూడా తోడైతే బీజేపి 34కు చేరుకునే అవకాశాలుండేవి. అలా కాకుండా సరిగ్గా ఫలితాలకు ముందు రోజు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా సుఖు ప్రభుత్వం కొంతకాలం ఊపిరిపీల్చుకున్నట్లే. అదీ మళ్లీ తాజాగా ఫిరాయింపులేవీ జరగకుండా ఉంటే! -
హిమాచల్‌లో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన సీఎం సుఖూ ప్రభుత్వాన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురితోపాటు సుఖూ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడం సంచలనం రేపింది. బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు అనర్హత వేటుకు గురికాగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తాజాగా పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ టిక్కెట్‌పై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వీరు తెలిపారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి వెళ్లి అసెంబ్లీ లో రాజీనామా పత్రాలను అందజేశారు. -
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్లు గుడ్‌బై
-
బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేల ఝలక్
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న బీజేపీకి స్వతంత్ర ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కమలనాథుల ముందు తమ డిమాండ్ల చిట్టా పెట్టారు. శివసేనను దారికి తెచ్చేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలను దువ్విన బీజేపీకి ఇప్పుడు వారే ప్రతిబంధకంగా మారే పరిస్థితి ఎదురైంది. ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రవి రాణా నాయకత్వంలో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వీరంతా మంగళవారం ఒక హోటల్ లో సుదీర్ఘ సమయం పాటు మంతనాలు సాగించారు. అనంతరం తమ డిమాండ్లను వెల్లడించారు. ఒక మంత్రి పదవి, రెండు సహాయ మంత్రి పదవులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో నాలుగు చైర్మన్ పోస్టులు తమకివ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు విదర్భ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని సూచించారు.