సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన సీఎం సుఖూ ప్రభుత్వాన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురితోపాటు సుఖూ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడం సంచలనం రేపింది.
బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు అనర్హత వేటుకు గురికాగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తాజాగా పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ టిక్కెట్‌పై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వీరు తెలిపారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి వెళ్లి అసెంబ్లీ లో రాజీనామా పత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment