ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ, శివసేన నేతృత్వం లోని మహాకూటమికి ఎనలేని ఉత్సాహాన్నిచ్చాయి.
ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ, శివసేన నేతృత్వం లోని మహాకూటమికి ఎనలేని ఉత్సాహాన్నిచ్చాయి. ఈ నేపథ్యం లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తాయని ధీమాతో ఉన్న ఈ కూటమి అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుంటోంది. ఎవరికి అనుకూలంగా ఉన్న స్థానాల్లో వారే పోటీ చేయాలని, ఇందుకోసం స్థానాలను తారుమారు చేసుకోవాలని బీజేపీ భావిస్తోం ది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీట్ల మార్పిడి కిగల అవకాశాలపై శివసేనతో చర్చిస్తామన్నారు.
ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఇందులో ఎటువంటి వివాదాలు తలెత్తలేదన్నారు. సీట్ల మార్పిడికి సంబంధించి ఈ సందర్భంగా ఆయన ఓ ఉదాహరణ చెబుతూ గతంలో తూర్పు నాగపూర్ నియోజకవర్గం శివసేన కోటాలో ఉంద ని, అంతకుముందు అక్కడ జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన తమ భాగస్వామ్య పక్షం ఓటమి పాలైం దన్నారు. అయితే గత శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కృష్ణ ఖోప్డే పోటీ చేసి 34 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారని ఆయన గుర్తుచేశారు. ఒకవైపు మోడీ ప్రభంజనం, మరోవైపు ప్రభు త్వ వ్యతిరేకత శాసనసభ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందన్నారు.
పొత్తు పెట్టుకోం
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదన్నారు.