శివసేనపై విమర్శలకు దూరం: మోదీ
సంగ్లీ: మహారాష్ట్రలో బీజేపీకి పూర్తి ఆధిక్యం కట్టబెట్టాలని ఓటర్లను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు.
బాల్ థాకరే అంటే తమకెంతో గౌరవమని, అందువల్లే శివసేనపై విమర్శలకు దూరంగా ఉన్నట్టు మోదీ తెలిపారు. బాల్ థాకరే మరణించిన తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలివని గుర్తు చేశారు. నర్మదా ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం ఆపేసిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రధాని హామీయిచ్చారు.