Sangli
-
రాహుల్ భావితరాలు కూడా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేవు
సాంగ్లి (మహారాష్ట్ర): కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, ఆయన వారసులు కూడా జమ్మూశ్మీమర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అది వారి వల్లకాదన్నారు. సాంగ్లిలో మహాయుతి తరఫున శుక్రవారం అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం బుధవారం జమ్మూశ్మీమర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ మద్దతునివ్వడంతో అమిత్ షా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష నేతలు రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్లు వ్యతిరేకించారని షా గుర్తుచేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నుంచి చెబుతున్నా.. రాహుల్ బాబా. మీరు లేదా మీ నాలుగోతరం వారసులు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరు. శ్మీమర్ కోసం దేశంలోని ప్రతి వ్యక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు’అని అమిత్ షా అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నపుడు పార్లమెంటులో నేనా బిల్లును ప్రవేశపెట్టాను. రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్లు దీన్ని వ్యతిరేకించారు. దీనివల్ల శ్మీమర్ లోయలో రక్తపాతం జరుగుతుందన్నారు. రక్తం ప్రవహించడం మాట అటుంచితే కనీ సం రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు’అని అమిత్ షా పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. మోదీ ప్రయత్నాల వల్ల అది సాకారమైందని అమిత్ షా అన్నారు. -
తమ్ముడి కుటుంబం సూసైడ్.. అన్నకు చెప్తామని వెళ్లేసరికి..!
సాంగ్లి: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన పెను విషాదంలో అసలు విషయం తేలింది. ఇద్దరు అన్నదమ్ములు తమ తమ భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 9 మంది చనిపోయారు. అప్పుల భారంతోనే వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎంహైసల్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పొపట్ వాన్మొరె(56) ఉపాధ్యాయుడు కాగా, మానిక్ వాన్మొరె వెటర్నరీ డాక్టర్. వీరిద్దరూ తమ కుటుంబాలతో గ్రామంలోనే వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం మానిక్ వాన్మొరె ఇంటి తలుపులు తీయకపోయేసరికి చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. ఆ ఇంట్లో మానిక్ సహా నలుగురి మృతదేహాలు కనిపించాయి. విషయం చెప్పేందుకు పొపట్ ఇంటికి వెళ్లిన గ్రామస్తులకు ఇదే అనుభవం ఎదురైంది. మానిక్ ఇంట్లో మానిక్, ఆయన భార్య, తల్లి, కూతురు, పొపట్ కొడుకు విగత జీవులై కనిపించగా, అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పొపట్ ఇంట్లో పొపట్, ఆయన భార్య, కూతురు శవాలై పడి ఉన్నారు. వీళ్లంతా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ధృవీకరించారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల పిల్లలు మేజర్లే కాగా, వాళ్ల చదువులు, ఆర్భాటాల కోసం తాహతుకు మించి చేసిన అప్పులు చేసి.. తీర్చలేకనే చనిపోతున్నట్లు ఇద్దరి ఇళ్లలో లభించిన సూసైడ్ నోట్లు దొరికాయి. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాఖీలు..
దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర సంగ్లీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ప్రస్తుతం సంగ్లీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి సిద్దమయ్యాయి. అయితే తమ ప్రాణాలను కాపాడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిపై అక్కడి మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. వారు తమకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పూజలు చేశారు. సిబ్బంది నుదుటిపై తిలకాలు దిద్ది.. వారి చేతికి రాఖీలు కట్టారు. అలాగే వారికి హారతి కూడా ఇచ్చారు. కాగా, సంగ్లీ, కొల్హాపూర్, సతారా జిల్లాలోని 4.5 లక్షల మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలించారు. సంగ్లీ జిల్లాలో వరద బాధితులను పడవలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న క్రమంలో కూడా ఓ మహిళ ఆర్మీ జవాన్‌కు పాదాభివందనం చేసిన సంగతి విదితమే. -
19 ఆడశిశువుల కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
సాంగ్లి: 19 ఆడశిశువులను అమానుషంగా అంతం చేసిన కేసులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణంపై విచారణ చేపట్టిన పోలీసులు మరిన్ని భయకంరమైన, కఠిన వాస్తవాలను సేకరించారు. మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో చోటుచేసుకున్న ఆడశిశువుల అబార్షన్లపై వివరాలను పోలీసులు వివరించారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో ఘటనల వివరాలను పరిశీలిస్తే...రెండు రాష్ట్రాల్లో ఎజెంట్లను నియమించుకుని మరీ ఈ దందాను సాగిస్తున్నారు. ఎవరికీ అనుమానంరాకుండా మహారాష్ట్ర కేసులను, కర్ణాటకకు, కర్ణాటక కేసులను మహారాష్ట్రకు పంపిస్తారు. అంతేకాదు ఈ అబార్షన్లకోసం డా. బారతి ప్రయివేటు ఆసుపత్రిలో ఏకంగా భూగర్భంలో ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్ కు బదులుగా ఒక తాత్కాలిక గుడిసెలో గర్భస్రావాలు నిర్వహిస్తారు. అంతేకాదు కొన్నిసార్లు , కాంపౌండర్లు లేదా నర్సులే ఈ పనిని పూర్తి చేస్తారట. అనంతరం ఆ పిండాలను పాతిపెట్టడం, లేదా టాయిలెట్ లో యాసిడ్ తో కలిసి ప్లష్ చేస్తారు లేదంటే కుక్కలకు ఆహారంగా వేస్తారు. కానీ మొన్నటి ఘటనలో ప్లాస్టిక్‌సంచుల్లో కుక్కి పాతిపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి గాను వారు రూ.25వేలు చార్జ్ చేస్తారు. గర్భంలో ఉన్నది ఆడబిడ్డ అయితే అబార్షన్ చేస్తారు.. అబ్బాయి అయితే.. ఆ విషయం చెప్పినందుకు ఈ చార్జ్ వసూలు చేస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో జరుగుతున్న అబార్షన్లపై పోలీసులు ఆరా తీయగా రాకెట్టు గుట్టురట్టయింది. ఈ కేసులో డా. బాలాసాహెబ్ ఖిద్రాపూర్ సహా ఇప్పటికీ12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు. డా. బాలాసాహెబ్ ఖిద్రాపూర్ , డాక్టర్ శ్రీహరి గోడ్కే, విజపూర్ నుంచి డాక్టర్ రమేష్ దేవిగర్ (ఎంబీబీఎస్). ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఈకేసును పరిశోధిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ దీపాలి కాలే చెప్పారు. అయితే ఆసుపత్రిపై దాడులు నిర్వహించామనీ, తమకు అనుమానాస్పద సమాచారం దొరకలేదనీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హెల్త్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ అర్చనా పాటిల్ తెలిపారు. మరోవైపు గతంలో కూడా ఇదే డాక్టర్ పై కేసులు నమోదయ్యాయి. అపుడు వైద్య అధికారులు ఏమీ లేదని తేల్చిపారేశారు. అయితే ఈ సారి పోలీసుల దర్యాప్తులో మాత్రం అక్రమంగా వాడుతున్న మందులు, అక్రమ థియేటర్ తదితర విషయాలు తేలాయి. అసలు సదరు డాక్టర్‌కు ఆపరేషన్ నిర్వహించే అనుమతి కూడాలేదని పోలీసులు స్పష్టం చేశారు. క్రిమినల్ కోణం ఉంటేనే తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. స్వాతి మరణంపై తమ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అయితే ఆరోగ్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య అధికారులు కేవలం ఒకసారి రెయిడ్ చేసి ఏమీ దొరకలేదని చెపుతున్నారనీ, ఇందులో మరిన్ని కోణాలుదాగి వున్నాయనే అనుమానాలను దర్యాప్తు అధికారి వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలోని సాంగ్లి , బీడ్ జిల్లాలు రెండూ అత్యల్ప చైల్డ్ సెక్స్ రేషియో నమోదు చేశాయి. ముఖ్యంగా బీడ్ లో 1991 నుంచి లింగ నిష్పత్తి క్రమంగా పడిపోవడం గమనార్హం. -
శివసేనపై విమర్శలకు దూరం: మోదీ
సంగ్లీ: మహారాష్ట్రలో బీజేపీకి పూర్తి ఆధిక్యం కట్టబెట్టాలని ఓటర్లను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. బాల్ థాకరే అంటే తమకెంతో గౌరవమని, అందువల్లే శివసేనపై విమర్శలకు దూరంగా ఉన్నట్టు మోదీ తెలిపారు. బాల్ థాకరే మరణించిన తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలివని గుర్తు చేశారు. నర్మదా ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం ఆపేసిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రధాని హామీయిచ్చారు. -
ఎల్బీటీ రద్దు ?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఆక్ట్రాయి (రవాణా సుంకం) బదులుగా ప్రవేశపెట్టిన ‘లోకల్‌బాడీ ట్యాక్స్’ (స్థానిక సంస్థల పన్నుల)ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారికంగా వివరాలు తెలిపేందుకు ఎవరూ ముందుకు రాకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో అప్రమత్తమయిన ప్రజాస్వామ్య కూటమి ఎల్బీటీపై ఒక అడుగు వెనక్కి తగ్గనుందని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎల్బీటీని రద్దు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారి పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకుని మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎల్బీటీని రద్దు చేయడం అనివార్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల్లో అనేక మందిని తమవైపు తిప్పుకోవడానికి ఎల్బీటీ రద్దు ఉపకరిస్తుందని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు సూచిస్తున్నట్టు సమాచారం. ఈవారంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఎల్బీటీని రద్దు చేసి వ్యాట్‌పై సర్‌చార్జీ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రాలయ వర్గాలు తెలిపాయి. ధరల దడ అయితే వ్యాట్‌పై సర్‌చార్జీ విధిస్తే రాష్ట్రంలోని అనేక వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై అందరితో చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయానికి రావొచ్చు. ముంబై మినహా రాష్ట్రంలోని 25 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆక్ట్రాయ్ రద్దు చేసి ఎల్బీటీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీటీ విధింపుపై వ్యాపారవర్గాలన్నీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల తీవ్రనష్టం వస్తోందని ఆక్షేపిస్తున్నాయి. ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తూ పలుసార్లు ఆందోళనలు నిర్వహించాయి. ఎల్బీటీకి బదులుగా వ్యాట్‌పై సర్‌చార్జి వసూలు చేయాలని ఇవి ప్రభుత్వానికి సూచించాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎల్బీటీ అమలుకే మొగ్గుచూపారు. దీంతో వాణిజ్యవర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీకి చేదు ఫలితాలను మిగిల్చాయి. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యాపార, వాణిజ్యవర్గాలను ఆకట్టుకునేందుకు డీఎఫ్ కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎల్బీటీని రద్దు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మున్సిపాలిటీలకు ముప్పే.. నిజానికి ఎల్బీటీ కారణంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా బలపడ్డాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయం రూ.14 వేల కోట్ల వరకు చేరింది. వ్యాట్‌పై ఒకటి లేదా రెండు శాతం సర్‌చార్జ్ వసూలు చేస్తే కేవలం రూ.1,300 కోట్ల వరకు ఆదాయం రానుంది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్ల మేర సబ్సిడీ ఇచ్చేందుకు జూన్‌లో ప్రకటించే బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఆర్థిక ఇబ్బందులతో తిప్పలు పడే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్ ద్వారా సుమారు రూ.65 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ల సబ్సిడీల కోసం వ్యాట్‌ను మరింత పెంచాల్సి ఉంటుంది. వ్యాట్ ఏయే ఉత్పత్తులపై పెంచాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తప్పనిసరి అయితే మద్యం, సిగరెట్, గుట్కా వంటి మత్తుపదార్థాలతోపాటు పెట్రోలియం ఉత్పత్తులపై పెంచవచ్చని చెబుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో మరోసారి అన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ పరిణామం డీఎఫ్ కూటమికి ఏ మేరకు లాభం చేస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
పుణేకు జల గండం!
పింప్రి, న్యూస్‌లైన్: పుణే వాసులకు నీటి గండం రాబోతుంది. నగర పరిధిలోని జలాశయాలు అడుగంటుతుండడంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణే విభాగంలో 57 తాలూకాలలో 27 తాలూకాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ తాలూకాలలో తాగునీటి కష్టాలు ఎదురవనున్నాయి. భూ జలాల పరిశోధన, అభివృద్ధి విభాగం జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, కొల్హాపూర్ ప్రాంతాల్లోని 57 తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పుణే జిల్లాలో 192 బావుల నీటి మట్టం పరిశీలించాం. అందులో 100 బావులలో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలోని 13 తాలూకాలలోని దౌండ్, పురంధర్, ఇందాపూర్, బారామతి తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సతారా జిల్లాలో 106 బావులలో భూగర్భ జలాలను పరిశీలిస్తే 45 బావులలో జలాలు అడుగంటాయి. 11 తాలూకాలలో సతారా, కోరేగావ్, మహాబలేశ్వర్, పాటణ్, తాలూకాలలో భూగర్భ జలాలు అడుగంటాయి. సాంగ్లీ జిల్లాలో 86 బావులలోని నీటి మట్టాలు పరిశీలించాం. 41 బావుల నీటి మట్టాలు అడుగంటిపోయాయి. పలుస్, కడేగావ్, ఖనాపూర్, శిరాళా, తాలూకాలలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. షోలాపూర్ జిల్లాలో 166 బావుల నీటి మట్టాలను పరీక్షించాం. 68 బావుల జలాలు అడుగంటాయని తేలింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర సోలాపూర్, కరమాళా తాలూకాలలో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొల్హాపూర్ జిల్లాలో 58 బావులలో నీటి జలాలు అడుగంటాయి. జిల్లాలోని పన్హాళా, రాధనగరి, గడహింగ్లాజ్, కాగల్, ఆజరా, చంద్గడ్, హతకణంగలే తాలూకాలలో నీటి సమస్య అధికంగా ఉందని, వర్షాలు ఎంత తొందరగా కురిస్తే సమస్య తీరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు.