దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర సంగ్లీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ప్రస్తుతం సంగ్లీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి సిద్దమయ్యాయి. అయితే తమ ప్రాణాలను కాపాడిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిపై అక్కడి మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. వారు తమకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు పూజలు చేశారు. సిబ్బంది నుదుటిపై తిలకాలు దిద్ది.. వారి చేతికి రాఖీలు కట్టారు. అలాగే వారికి హారతి కూడా ఇచ్చారు.
కాగా, సంగ్లీ, కొల్హాపూర్, సతారా జిల్లాలోని 4.5 లక్షల మందిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలించారు. సంగ్లీ జిల్లాలో వరద బాధితులను పడవలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న క్రమంలో కూడా ఓ మహిళ ఆర్మీ జవాన్‌కు పాదాభివందనం చేసిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment