NDRF teams
-
కృష్ణానది ఏటిపాయలో ప్రమాదం
పెనమలూరు: మిత్రులంతా కలసి సరదాగా మద్యం సేవించి ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం ఘాట్ కృష్ణానదిలో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లోని జారా రెస్టారెంట్ యజమాని అబ్దుల్‌రహీంబాషా (34) గురువారం రాత్రి తాను కొత్తగా కొన్న ఏపీ 39 ఆర్క్యూ 0786 కారులో విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన మిత్రులు ఈవెంట్స్ నిర్వహించే షేక్ ఖలీషా అలియాస్ పండు (30), కస్తూరిబాయిపేటకు చెందిన తాళ్లూరి కిరణ్ (37)తో కలిసి గురువారం రాత్రి చోడవరం ఘాట్ వద్దకు వచ్చారు. వీరు ఘాట్ సమీపంలో కృష్ణానది పాయ వద్ద మద్యం సేవించారు. ఆ తరువాత ముగ్గురు కృష్ణానదిలో ఈతకు దిగారు. ఈతకు దిగిన ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఉదయం వెలుగు చూసిన ఘటన.. కాగా శుక్రవారం ఉదయం నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వ్యక్తులకు నది పాయవద్ద ఖరీదైన కారు, మద్యం సీసాలు, దుస్తులు కనబడ్డాయి. వారికి అనుమానం వచ్చి నదిలో చూడగా అప్పటికే ఖలీషా మృతదేహం నదిలో తేలుతూ కనబడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి కారు వివరాలు మహిళా సంరక్షణ కార్యదర్శుల వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. గ్రూపుల్లో ఈ సమాచారం వ్యాపించడంతో కారు యజమాని అబ్దుల్‌రహీంబాషా వివరాలు తెలిశాయి. దీంతో కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న దుస్తులు, చెప్పులు చూసి తమ వారేనని ధ్రువీకరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. నీటిలో తేలుతున్న ఖలీషాను ఆ తరువాత వీరి గాలింపులో కారు యజమాని రహీంబాషా మృతదేహాన్ని బయటకు తీశారు. గల్లంతైన కిరణ్ ఆచూకీ తెలియలేదు. గల్లంతైన కిరణ్ కోసం శనివారం నదిలో గాలిస్తామని అధికారులు తెలిపారు. -
Video: ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి
బోరు బావులు చిన్నారుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల తెరిచి ఉంచిన బోరు బావిలో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న మావియా అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. జిల్లా లోని కోట్ల సాదత్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బావిలో నుంచి బాలుడి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చిన్నారిని కాపాడేందుకుసహాయక చర్యలు ప్రారంభించాయి. ముందుగా ఆక్సిజన్‌ను బోరుబావిలోకి పంపించారు. 5 గంటలు తీవ్రంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. చివరికి బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో బాలుడికి స్వల్ప గాయాలు కాగా.. అతడు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ బోరు బావి హాపూర్ మున్సిపాలిటీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం దీనిని తవ్విందని, చాలాకాలంగా ఇది నిరుపయోగంగా ఉందని తెలిపారు. సుమారు 35 ఏళ్ళ క్రితం ఈ బోరు బావిని తవ్వారని పేర్కొన్నారు. చదవండి: Honey Trap: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ.. వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. -
కామారెడ్డి జిల్లా: శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురు స్థానికులు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
వరద ఉధృతితో రెండు వాగుల మధ్య చిక్కుకున్న కూలీలు
-
లంక గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
-
ఏలూరు జిల్లా ముంపు మండలాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
-
ఆగిన ఆటోను ఢీకొన్న లారీ
సంగం: కుటుంబ సభ్యుడి కర్మకాండ ముగించుకుని దైవ సన్నిధిలో నిద్ర చేయడానికి వెళుతున్న ఓ పెద్ద కుటుంబం ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. మరో కుటుంబ సభ్యురాలిని పోగొట్టుకొని, ఇంకో ఐదుగురి జాడ తెలియక.. ప్రమాదం నుంచి బయట పడిన ఆరుగురు తల్లడిల్లిపోతున్నారు. ‘దేవుడా.. ఏమిటీ ఘోరం’ అని గుండెలవిసేలా రోదిస్తున్నారు. గురువారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న ఆటో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సంగం సమీపంలోని బీరాపేరు వాగులో పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరు పట్టణంలోని 22వ వార్డు జ్యోతినగర్‌కు చెందిన కర్రా నాగేంద్ర ఇటీవల మృతి చెందాడు. గురువారం కర్మకాండలు ముగియడంతో సంప్రదాయం ప్రకారం పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడం కోసం ఆటోలో 12 మంది కుటుంబ సభ్యులు ఆత్మకూరు నుంచి సంగం సంగమేశ్వరాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో బీరాపేరు వాగు వద్ద ఆటోను రోడ్డుపై నిలిపారు. ఇదే సమయంలో నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఓ లారీ ఆటోను ఢీకొంది. దీంతో పక్కనే ఉన్న బీరాపేరు వాగులోకి ఆటో పడిపోయింది. అందులో ఉన్న వారు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి వాగులోకి దిగారు. ఆ సమయంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరుగురిని కాపాడారు. నాగవల్లి (14) అనే బాలికను వాగులోంచి బయటకు తెచ్చినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో ఆత్మకూరు వైద్యశాలకు తరలించిన అనంతరం మృతి చెందింది. గల్లంతైన మరో ఐదుగురి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, జాలర్లు గాలిస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ కె వెంకటేశ్వరరావు, సంగం ఎస్సై నాగార్జునరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెంటనే స్పందించారు. ఆత్మకూరు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, పోలీసు అధికారులను అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
Telangana: ఊరు చెరువాయె.. జలదిగ్బంధంలో పట్టణాలు, గ్రామాలు
ఆకాశానికి చిల్లు పడిందా.. అన్నట్లు జడివాన. క్షణం తీరిక లేకుండా గురువారం వేకువజాము నుంచి కుండపోత. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా అన్నీ జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పొలాలు చెరువులుగా మారాయి. ఇదీ నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్ జిల్లాల పరిస్థితి. మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. కాగా, రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశముందని తెలిపింది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా పట్టిన ముసురు కుండపోతగా మారింది. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు నిండిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రెండు ఉమ్మడి జిల్లాల్లో కుండపోత రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత కురిసింది. రికార్డుస్థాయిలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 27.3 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 24.5 సెంటీమీటర్లు నమోదైంది. నిర్మల్ జిల్లాలో మొత్తం జిల్లావ్యాప్తంగా 20.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. ఇప్పటికే 62 శాతం అధికం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికితోడు రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. నైరుతి సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 29.2 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి గురువారం నాటికే 47.4 సెంటీమీటర్లు కురిసిందని.. ఇది 62 శాతం అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదుకాగా.. 12 జిల్లాల్లో అధికం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 4.42 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయిందని వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ చుట్టూ వరద నీరు మరో రెండు రోజులు భారీ వర్షాలు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత వానలు పడేతాయని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి నాగరత్న వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. హైదరాబాద్‌లో ఆగని వాన హైదరాబాద్ మహానగరం మూడు రోజులుగా ముసురుపట్టే ఉంది. మంగళవారం రాత్రి మొదలైన వాన శుక్రవారం తెల్లవారుజాము వరకు సన్నగా కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. భద్రాచలంలో పర్ణశాలలోకి చేరిన నీరు ఉమ్మడి ఆదిలాబాద్: ఆగమాగం భారీ వర్షాలు కురవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆగమాగమైంది. జిల్లావ్యాప్తంగా సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నది, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్, నేరడిగొండ, సిరికొండ, బోథ్, బజార్హత్నూర్ మండలాల్లోని 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాణి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ల మధ్య ప్రధాన రహదారులపైనా నీళ్లు ప్రవహిస్తున్నాయి. దహెగాం, ఆసిఫాబాద్, పట్టణాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. వేమనపల్లి మండలం నీల్వాయిలో వాగు ఉధృతికి రోడ్డు తెగిపోయి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్ మండలం ధనోర(బి) గ్రామశివారులో వాగులో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. ఉమ్మడి నిజామాబాద్: వదలని వాన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేని వానలతో జనజీవనం స్తంభించింది. మొత్తం 968 చెరువులు ఉండగా 381 చెరువులు అలుగు పారుతున్నాయి. పలుచోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. ఇరవై వరకు ఇండ్లు కూలిపోయాయి. మెండోరా మండలం సావెల్ గ్రామ శివారులో సాంబయ్య ఆశ్రమం భక్తులు ఏడుగురు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సహాయంతో రక్షించాయి. రెంజల్ మండలంలోని త్రివేణి సంగమ క్షేత్రం కందకుర్తి వద్ద శివాలయం నీట మునిగింది. కామారెడ్డి జిల్లాలో కౌలాస్ నాలా ప్రాజెక్టు, సింగీతం రిజర్వాయర్, కల్యాణి ప్రాజెక్టు నిండిపోయాయి. మంజీరా నదిలో వరద పెరిగింది. బోథ్ మండలం ధన్నూర్(బి) వాగులో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న పోలీసులు ఉమ్మడి కరీంనగర్: ఎటు చూసినా వరదే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా వణికిపోయింది. ముఖ్యంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్లలో కొన్ని పాత ఇండ్లు కూలిపోయాయి. సిరిసిల్లలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. కరీంనగర్ పట్టణంలోని పలు రహదారులు చెరువుల్లా మారాయి. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నెల 4వ తేదీనే ప్రారంభించిన ఈ భవనం కొన్ని విభాగాల్లో వాన నీళ్లు లీక్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో భుజాల లోతున చేరిన నీళ్లు ఉమ్మడి వరంగల్: రాకపోకలు బంద్ వరంగల్ నగర పరిధిలోని 66 డివిజన్లలో 89 కాలనీలు జలమయం అయినట్టు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో ఎనిమిది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో వాగులు, వంకలు పొంగడంతో గిరిజనులు నిత్యావసరాల కోసం అవస్థలు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం: మూడు రోజులుగా వాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా వాన కురుస్తూనే ఉంది. కిన్నెరసాని, తాలిపేరు, లంకాసాగర్ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. వైరా రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో ముసలిమడుగు, స్నానాల లక్ష్మీపురం గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 15.9 అడుగులకు చేరింది. చలి పెడ్తోంది రెండు రోజులుగా ముసురుపట్టేసి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల మధ్య.. గరిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టు వెల్లడించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Maharashtra Rains: మహారాష్ట్రలో కుండపోత
సాక్షి ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లులు పడ్డాయన్నట్టుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యా యి. ముంబైతోపాటు ముఖ్యంగా కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో దాదాపు నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. అనేక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు ముంబై – పుణే, ముంబై – నాసిక్ మార్గాలపై రైళ్ల రాకపోకలు గురువారం స్తంభించాయి. ఇంకోవైపు జలాశయాలన్ని నిండిపోయాయి. దీంతో ముఖ్యంగా రత్నగిరి జిల్లాలోని చిప్లూన్ తాలూకాతోపాటు కొల్హాపూర్‌లో జిల్లాలో పంచగంగా, వైశిష్ట, శివ నదులలో వచ్చిన వరదల కారణంగా ఇళ్లల్లోని నీరు చొరబడింది. మరోవైపు వరద నీటిలో వేలాది మంది చిక్కుకుపోయారు. ఒక్క చిప్లూన్లోనే అయిదు వేల మందికిపైగా వరదల్లో చిక్కుకున్నారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక యంత్రాంగంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైన్యం, నేవీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ ఇంకా అనేక మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం వేచిచూస్తున్నారు. 2005 తర్వాత ఇంత భారీ ఎత్తున వరదలు మళ్లీ ఇప్పుడే వచ్చాయంటూ అనేక మంది స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. చిప్లూన్ పట్టణం పూర్తిగా జలమయమైంది. పట్టణంలోని మార్కెట్‌తోపాటు అనేక ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చేశాయి. ఇలా సుమారు 12 అడుగుల నీరు చేరింది. దీంతో అనేక మంది టెర్రస్పైకెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొల్హాపూర్‌లోని చిఖలీలో గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముంపుకు గురైంది. దీంతో గ్రామంలోని వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ చేపట్టింది. థానే జిల్లాలో వరద చుట్టుముట్టడంతో ఎత్తైన ప్రాంతానికి చేరుకుని సాయం కోసం చూస్తున్న ప్రజలు రత్నగిరి జిల్లాలోని పరశురాం ఘాట్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందారు. వార్దా జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వరద నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయారు. రత్నగిరి జిల్లాలో జాగ్బుడి, వశిష్టి, కొడావలి, శాస్త్రి, భావ్ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగుతున్నాయి. చిప్లూన్, ఖేడ్, లాన్జా, రాజ్పూర్, సంగమేశ్వర్ పట్టణాలను వరద నీరు ముంచెత్తింది. ఎడతెరపిలేని వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. గురువారం ముఖ్యమంతి ఉద్దవ్ ఠాక్రే పరిస్థితిని సమీక్షించారు. భారత వాతావరణ శాఖ తీర ప్రాంత జిల్లాల్లో మరో మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం... ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం రవాణ వ్యవస్థపై పడింది. రోడ్డు, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా ముంబైకి సమీపంలోని టీట్‌వాలా, వాంగణీతోపాటు బద్లాపూర్, అంబర్నాథ్లలో కురిసిన వర్షం కారణంగా గురువారం తెల్లవారుజామున వరద నీరు రైల్వేట్రాక్‌పై చేరింది. రైళ్ల రాకపోకలు స్తంభించాయి. మరోవైపు కసారాలో కొండచరియలు విరిగి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో ముంబై – నాసిక్, ముంబై – పుణేల మధ్య నడిచే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక రైళ్లు ఎక్కడికక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. ముంబై నుంచి షోలాపూర్ బయలుదేరిన సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం అర్దరాత్రి నుంచి బద్లాపూర్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. దీంతో ఈ రైల్లోని ప్రయాణికులు సుమారు 11 గంటలకుపైగా ఒకే రైల్వే స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. అనంతరం సెంట్రల్ రైల్వే ఈ రైలును బద్లాపూర్లోనే రద్దు చేసింది. అనంతరం అదే రైలును తిరిగి వీటి వరకు నడిపింది. మరోవైపు ఇగత్పురి రైల్వేస్టేషన్లో కూడా అనేక రైళ్లు రద్దు చేశారు. దీంతో ఇగత్పురి రైల్వేస్టేషన్ నుంచి ముంబైకి వచ్చే ప్రయాణికుల కోసం సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. ఇలా మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎంఎస్‌ఆర్‌టిసి) బస్సుల ద్వారా ముంబైకి తరలించారు. ఆరువేల మందికి పైగా ప్రయాణికులు ఇలా పలుచోట్ల చిక్కుకుపోయారు. చాలా సమయంపాటు పిల్లలు, వృద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతోపాటు ముంబై నుంచి హైదరాబాద్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ౖఅనేక రైళ్లను ముఖ్యంగా ముంబై – పుణే రైల్వే మార్గంపై అనేక రైళ్లను రద్దు చేశారు. అదేవిధంగా ముంబై – నాసిక్ మార్గంతోపాటు కోంకణ్ మార్గంలో కూడా పలు రైళ్లను రద్దు చేశారు. దీంతోపాటు ముంబై గోవా మార్గంపై కూడా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుకు గురయ్యారు. అనేక వాహనాలు వరద నీటిలో మునిగిపోగా... మరికొన్ని కొట్టుకుపోయాయి. ఉద్దవ్‌కు మోదీ ఫోన్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని వరద పరిస్థితిపై ఆరా తీశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మహారాష్ట్రకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్ర అధికారులకు సహాయపడుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడాను. వరద నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్నిరకాల సహాయసహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపాను’ అని మోదీ ట్వీట్ చేశారు. -
కోస్తాను ముంచెత్తిన వాన
సాక్షి, అమరావతి: రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరాల్లోని అనేక అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృత రూపం దాల్చింది. కృష్ణా కరకట్టపై ఉన్న ఇళ్లలోకి నీరు వస్తోందని, ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురికి హెచ్చరికలు జారీ చేశారు. వాగుల్లా మారిన రహదారులు – భారీ వర్షాలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం వాగులను తలపిస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. – విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరంలోని ఉప్పులేరు పొంగడంతో పడవలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని గోస్తని, శారదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. – భారీ వర్షాలు, గాలులతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. కోత, పొట్టదశలో ఉన్న వరి నీట మునిగింది. భారీ గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు, చెరువు గట్లకు గండ్లు పడ్డాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు తరలింపు – వరద ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మందులు, నిత్యావసర వస్తువులను అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు తెలిపారు. – రహదారులు, కాలువలు, వంతెనలకు గండ్లు పడి రవాణాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు. – ఎక్కడకు కావాలంటే అక్కడికి సహాయ కార్యక్రమాల కోసం తరలించడానికి వీలుగా విశాఖపట్నం జిల్లాలో మూడు జాతీయ విపత్తు సహాయక దళాలను (ఎన్డీఆర్ఎఫ్) సిద్ధంగా ఉంచారు. కాకినాడలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. – సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 129 మండలాల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్లలో 24 గంటలూ కంట్రోల్ రూమ్‌లు – వరద ప్రభావిత జిల్లాల్లోని కలెక్టరేట్లలో రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్‌లు పని చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించారు. – నిత్యం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా పంపాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో జలవనరులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 327 బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఆ శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం – నర్సాపూర్ మధ్య కాకినాడకు 30 కి.మీ దూరంలోని నేమం ప్రాంతంలో తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలివేగం ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.. వాయుగుండం ప్రభావం సముద్రంపై ఇంకా కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం కోస్తా తీరంలో సముద్రం అలలు 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ప్రమాదం ఉండటంతో పర్యాటకులు, మత్స్యకారులు తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. -
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఉంపన్ తుపాను బీభత్సం
-
కృష్ణా నది మధ్యలో ఆర్తనాదాలు
-
నిమజ్జనంలో అపశృతి..
-
నిమజ్జనంలో అపశ్రుతి.. చావుతో పోరాడిన యువకుడు
సాక్షి, విజయవాడ : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రకాశం బ్యారేజ్‌లోని సీతమ్మ వారి పాదాల ఘాట్ వద్ద గణేష్ నిమజ్జానాన్ని తిలకిస్తున్న ఓ యువకుడు బ్యారేజ్‌లో పడిపోయాడు. వరద ప్రవాహానికి ఆ యువకుడు చాలా దూరం కొట్టుకుపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తం కావడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ చావుతో పోరాడుతున్న యువకుడిని ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు నరేష్ సోనియా రెస్క్యూ చేసి కాపాడారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొన్నూరు సుధాకర్‌గా గుర్తించారు. కాగా, ప్రాణాలకు తెలిగించి యువకుడిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సందర్శకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రెస్య్యూ చేసి యువకుడిని కాపాడిన నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యారేజ్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
ప్రకాశం బ్యారేజ్: ఆ పడవను తొలగించారు!
సాక్షి, విజయవాడ: వరద ఉధృతికి కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ 68వ గేట్‌కు అడ్డుపడిన పడవను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎట్టకేలకు విజయవంతంగా తొలగించారు. బ్యారేజ్‌కు ఎటువంటి నష్టం కలుగకుండా బెకెమ్ కంపెనీ ఇంజినీర్ల సాయంతో బోటు తొలగించారు. ఎలాంటి నష్టం లేకుండా ఈ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పడవను తీసేయడంతో ప్రకాశం బ్యారేజ్ 68వ గేట్‌ను అధికారులు దించనున్నారు. కృష్ణ వదర ప్రవాహానికి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్‌కు అడ్డంగా నిలిచిన పడవను తొలగించడానికి ఐదు రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎగువ ప్రాంతం నుంచి 22 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండటంతో ఈ పడవను తొలగించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పడవ తొలగింపునకు రెండు వించులు,రెండు భారీ క్రేన్లు, 50 ఎంఎం స్టీల్ రోప్‌ను వినియోగించారు. బోటు తొలగింపు చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందంతోపాటు బెకెమ్ కంపెనీ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ముంపులోనే లంక గ్రామాలు!
సాక్షి, అమరావతి/కొల్లూరు/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ నదీ తీరంలోని లంక గ్రామాల్లో ఆదివారం కూడా వరద ముప్పు కొనసాగింది. గుంటూరు జిల్లాలో ప్రధానంగా తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, అమరావతి, దాచేపల్లి మండలాల్లో 29,754.75 ఎకరాల్లో ఉద్యాన, వాణిజ్య పంటలు నీట మునిగాయి. మిరప, అరటి, బొప్పాయి, నిమ్మ, మామిడి, కొబ్బరి, జామ, పసుపు, కంద, కూరగాయల తోటలు, పూల తోటలు, పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా వెళ్లి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. లంక గ్రామాల్లో కొంత నీరు తగ్గినప్పటికీ పంట పొలాల్లో మాత్రం అలానే ఉండటంతో పంటలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అమరావతి– విజయవాడ మధ్య ఇంకా రాకపోకలు సాగడం లేదు. సహాయక బృందాలకు ప్రశంసలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. గత రెండు రోజుల్లో అన్నవరపులంకలో 100 మందిని, జువ్వలపాలెంలో 50 మందిని, పల్లెపాలెంలో 80 మందిని వరద ముప్పు నుంచి ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. రెండు జిల్లాల్లో 23,551 మందిని సహాయ శిబిరాలకు తరలించాయి. శిబిరాల్లో బాధితులకు భోజనం, వైద్యం, వసతి సౌకర్యాలు కల్పించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్లో విధులు నిర్వహించిన ఫైర్ సిబ్బంది సేవలకు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ముంపు ప్రాంతం నుంచి బోటులో తీసుకొచ్చిన బాలింతను కిందకు దించేందుకు ఓ ఫైర్ ఉద్యోగి తనే స్టూల్గా మారి బాలింతకు ఊతమిచ్చాడు. ఆయన వీపుపై కాలు మోపి ఆ బాలింత సురక్షితంగా కిందకు దిగింది. శనివారం జరిగిన ఈ సన్నివేశం ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సుచరిత వరదల కారణంగా నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే వరదలపై సమీక్ష నిర్వహించి నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు. కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో మరొకరు వరద కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. వరదల ప్రభావం గుంటూరు జిల్లాలో 53 గ్రామాలపైనా, కృష్ణా జిల్లాలో 34 గ్రామాలపైనా ఉందన్నారు. రెండు జిల్లాల్లో 17,491 మంది వరద ముంపు బారిన పడ్డారని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపడుతున్నామని, ఆహార పొట్లాలు, పెరుగు, పాలు, తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లూరు, దోనేపూడి గ్రామాల్లో కరకట్ట దిగువన వరద ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసీ దిలీప్‌కుమార్, ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్, డీఎస్పీ శ్రీలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కొల్లిపరలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కలెక్టర్ శామ్యూల్ వరద పరిస్థితిపై ఆరా తీశారు. కొల్లూరు, పెసర్లంకలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పర్యటించారు. హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువలకు గండ్లు బొమ్మనహాళ్/ఉరవకొండ: తుంగభద్ర, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నా కాలువలకు అడుగడుగునా గండ్లు పడుతుండటంతో ఆశలు ఆవిరవుతున్నాయి. ఆదివారం హెచ్చెల్సీ కాలువకు, హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీకి గండ్లు పడి నీరు వృథా అయ్యాయి. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు బొమ్మనహాళ్ మండలంలోని మైలాపురం సమీపంలో 122–200 కిలోమీటరు వద్ద ఆదివారం గండి పడి నీరు వృథాగా పారింది. కాగా, హంద్రీ నీవా 34వ ప్యాకేజీలో భాగంగా నిర్మించిన డీ2 డిస్ట్రిబ్యూటరీ కాలువకు భారీ వర్షంతో మూడు చోట్ల గండి పడింది. వరద నీటిలో బోటు కార్మికుడి గల్లంతు భట్టిప్రోలు(వేమూరు):కృష్ణా నది లంక గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన బోటు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మరొక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లూరు మండలం ఈపూరులంక నుంచి బోటులో పెదపులివర్రు వైపు వస్తుండగా విద్యుత్ తీగలు అడ్డుపడ్డాయి. వాటిని చేతితో పైకెత్తడంతో రేపల్లె మండలం పెనుమూడికి చెందిన వల్లభనేని వెంకట్రాజు (27) షాక్‌కు గురై బోటులోంచి వరద నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఒడుగు ప్రభుదాస్ (37) కూడా షాక్‌కు గురికాగా.. అతడు బోటులో పడిపోయాడు. అతడిని తోటి కార్మికులు వెల్లటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. గల్లంతైన వెంకట్రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాఖీలు..
దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర సంగ్లీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ప్రస్తుతం సంగ్లీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి సిద్దమయ్యాయి. అయితే తమ ప్రాణాలను కాపాడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిపై అక్కడి మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. వారు తమకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పూజలు చేశారు. సిబ్బంది నుదుటిపై తిలకాలు దిద్ది.. వారి చేతికి రాఖీలు కట్టారు. అలాగే వారికి హారతి కూడా ఇచ్చారు. కాగా, సంగ్లీ, కొల్హాపూర్, సతారా జిల్లాలోని 4.5 లక్షల మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలించారు. సంగ్లీ జిల్లాలో వరద బాధితులను పడవలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న క్రమంలో కూడా ఓ మహిళ ఆర్మీ జవాన్‌కు పాదాభివందనం చేసిన సంగతి విదితమే. -
మారేడ్‌పల్లి రిలయన్స్ ఫైర్‌సేఫ్టీలో పేలుడు..
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడుతో పాటు మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మరికొందరికి గాయాలయ్యాయి. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని సయ్యద్ జలాల్ గార్డెన్ వద్ద ప్లాట్ నంబర్–5లో రిలయన్స్ ఫైర్‌సేఫ్టీ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ నడుస్తోంది. కంపెనీ ఎండీగా అరుణ్ ఆంథోనీరాజ్ వ్యవహరిస్తున్నారు. చర్లపల్లిలో ఫ్యాక్టరీ ఉండగా మారేడుపల్లిలో రెండతస్తుల భవనంపై రేకుల షెడ్డును గోదాంగా వాడుతున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఇందులో నిల్వ ఉంచారు. బుధవారం ఉదయం 11.45 నిమిషాల ప్రాంతంలో పైఅంతస్తులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం ధ్వంసం కావడంతో పాటు స్థానికంగా ఉన్న పలువురి ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత భవనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంస్థలో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్న జంగా రాజు సజీవ దహనమయ్యాడు. రాజు పశ్చిమ గోదావరి జిల్లా దద్దులూరు గ్రామానికి చెందిన వాడు. పలువురికి గాయాలు.. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో జంగా రాజుతో పాటు అక్కడే పనిచేస్తున్న అతడి బావమరిది ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్మాయిల్ కింది అంతస్తులో ఉండగా, రాజు పైఅంతస్తులో ఉన్నాడు. పేలుడు జరిగిన వెంటనే మంటలు వచ్చాయని, మంటల్లో రాజు సజీవ దహనమయ్యాడని ఇస్మాయిల్ కన్నీరుమున్నీరయ్యాడు. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో మరో వ్యక్తి పైఅంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించగా శిథిలాలు మీద పడటంతో గాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పుతున్న సమయంలో మరోసారి పేలుడు సంభవించడంతో అగ్నిమాపక బృందం వెంకటేశ్ కొద్దిదూరం ఎగిరిపడ్డాడు. వెంకటేశ్ తలకు హెల్మెట్ ఉండటంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు రంగలోకి దిగింది. జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని మారేడ్‌పల్లి సీఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రమాదం గ్యాస్ సిలిండర్ కారణంగా జరిగిందా.. లేదా ఫైర్‌సేఫ్టీ పరికరాల వల్ల జరిగిందా అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని చెప్పారు. -
కేరళ వరదలు : డాబాపై అతిపెద్ద ‘థ్యాంక్స్’
కొచ్చి : ప్రకృతి ప్రకోపానికి కేరళ చివురుటాకులా వణికిపోతుంది. కేరళను ముంచెత్తిన వర్షాలతో ఎక్కడ చూసినా హృదయవిదారకర సంఘటనలే కనిపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్స్ అందిస్తున్న సహాయం అంతా ఇంతా కాదు. రేయింబవళ్లు శ్రమిస్తూ.. వరదల్లో బిక్కుబిక్కుమంటున్నవారిని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. సరైన సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఇతర ప్రభుత్వ బృందాలు రావడంతోనే తాము ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు కృతజ్ఞత భావంతో కన్నీంటిపర్యంతమవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, నేవి ఇతర బలగాలు అందిస్తున్న సహాయ చర్యల వీడియోలు, ఫోటోలు ఎప్పడికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. బలగాలు అందిస్తున్న సహాయ చర్యలకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతల మెసేజ్‌లు పంపిస్తూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ ఇంటి నుంచి నేవి రెస్క్యూ ఆపరేషన్స్‌కు అతిపెద్ద కృతజ్ఞత అందింది. అదేమిటంటే.. కొచ్చిలో ఓ ఇంటి డాబాపై అతిపెద్దగా ‘థ్యాంక్స్’ చెబుతూ పేయింట్ చేశారు. నేవి రెస్క్యూ ఆపరేషన్స్‌కు సెల్యూట్ చెబుతూ ఈ ‘థ్యాంక్స్’ మెసేజ్ పేయింట్ చేశారు. గత మూడు రోజుల క్రితమే ఆ ఇంటి నుంచి ఇద్దరు మహిళలను నావల్ ఏఎల్‌హెచ్ పైలెట్ సీడీఆర్ విజయ్ వర్మ కాపాడారు. ఈ ‘థ్యాంక్స్’ మెసేజ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యూలేట్ అవుతుంది. ఇది కేవలం ప్రజల మన్ననలు పొందడమే కాకుండా.. కేరళలో రెస్క్యూ ఆపరేషన్స్ అందిస్తున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. ఈ థ్యాంక్స్ మెసేజ్‌కు.. ‘ఇది మా ఇండియా’ అని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. మరో యూజర్ వావ్.. ఇది నేవి, మిలటరీ, ఎయిర్ ఫోర్స్, వాలంటీర్స్, ఇతరులకు మంచి బూస్ట్‌ను అందిస్తుందని చెప్పాడు. ఇటీవల నొప్పులతో సతమతమవుతున్న ఓ గర్భవతిని నేవి సిబ్బంది కాపాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. కేరళలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుణుడి ప్రకోపానికి బలైన కేరళకు యావత్ దేశం తమ వంతు సహాయం అందిస్తోంది. భారీ ఎత్తున విరాళాలు, ఆహారం, దుస్తులు పంపుతున్నారు. వరదల తాకిడికి తట్టుకోలేక ఇప్పటికే అక్కడ 370 మంది ప్రాణాలు విడిచారు. 19వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ, కేరళకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లను ప్రకటించారు. #Kerala: A 'Thanks' note painted on the roof of a house in Kochi from where the Naval ALH piloted by Cdr Vijay Varma had rescued two women on August 17. pic.twitter.com/lwxHkQwzXc Wow.. I hope this would be the biggest boost to the rescuers Navy, military,air force, volunteers and others etc..... — R.Praveen (@Real_Praveen003) August 20, 2018 — ANI (@ANI) August 20, 2018 -
ఆకట్టుకున్న‘ప్రళయ్ సహాయ్’
-
ఆకట్టుకున్న‘ప్రళయ్ సహాయ్’
సాక్షి, హైదరాబాద్: భారతీయ రక్షణ దళం దక్షిణ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రళయ్ సహాయ్ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి హుస్సేన్‌సాగర్ వేదికైంది. ఆకస్మిక వరదలు విపత్తుల సందర్భంగా చేపట్టే అత్యవసర సహాయక సేవలు, పునరావాస కార్యక్రమాలపై ప్రదర్శనలను (మాక్‌డ్రిల్) ఏర్పాటు చేశారు. భారతీయ రక్షణ, విమాన, నావికా దళాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ విభాగాలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. నగరంలో భారీ వరద సంభవిస్తే మునిగిన ఇళ్లు, భవనాల నుంచి ప్రజలను ఏవిధంగా రక్షించాలనే దానిపై సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. దీని కోసం హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయిన ఇళ్లు, భవనాలు, విద్యాసంస్థలు, వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాల్లో ప్రజలు చిక్కుకున్నట్లు కేకలు వేస్తూ కనిపించారు. వారిని సైనికులు స్పీడు బోట్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు హెలికాప్టర్ నుంచి సైన్యం సాగర్‌లోకి తాడు సాయంతో దిగడం, వారు పడవల ద్వారా నీట మునిగిన భవంతుల వద్దకు చేరుకుని వాటిల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం వంటివి ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ విన్యాసాలను లెఫ్టినెంట్ జనరల్ పీఎం హరీద్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వీక్షించారు. -
ముంచుకొస్తున్న కార్చిచ్చు.. 1500 గ్రామాలు బిక్కుబిక్కు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అడవిలో పుట్టిన కార్చిచ్చు .. అంతకంతకూ విస్తరిస్తూ.. చుట్టుపక్కల ఉన్న 1500 గ్రామలకు పెనుముప్పుగా మారింది. అడవిని శరవేగంగా దహిస్తున్న దావానలం.. ఆదివారం నాటికి సమీపంలోని గ్రామాలపై విరుచుకుపడే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా జాతీయ విపత్తు నిరోధక దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన మూడు బృందాలను రంగంలోకి దింపింది. ప్రస్తుతం అడవిలోని 50 ప్రాంతాల్లో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తున్నది. మంటలు ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో సమీపంలోని ప్రజలకు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. శుక్రవారం అడవిలో పుట్టిన ఈ మంటలు అదే రోజు రాత్రికి సమీపంలోని గ్రామాలకు పాకిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మంటలను అదుపు చేయడానికి గ్రామస్తులు, ప్రభుత్వ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం 135మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించింది. ఉత్తరాఖండ్‌లో శుక్రవారం నుంచి విస్తరిస్తూ.. స్థానికంగా భయాందోళనలు రేపుతున్న కార్చిచ్చుపై కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.