
సాక్షి, విజయవాడ : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రకాశం బ్యారేజ్‌లోని సీతమ్మ వారి పాదాల ఘాట్ వద్ద గణేష్ నిమజ్జానాన్ని తిలకిస్తున్న ఓ యువకుడు బ్యారేజ్‌లో పడిపోయాడు. వరద ప్రవాహానికి ఆ యువకుడు చాలా దూరం కొట్టుకుపోయాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం అప్రమత్తం కావడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ చావుతో పోరాడుతున్న యువకుడిని ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యుడు నరేష్ సోనియా రెస్క్యూ చేసి కాపాడారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొన్నూరు సుధాకర్‌గా గుర్తించారు. కాగా, ప్రాణాలకు తెలిగించి యువకుడిని కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని సందర్శకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రెస్య్యూ చేసి యువకుడిని కాపాడిన నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యారేజ్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment