prakasham barrage
-
బ్యారేజ్‌లో బోట్లు వదిలారనడం సరికాదు: సీపీఐ నేతలు
సాక్షి,విజయవాడ:ప్రకాశం బ్యారేజ్‌లో ఉద్దేశపూర్వకంగానే బోట్లు వదిలారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలకు కొట్టుకొచ్చిన బోట్లను మంగళవారం(సెప్టెంబర్17) సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.‘గతంలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది.చంద్రబాబు వస్తే కరువు వచ్చేదని అనేవారు.ఈసారి అతివృష్టి వచ్చింది.వరదకు మొత్తం కొట్టుకుపోయింది.ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఇలాంటివి జరగుతాయి. వీటిని భరించక తప్పదు.బ్యారేజ్‌ను కూల్చేయడానికే బోట్లు వదిలారనే వాదన సరికాదు.డీపీ నేతలు అతిశయోక్తి మాటలు మానుకోవాలి.వాస్తవాలు మాట్లాడాలి.రాష్ట్రప్రభుత్వం అసలైన దొంగలను గుర్తించాలి.1902లో బుడమేరు యుటి(అండర్ టన్నెల్)కట్టారు.తక్షణమే ఈ ప్రభుత్వం బుడమేరు యుటి షేప్‌ను మార్చాలి.ఇప్పటి వరకు బోట్లేసుకుని తిరిగిన చంద్రబాబు బుడమేరు యుటి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధపడి అయ్యో అమ్మోఅని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు.చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి.యుద్ధప్రాతిపదికన రీ మోడల్ చేయాలి’అని నారాయణ డిమాండ్ చేశారు.గ్రామాల్లో సాయమేది..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్కొల్లేరు టు బుడమేరు పర్యటించాంవరదల సమయంలో సీఎం,మంత్రులు అంతా విజయవాడపైనే దృష్టిపెట్టారుగ్రామాల్లోకి వెళితే తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు చెబుతున్నారుఅధికారులెవరూ తమ వద్దకు రాలేదంటున్నారువేల ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదుప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారుగిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదుచంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చింది..సంతోషంగ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందిబుడమేరు మాదిరిగానే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైందిపెద్ద పెద్ద కోటీశ్వరులు కొల్లేరును ఆక్రమించుకున్నారుబుడమేరు మాదిరి కొల్లేరును కూడా ప్రక్షాళన చేయాలికొల్లేరు,0బుడమేరు ఆక్రమణల పై సీఎం చంద్రబాబును కలుస్తాంఅవసరమైతే కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా కొల్లేరు సమస్యను తీసుకెళతాంఇదీ చదవండి.. వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది: బొత్స -
బోటు రాజకీయంలో బోల్తాపడ్డ టీడీపీ
-
వీడియో: ఆ బోట్లు టీడీపీవే.. ఇదిగో మరో సాక్ష్యం
సాక్షి, తాడేపల్లి: ఇటీవల ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టింది టీడీపీ నేతల బోట్లేనని తెలిసినా పచ్చ పార్టీ నేతలు మాత్రం ఇంకా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక, బోట్లకు సంబంధించిన మరో సాక్ష్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీన్నీ వైఎస్సార్సీపీ బహిర్గతం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా పచ్చ మంద.. వైఎస్సార్సీపీపై నిందలు వేస్తోంది. ఇంతకంటే దిక్కుమాలినతనం మరొకటి ఉంటుందా చంద్రబాబు? అని ఘాటు విమర్శలు చేసింది.#Prakashambarrage🚨 Big Expose Alert! 🚨 ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా… pic.twitter.com/snqtMSm9mx— YSR Congress Party (@YSRCParty) September 10, 2024 ఇది కూడా చదవండి: ‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’ CMగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ, TDP కార్యకర్తలు వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవల ర్యాలీ నిర్వహించారు. అందులో కృష్ణా బ్యారేజిని గుద్దిన టీడీపీ బోటు కూడా ఉంది. ఆ బోటుపై TDP జండాలు చూడచ్చు. pic.twitter.com/NFRdhqnTQE— Anitha Reddy (@Anithareddyatp) September 10, 2024 -
ఊపిరి పీల్చుకుంటున్న బెజవాడ
-
‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’
సాక్షి, విజయవాడ: టీడీపీ బండారం బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల వ్యవహారంలో కుట్ర కోణం ఉందంటూ కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు సర్కార్.. వైస్సార్సీపీపై ఆ నెపాన్ని నెట్టేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు నాలిక కర్చుకుంది. మొన్నటి వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి ఢీకొన్న బోట్లు టీడీపీకి చెందిన వారివే అని అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో, పచ్చ పార్టీ కార్యకర్తలు ఉషాద్రి, రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.‘ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చిన బోట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలవే. బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్తే. పోలీసులు విచారణలో బోట్లు మొత్తం తనవే అని ఉషాద్రి అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో, టీడీపీ మంత్రులు.. వైఎస్సార్సీపీపై చేసిన ఆరోపణలు పటాపంచలయ్యాయి. పచ్చ పార్టీ నేతల కామెంట్స్ తప్పు అని మరోసారి రుజువైంది. ఇక, నారా లోకేష్‌తో కూడా బోటు యజమాని ఉషాద్రి అనేక సార్లు ఫోటోలు దిగారు. ప్రశాకం బ్యారేజ్‌కి కొట్టుకొచ్చిన బోట్లు లైసెన్స్‌లు తన పేరు మీదనే ఉన్నట్టు ఉషాద్రి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉషాద్రి, రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు అని వైస్సార్సీపీ ఆ ఆరోపణలను ఎక్స్ వేదికగా ఖండించింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు @naralokesh కు సన్నిహితుడేప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను @ncbn ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో… https://t.co/Q3Tu2gr4Aa pic.twitter.com/KsBUI0ICag— YSR Congress Party (@YSRCParty) September 9, 2024ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్ కు సన్నిహితుడే. బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రామ్మోహన్ పేరుమీద ఒక్క బోటు కూడా లేదు. నాలుగైదేళ్ల క్రితమే తన బోట్లను అమ్మేశారు. పైగా రామ్మోహన్ టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరామ్‌కు సమీప బంధువు.ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైఎస్సార్సీపీతో సంబంధాలు లేవని స్పష్టంచేసినా పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టుచేశారు. నారా లోకేష్‌తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనేదానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు. పబ్లిసిటీ పిచ్చిలో వరద బాధితుల్ని గాలికి వదిలేయడంతో ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వంపై జనం ఉమ్మేస్తున్నారు. దాన్ని తుడవడానికి ఎల్లో మీడియా ముప్పుతిప్పలు పడుతోంది. ఇప్పట్లో వరద బాధితుల ఆగ్రహం తగ్గేలా లేదు. దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి తలాతోక లేని బోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఫేక్ ప్రచారమా టీడీపీ?. మీరు ఇలా ఎన్ని జిత్తుల మారి వేషాలేసినా.. విజయవాడని ముంచిన మీ పాపాన్ని కడుక్కోలేరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది YSRCP.ఇక.. ప్రకాశం గేట్లను ఢీ కొట్టిన ఘటనపై విచారణలోకీలక విషయాలు బయటపడ్డాయి. బోట్లను ఇనుప గొలుసులతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని సమాచారం. అలాగే.. గొల్లపూడి నుంచి బోట్లు నిలిపిన ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి.. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయని దర్యాప్తులో వెలుగు చూసింది. -
ప్రకాశం బ్యారేజ్ కు మళ్ళీ పెరుగుతున్న వరద
-
ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు బంద్
-
అలర్ట్: ప్రకాశం బ్యారేజ్‌కు వరద హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌కు వరద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, పులిచింతల నుంచి దిగువకు నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కు రెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో, అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇదే సమయంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు.. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లోకి ఇన్ ఫ్లో 88,879 క్యూసెక్కులుగా ఉండగా.. సముద్రంలోకి 71,650 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. ఇక, కాలువల ద్వారా 17,229 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాగా, రెండు అడుగుల మేర 30 గేట్లు, ఒక్క అడుగు మేర 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. -
గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్‌పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద నీటిలో మునిగి రైతు మృతి కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్‌వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ మునిగిపోయాడు. ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి, శబరి నదులు -
గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలకు హైఅలర్ట్
అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు. ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
‘నదిలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు పోటెత్తినట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ శాఖ తెలిపింది. సహాయక చర్యలకు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ఎవరూ ప్రయాణాలు చేయవద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ఈ ఘటనకు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 28, 252 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదు. బుధవారం నాటికి శ్రీశైలంలో 843.7 అడుగుల్లో 67.84 టీఎంసీ లు నిల్వ ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం కూడా శ్రీశైలంలోకి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులి చింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ వదిలేస్తున్న నీటికి.. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహంతో కలిపి ప్రకాశం బ్యారేజీ లోకి 9,080 క్యూసెక్కులు వస్తోంది. ఇందులో 4,5 50 క్యూసెక్కులను సాగునీటి కాలువలకు ఇస్తూ.. మిగులుగా ఉన్న 4,530 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 66 వేల క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 59 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
జలాశయాలు విలవిల
సాక్షి, అమరావతి: జాతీయ జలవిధానం, కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి(వర్కింగ్ ప్రొటోకాల్)లను తుంగలో తొక్కుతూ.. శ్రీశైలం, సాగర్, పులిచింత ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండడాన్ని రెండు రాష్ట్రాల్లోని విద్యుత్, నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. సాగునీటి అవసరాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేయడం వల్ల ఏపీకే కాదు.. తెలంగాణకూ నష్టమేనని తేల్చిచెబుతున్నారు. అయినా సరే.. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కల్పించడం లక్ష్యంగా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుండటం బరితెగింపునకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలల్లో విద్యుదుత్పత్తిని చేయకుండా తెలంగాణను నిలుపుదల చేసి.. తమ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం పదే పదే లేఖలు రాస్తోంది. వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు.. విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు సరి కదా శ్రీశైలం, సాగర్, పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద పోలీసులను మోహరించి మరీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ యథేచ్ఛగా దిగువకు నీటిని విడుదల చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో.. గేట్లు ఎత్తి జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇరు రా ష్ట్రాల్లోని ప్రాజెక్టులనూ బోర్డు అధీనంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం: 885 అడుగులు తెలంగాణ ఏం చేస్తోంది? ► జూన్ 1 నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంది. కనీస నీటి మట్టం కంటే దిగువన ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి, కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ► శ్రీశైలంలో 854 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు, రాయలసీమ, నెల్లూరు కోసం రోజుకు ఏడు వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. 848 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే.. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చుక్క నీటిని తరలించడానికి అవకాశం ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి(ప్రోటోకాల్) ప్రకారం విద్యుదుత్పత్తిని ఎప్పుడు చేయవచ్చు: ► 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉండి, వరద ప్రవాహం వస్తున్న సమయంలో స్వచ్ఛందంగా విద్యుదుత్పత్తి చేయవచ్చు. ► సాగర్ ఆయకట్టు కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినప్పుడు.. బోర్డు కేటాయించిన మేరకు ఏపీ, తెలంగాణలు రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ సమానస్థాయిలో నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఎవరికి ఎంత నష్టం ► శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం 823.33 అడుగుల్లో 43.35 టీఎంసీలు నిల్వ ఉండగా.. ప్రాజెక్టులోకి 13,340 క్యూసెక్కులు వస్తుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 30,610 క్యూసెక్కులను తెలంగాణ సాగర్‌కు విడుదల చేస్తోంది. ► జలాశయంలో ఎక్కువ ఎత్తులో నీటి నిల్వ ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్.. తక్కువ ఎత్తు నీటి నిల్వ ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌కు సమానం. ఎందుకంటే ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ నీటిని విడుదల చేసినా.. టర్బైన్లు వేగంగా తిరుగుతాయి. తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ నీటిని విడుదల చేసినా టర్బైన్లు వేగంగా తిరగవు. తక్కువ ఎత్తు నుంచే నీటిని తరలించడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం పెరగదు. దీని వల్ల తెలంగాణకూ నష్టమే. ఇది తెలంగాణ జెన్కో అధికారులకు తెలియంది కాదు. ► కేవలం.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు.. చెన్నైకి తాగునీటి అవసరాలకు నీటిని దక్కకుండా చేయాలన్న కారణంతోనే ఏకపక్షంగా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తోంది. నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం: 590 అడుగులు తెలంగాణ ఏం చేస్తోంది? కృష్ణా డెల్టాలో ఇప్పటిదాకా ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయలేదు. డెల్టాకు నీటిని కృష్ణా బోర్డు కేటాయించలేదు. నీటిని విడుదల చేయాలని కృష్ణా డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలు పంపలేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ 32,190 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది.. ఆ జలాలు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. సాగర్ నిర్వహణ నియమావళి ఏం చెబుతోంది? ► నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుని.. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పుడు తెలంగాణ, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక విద్యుదుత్పత్తిని నిలిపేయాలి. ► కృష్ణా బోర్డు కృష్ణా డెల్టాకు కేటాయించిన జలాలను.. రోజుకు నిర్ధిష్ట పరిమాణంలో విడుదల చేయాలని ఎస్ఈ ప్రతిపాదనలు పంపినప్పుడు.. ఆ జలాలను విద్యుదుత్పత్తి కేంద్రాల్లో రెండు రాష్ట్రాలు చెరి సగం వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. ఎవరికి ఎంత నష్టం వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయడం వల్ల సాగర్‌లో నీటి మట్టం పెరగదు. దీని వల్ల ఏపీలో సాగర్ కుడి కాలువ కింద.. తెలంగాణ, ఏపీలోని సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేయలేని పరిస్థితి. పులిచింతల ప్రాజెక్టు తెలంగాణ ఏం చేస్తోంది? కృష్ణా డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలతో నిమిత్తం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ 4,600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ఆ జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. ‘పులిచింతల’ ప్రోటోకాల్ ఏం చెబుతోంది? కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం నిర్మించిన బ్యాలెనింగ్స్ రిజర్వాయర్ ఇది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. సముద్రంలోకి వరద జలాలు కలుస్తున్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక.. కృష్ణా డెల్టా అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలు పంపినప్పుడే.. ఆ నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఎవరికి ఎంత నష్టం కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఇప్పటిదాకా నీటిని విడుదల చేయలేదు. అవసరం లేకపోయినా దిగువకు విడుదల చేయడం వల్ల పులిచింతల ప్రాజెక్టు ఖాళీ అవుతుంది. కృష్ణా డెల్టా ప్రయోజనాలకు ఇది విఘాతం కల్పిస్తుంది. ప్రకాశం బ్యారేజీ జాతీయ జలవిధానం ఏం చెబుతోంది? ► ప్రాజెక్టులలో నిల్వ చేసిన జలాలను వినియోగించడానికి కేంద్రం జాతీయ జలవిధానాన్ని (నేషనల్ వాటర్ పాలసీ) ప్రకటించింది. ఆ విధానం ప్రకారం ► మొదటి ప్రాధాన్యం: తాగునీటి అవసరాలు ► రెండో ప్రాధాన్యం: సాగునీరు ► మూడో ప్రాధాన్యం: సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే సమయంలోనే విద్యుదుదుత్పత్తి చేయవచ్చు. -
‘కృష్ణా’పై 3 బ్యారేజీలు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాలకు సమర్థంగా నీరందించడంతో పాటు.. డెల్టా పరిరక్షణే లక్ష్యంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం–రామచంద్రాపురం మధ్య రూ.1,215 కోట్లతో, బండికొల్లంక–రావిఅనంతవరం మధ్య రూ.1,350 కోట్లతో బ్యారేజీల నిర్మాణానికి ఇప్పటికే సర్కార్ ఉత్తర్వులిచ్చింది. కృష్ణా డెల్టాలో సకాలంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరందించేందుకు దివంగత సీఎం వైఎస్సార్ 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. డెల్టాకు మరింత సమర్థంగా నీరందించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,235.27 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ► కృష్ణా నదిపై 1,323 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీల దిగువున 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించనున్నారు. తొలి దశలో బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణ కోసం రూ.102.17 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ► కృష్ణా నదిపై 1,373 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 62 కి.మీ దిగువన 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. సర్వే, ఇన్వెస్టిగేషన్ తదితర పనులు, భూసేకరణ కోసం రూ.102.20 కోట్లను ఇప్పటికే సర్కార్ మంజూరు చేసింది. జల, ఉపరితల రవాణాకు ఊతం.. కృష్ణా నదిపై మూడు బ్యారేజీల నిర్మాణం అంతర్గత జల రవాణా, ఉపరితల రవాణాలకు ఊతం ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన బ్యారేజీలను నిర్మించడం వల్ల ఆ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. కొత్తగా నిర్మించే బ్యారేజీల వల్ల పులిచింతల నుంచి హంసలదీవి వరకూ నదిలో నీరు నిల్వ ఉంటుందని.. ఇది జలరవాణాకు ఊతమిస్తుందంటున్నారు. డెల్టా పరిరక్షణ భూగర్భ జలమట్టం తగ్గడం వల్ల భూమి పొరల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావడం, కృష్ణా నది వెంబడి సముద్రపు జలాలు పైకి ఎగదన్నడం వల్ల కృష్ణా డెల్టా చౌడు బారుతోంది. పంటల దిగుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటికీ ఇబ్బందులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూగర్భ జలమట్టం తగ్గకుండా కాపాడుకోవచ్చు. -
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ సేవలు..!
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)–ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని యోచిస్తోంది. సీ ప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. అలాగే నదుల్లో కాంక్రీట్ జెట్టీల(వాటర్ ఏరోడ్రోమ్) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్లో నర్మదా నదిలో, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ కేవలం 40 నిమిషాల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్‌లో ప్రయాణించారు. -
స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/శ్రీశైలంప్రాజెక్ట్/అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 6,15,797 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 3,472 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 6,12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 2 లక్షలు, ఉజ్జయిని నుంచి 1.50 లక్షలు, తుంగభద్ర నుంచి 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కరకట్ట లోపల తగ్గిన వరద గుంటూరు జిల్లా వైపు కరకట్ట లంక గ్రామాల్లో వరద కొంతమేర తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కొల్లూరు, తాడేపల్లిలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీరు చేరిన ఇళ్లను గుర్తించేందుకు వెంటనే సర్వే చేపట్టాలని ఆదేశించారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. కొల్లిపర మండలంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల పర్యటించారు. గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 26,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 24,520 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,73,089 క్యూసెక్కులు చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి 5,12,690 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,12,690 క్యూసెక్కులు చేరుతోంది. పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి.. కుడి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 5,09,948 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. -
వరద సాయం శరవేగం
విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలి. కాలువలు, చెరువుల గండ్లు పూడ్చాలి. రహదారుల మరమ్మతులు తక్షణం చేపట్టాలి. భారీ వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు జిల్లాల్లో మృతి చెందిన పది మంది కుటుంబాల వారికి వెంటనే పరిహారం చెల్లించాలి. వారంలోగా నష్టంపై అంచనాలు పంపించాలి. చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండాయి. ఈ పరిస్థితిని మార్చాలి. కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. కరువు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విషయాలు ఆరా తీసి సహకరించాలని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, సహాయ కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై కలెక్టర్లను ఆరా తీశారు. వాయుగుండం నిన్న(మంగళవారం)నే తీరం దాటింది కాబట్టి ఇబ్బంది లేదని, అయినా పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. వరద సహాయక కార్యక్రమాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో హోం మంత్రి సుచరిత తదితరులు ప్రకాశం బ్యారేజీకి భారీ వరద – తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది. – ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. 45 నెలల్లో శాశ్వత మరమ్మతులు – రహదారుల మరమ్మతు పనులు వేగంగా జరగాలి. 45 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన కూడా మరమ్మతులు పూర్తి చేయాలి. వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపించాలి. – తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది. కాబట్టి అవసరమైన ఆధునికీకరణ చర్యలు చేపట్టాలి. వ్యాధులు ప్రబలకుండా చర్యలు – కలుషిత నీరు లేకుండా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలి. ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయేరియా వంటివి పూర్తిగా నివారించాలి. – అన్ని పీహెచ్సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్ చేయాలి. వరదలు తగ్గాక పాము కాట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. నీటి వృథాను అరికట్టాలి – రిజర్వాయర్లు నింపాలి. అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రతి చెరువు నింపడంపై రాయలసీమ, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. – నెల్లూరు జిల్లా కండలేరులో ఈసారి గరిష్టంగా 60 టీఎంసీల నీరు నిల్వ చేయబోతున్నాం. ఇప్పటి వరకు గరిష్టంగా 50 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశాం. వరద తగ్గాక వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు – వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సూచనలు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. పంటల పరిస్థితిపై కలెక్టర్లు వీలైనంత త్వరగా అంచనాలు పంపాలన్నారు. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ కొనసాగుతోందని చెప్పారు. – వరదలు సంభవించిన అన్ని చోట్ల శానిటేషన్ కోసం తగిన ఏర్పాట్లు చేశామని, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ పేర్కొన్నారు. తాగు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. – ఈ సమీక్షలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : కృష్ణా డెల్టాకు జవసత్వాలు కల్పిస్తూ ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ. దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య ఒక బ్యారేజీ నిర్మాణం కానుండగా, 62 కి.మీ. దిగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్య మరో బ్యారేజీని నిర్మించనున్నారు. ఇందుకోసం సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణకు రూ.204.37 కోట్లను మంజూరు చేస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యద్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం తొలిదశ పరిపాలన అనుమతి ఉత్తర్వులు జారీ చేశారు. (కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా) కృష్ణమ్మ పరవళ్లు విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 3,38,823 క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటంతో పది గేట్లు ఎత్తి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 4,12,345 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 2,28,991 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి చేరుతుంది. నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ 18 గేట్లు ఎత్తి, విద్యుత్కేంద్రం ద్వారా 3,48,518 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వదులుతున్న వరదలో 3,35,858 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతుండగా.. అంతే పరిమాణంలో 14 గేట్లు ఎత్తేసి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు మున్నేరు, కట్టలేరు, వైరా, కొండవీటివాగు, కొండవాగుల ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 3,61,268 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు 4,829 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 70 గేట్లను ఎత్తేసి 3,79,389 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. సోమశిల ప్రాజెక్టులోకి 69,888 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 76 టీఎంసీలకు చేరుకుంది. కండలేరులోకి 10,459 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 38.50 టీఎంసీలకు చేరుకుంది. -
ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు
సాక్షి, అమరావతి: నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయమై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వ్యయానికి సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుందని అధికార వర్గాల సమాచారం. – రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో పని చేస్తున్న ఆర్డీవో (రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్) తరహాలోనే.. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీడీవో) పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. – ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై గురువారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులు రానున్నాయి. నేడు కేబినెట్ భేటీ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. – ఈ సమావేశంలో ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొన్ని ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
మళ్లీ గోదారమ్మ ఉగ్రరూపం!
సాక్షి, హైదరాబాద్: శాంతించినట్లే శాంతించిన గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి.. 8.60 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి శబరి, తాలిపేరు, కిన్నెరసాని, కొండవాగుల ప్రవాహం తోడవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,06,032 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 11,600 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 3,89,032 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణాలో వరద తగ్గుముఖం.. ఇటు పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల కృష్ణాలో వరద తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విద్యుత్ కేంద్రాల ద్వారా పరిమిత స్థాయిలో ప్రవాçహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 22,345 క్యూసెక్కులకు తగ్గింది. ప్రధాన ఉపనది భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్ మంగళవారం నిండటంతో గేట్లు ఎత్తి 2,137 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నది పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిస్తే.. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని, జూరాల డ్యామ్‌లు నిండటం వల్ల వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేయక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో కూడా కృష్ణాకు భారీగా వరదలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది. బ్యారేజీలోకి 32,435 క్యూసెక్కులు వస్తుండగా.. కృష్ణా డెల్టాకు 16,705 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 15,730 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద
-
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద
సాక్షి, కృష్ణా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదే విధంగా ప్రకాశం బ్యాకేజ్కి వరద నీరు పోటెత్తుతోంది. వరదకు వర్షం తోడుకావటంతో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో అరవై గెట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ సాయంత్రానికి 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావచ్చని అంచానా వేస్తున్నారు. గంటగంటకు వరద పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్ధితిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలిస్తూ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంత తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఫొటో గ్యాలరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి... -
విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు
-
మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణా జలాలు పోటెత్తుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు కృష్ణా నది నుంచి 29 వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1740 క్యూసెక్కులు కలిపి 30,740 క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి. దాంతో ఇక్కడి జలాశయంలో నీటి నిల్వ 38.29 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేసిన వరద జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. ప్రాజెక్ట్ వద్ద 9 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. స్పిల్ వే ద్వారా 42,244, విద్యుత్ కేంద్రం ద్వారా 28,779 క్యూసెక్కులు కలిపి 71,023 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వీటికి తోడు హంద్రీ, తుంగభద్ర నుంచి వరద చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలోకి వచ్చే ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాల వల్ల మున్నేరు, మూసీ నదుల నుంచి పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 12,137 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. ► ఎగువ నుంచి గతేడాది జూలై 30న శ్రీశైలానికి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది రెండు వారాల ముందే రావడం గమనార్హం. ► తుంగభద్ర జలాశయంలోకి 8,029 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 48,679 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 45,679 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► వంశధార నది నుంచి 7,985 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. తెరుచుకున్న ప్రకాశం బ్యారేజీ గేట్లు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. బుధవారం ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా రావడంతో 30 గేట్లు ఎత్తి 21,750 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ