వీడియో: ఆ బోట్లు టీడీపీవే.. ఇదిగో మరో సాక్ష్యం | YSRCP Released Prakasham Barrage Boats Related Video | Sakshi
Sakshi News home page

వీడియో: ఆ బోట్లు టీడీపీవే.. ఇదిగో మరో సాక్ష్యం

Published Tue, Sep 10 2024 5:42 PM | Last Updated on Tue, Sep 10 2024 6:07 PM

YSRCP Released Prakasham Barrage Boats Related Video

సాక్షి, తాడేపల్లి: ఇటీవల ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టింది టీడీపీ నేతల బోట్లేనని తెలిసినా పచ్చ పార్టీ నేతలు మాత్రం ఇంకా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక, బోట్లకు సంబంధించిన మరో సాక్ష్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీన్నీ వైఎస్సార్‌సీపీ బహిర్గతం చేసింది.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..‘ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా పచ్చ మంద.. వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తోంది. ఇంతకంటే దిక్కుమాలినతనం మరొకటి ఉంటుందా చంద్రబాబు? అని ఘాటు విమర్శలు చేసింది.

#Prakashambarrage

 

ఇది కూడా చదవండి: ‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement