సాక్షి, విజయవాడ: టీడీపీ బండారం బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల వ్యవహారంలో కుట్ర కోణం ఉందంటూ కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు సర్కార్.. వైస్సార్‌సీపీపై ఆ నెపాన్ని నెట్టేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు నాలిక కర్చుకుంది.
మొన్నటి వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి ఢీకొన్న బోట్లు టీడీపీకి చెందిన వారివే అని అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో, పచ్చ పార్టీ కార్యకర్తలు ఉషాద్రి, రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
‘ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చిన బోట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలవే. బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్తే. పోలీసులు విచారణలో బోట్లు మొత్తం తనవే అని ఉషాద్రి అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో, టీడీపీ మంత్రులు.. వైఎస్సార్సీపీపై చేసిన ఆరోపణలు పటాపంచలయ్యాయి. పచ్చ పార్టీ నేతల కామెంట్స్ తప్పు అని మరోసారి రుజువైంది. ఇక, నారా లోకేష్‌తో కూడా బోటు యజమాని ఉషాద్రి అనేక సార్లు ఫోటోలు దిగారు. ప్రశాకం బ్యారేజ్‌కి కొట్టుకొచ్చిన బోట్లు లైసెన్స్‌లు తన పేరు మీదనే ఉన్నట్టు ఉషాద్రి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉషాద్రి, రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు అని వైస్సార్‌సీపీ ఆ ఆరోపణలను ఎక్స్ వేదికగా ఖండించింది.
ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు @naralokesh కు సన్నిహితుడే
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను @ncbn ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో… https://t.co/Q3Tu2gr4Aa pic.twitter.com/KsBUI0ICag— YSR Congress Party (@YSRCParty) September 9, 2024
ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్ కు సన్నిహితుడే. బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రామ్మోహన్ పేరుమీద ఒక్క బోటు కూడా లేదు. నాలుగైదేళ్ల క్రితమే తన బోట్లను అమ్మేశారు. పైగా రామ్మోహన్ టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరామ్‌కు సమీప బంధువు.
ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైఎస్సార్‌సీపీతో సంబంధాలు లేవని స్పష్టంచేసినా పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టుచేశారు. నారా లోకేష్‌తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనేదానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు. పబ్లిసిటీ పిచ్చిలో వరద బాధితుల్ని గాలికి వదిలేయడంతో ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వంపై జనం ఉమ్మేస్తున్నారు. దాన్ని తుడవడానికి ఎల్లో మీడియా ముప్పుతిప్పలు పడుతోంది. ఇప్పట్లో వరద బాధితుల ఆగ్రహం తగ్గేలా లేదు. దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి తలాతోక లేని బోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఫేక్ ప్రచారమా టీడీపీ?. మీరు ఇలా ఎన్ని జిత్తుల మారి వేషాలేసినా.. విజయవాడని ముంచిన మీ పాపాన్ని కడుక్కోలేరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది YSRCP.
ఇక.. ప్రకాశం గేట్లను ఢీ కొట్టిన ఘటనపై విచారణలోకీలక విషయాలు బయటపడ్డాయి. బోట్లను ఇనుప గొలుసులతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని సమాచారం. అలాగే.. గొల్లపూడి నుంచి బోట్లు నిలిపిన ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి.. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయని దర్యాప్తులో వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment