Boats Crashes
-
వీడియో: ఆ బోట్లు టీడీపీవే.. ఇదిగో మరో సాక్ష్యం
సాక్షి, తాడేపల్లి: ఇటీవల ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టింది టీడీపీ నేతల బోట్లేనని తెలిసినా పచ్చ పార్టీ నేతలు మాత్రం ఇంకా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక, బోట్లకు సంబంధించిన మరో సాక్ష్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీన్నీ వైఎస్సార్సీపీ బహిర్గతం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా పచ్చ మంద.. వైఎస్సార్సీపీపై నిందలు వేస్తోంది. ఇంతకంటే దిక్కుమాలినతనం మరొకటి ఉంటుందా చంద్రబాబు? అని ఘాటు విమర్శలు చేసింది.#Prakashambarrage🚨 Big Expose Alert! 🚨 ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా… pic.twitter.com/snqtMSm9mx— YSR Congress Party (@YSRCParty) September 10, 2024 ఇది కూడా చదవండి: ‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’ CMగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ, TDP కార్యకర్తలు వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవల ర్యాలీ నిర్వహించారు. అందులో కృష్ణా బ్యారేజిని గుద్దిన టీడీపీ బోటు కూడా ఉంది. ఆ బోటుపై TDP జండాలు చూడచ్చు. pic.twitter.com/NFRdhqnTQE— Anitha Reddy (@Anithareddyatp) September 10, 2024 -
‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’
సాక్షి, విజయవాడ: టీడీపీ బండారం బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల వ్యవహారంలో కుట్ర కోణం ఉందంటూ కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు సర్కార్.. వైస్సార్సీపీపై ఆ నెపాన్ని నెట్టేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు నాలిక కర్చుకుంది. మొన్నటి వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి ఢీకొన్న బోట్లు టీడీపీకి చెందిన వారివే అని అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో, పచ్చ పార్టీ కార్యకర్తలు ఉషాద్రి, రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.‘ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చిన బోట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలవే. బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్తే. పోలీసులు విచారణలో బోట్లు మొత్తం తనవే అని ఉషాద్రి అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో, టీడీపీ మంత్రులు.. వైఎస్సార్సీపీపై చేసిన ఆరోపణలు పటాపంచలయ్యాయి. పచ్చ పార్టీ నేతల కామెంట్స్ తప్పు అని మరోసారి రుజువైంది. ఇక, నారా లోకేష్‌తో కూడా బోటు యజమాని ఉషాద్రి అనేక సార్లు ఫోటోలు దిగారు. ప్రశాకం బ్యారేజ్‌కి కొట్టుకొచ్చిన బోట్లు లైసెన్స్‌లు తన పేరు మీదనే ఉన్నట్టు ఉషాద్రి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉషాద్రి, రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు అని వైస్సార్సీపీ ఆ ఆరోపణలను ఎక్స్ వేదికగా ఖండించింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు @naralokesh కు సన్నిహితుడేప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను @ncbn ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో… https://t.co/Q3Tu2gr4Aa pic.twitter.com/KsBUI0ICag— YSR Congress Party (@YSRCParty) September 9, 2024ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్ కు సన్నిహితుడే. బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రామ్మోహన్ పేరుమీద ఒక్క బోటు కూడా లేదు. నాలుగైదేళ్ల క్రితమే తన బోట్లను అమ్మేశారు. పైగా రామ్మోహన్ టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరామ్‌కు సమీప బంధువు.ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైఎస్సార్సీపీతో సంబంధాలు లేవని స్పష్టంచేసినా పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టుచేశారు. నారా లోకేష్‌తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనేదానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు. పబ్లిసిటీ పిచ్చిలో వరద బాధితుల్ని గాలికి వదిలేయడంతో ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వంపై జనం ఉమ్మేస్తున్నారు. దాన్ని తుడవడానికి ఎల్లో మీడియా ముప్పుతిప్పలు పడుతోంది. ఇప్పట్లో వరద బాధితుల ఆగ్రహం తగ్గేలా లేదు. దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి తలాతోక లేని బోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఫేక్ ప్రచారమా టీడీపీ?. మీరు ఇలా ఎన్ని జిత్తుల మారి వేషాలేసినా.. విజయవాడని ముంచిన మీ పాపాన్ని కడుక్కోలేరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది YSRCP.ఇక.. ప్రకాశం గేట్లను ఢీ కొట్టిన ఘటనపై విచారణలోకీలక విషయాలు బయటపడ్డాయి. బోట్లను ఇనుప గొలుసులతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని సమాచారం. అలాగే.. గొల్లపూడి నుంచి బోట్లు నిలిపిన ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి.. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయని దర్యాప్తులో వెలుగు చూసింది. -
125 ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో..
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది.అంతకుముందు 2009 సంవత్సరం అక్టోబర్ 5 న రికార్డుస్ధాయిలో 10,94,422 క్యూసెక్కుల వరదనీరు, 1903 అక్టోబర్ 7లో మాత్రమే 10,60,830 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటింది.అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో కృష్ణా పరీవాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే బుడమేరుకి గండిపడటంతో సింగ్ నగర్,ఊర్మిలానగర్, ప్రకాశ్ నగర్, వాంబేకాలనీ, ఖండ్రిగ,పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరిపేట, వైఎస్సార్ కాలనీ, జక్కుంపూడి కాలనీ తదితర ప్రాంతాలు నీట మునిగాయి.వరదల దాటికి కృష్ణలంక రైల్వే బ్రిడ్జి అంచు వరకు వరదనీటి ప్రవాహం చేరింది. నీటి ప్రవాహం మరింత పెరిగితే రైల్వే బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. ఢీకొట్టిన బోట్లు.. దెబ్బ తిన్న ప్రకాశం బ్యారేజీ 69వ గేటుకృష్ణమ్మకు వరద పోటెత్తింది. వరదల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు బోట్లు కొట్టుకొస్తున్నాయి. బోట్లు ఢీకొట్టడంతో గేట్లు లిఫ్ట్ చేసే ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. మూడు భారీ పడవలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను 69వ నెంబర్ గేటు ధ్వంసమైంది. ఒక పక్కకు ఒరిగింది. -
మత్స్యకారుల బోటులో అగ్ని ప్రమాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/కాకినాడ రూరల్: విశాఖ సముద్ర తీరంలో శుక్రవారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజన్ పేలిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా నలుగురు స్వల్ప గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన వీరంతా గత నెల 26వ తేదీన శ్రీదుర్గాభవాని ఐఎన్డీ ఏపీ 47 బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ నెల 14వ తేదీన తిరిగి రావాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. 20 నాటికన్ మైళ్ల దూరంలో.. విశాఖకు 20 నాటికన్ మైళ్ల దూరంలో మత్స్యకారుల బోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జనరేటర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో మరో పడవలో ఉన్నవారు వారికి సాయం అందించి కోస్ట్‌గార్డ్ అధికారులకు సమాచారం చేరవేశారు. సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐసీజీఎస్ వీరా నౌక సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం నేవల్ డాక్‌యార్డ్‌కు తీసుకొచ్చి క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా కేజీహెచ్‌కు తరలించారు. మత్స్యకారులు ఆర్.సత్తిబాబు, ఎన్.వజ్రం, ఎస్.సత్తిబాబు, కె.ధర్మారావు, వై.సత్తిబాబులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కాకినాడ మత్స్యశాఖ అధికారి కరుణాకర్, ఫిషింగ్ హార్బర్ పీవో అనురాధ మత్స్యకారుల వివరాలు సేకరించారు. కాకినాడ మత్స్యకారులకు ప్రమాదం తప్పిందని, కోస్టుగార్డు సిబ్బంది వారిని సురక్షితంగా విశాఖకు తరలించారని, చికిత్స అనంతరం తిరిగి కాకినాడ చేరుకుంటారని అధికారులు తెలిపారు. -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
గ్రీస్ తీరం సమీపంలో మునిగిన పడవ.. 59 మంది గల్లంతు
ఏథెన్స్: టర్కీలోని ఇజ్మిర్ నుంచి వలసదారులతో బయలుదేరిన పడవ గ్రీస్ తీరం సమీపంలో మునిగిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన 59 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు గ్రీస్ తీర రక్షక దళం తెలిపింది. ఎల్వియా, ఆండ్రోస్ ద్వీపాల మధ్యనున్న కఫిరియా జలసంధిలో ఆదివారం రాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. అననుకూల వాతావరణం కారణంగా మునిగిన పడవలో మొత్తం 68 మంది ఉన్నారు. 9 మందిని సురక్షితంగా తీసుకువచ్చినట్లు గ్రీస్ తెలిపింది. -
సీఎం నితీశ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్‌ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎంతో పాటు ఆయనతో బోటులో ఉన్నవారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. పాట్నా సమీపంలోని గంగానదిలో బోటు ప్రయాణం చేస్తున్న క్రమంలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పాట్నాలోని ఛత్‌గట్‌ను పరిశీలించేందుకు బోటులో ప్రయాణించారు సీఎం నితీశ్. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు, అధికారులు సైతం బోటులో ఉన్నారు. ఈ క్రమంలో జేపీ సేతు పిల్లర్‌ను బోటు ఢీకొట్టింది. అయితే, బోటు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ స్థాయిలో ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు. దీంతో నీటిలో మునిగిపోయే ప్రమాదం తప్పింది. బోటులో ఉన్న సీఎం నితీశ్‌తో పాటు మిగితా వారంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. Patna | Bihar CM Nitish Kumar's boat collided with a pillar of JP Setu during the inspection of Chhath Ghat situated on the bank of river Ganga today. All onboard the boat including the CM are safe. pic.twitter.com/ga8vusRtjH — ANI (@ANI) October 15, 2022 ఇదీ చదవండి: కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి -
వర్షాల వేళ విషాదం.. ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి
భారీ వర్షాల వేళ డ్యామ్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అకాల మరణం చెందారు. ఈ విషాద ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోడ్మెరా జిల్లాలో రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం ఆదివారం సెలవు రోజు కావడంలో ఎంజాయ్మెంట్ కోసం పంచఖేరో డ్యామ్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వారంతా ఓ పడవలో డ్యామ్ చూసేందుకు వెళ్లారు. ఇంతలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో, పడవలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది నీటిలో మునిగిపోయి అకాల మరణం చెందారు. మరణించిన వారిని సీతారాం యాదవ్ (40), శివమ్ సింగ్ (17), రాహుల్ కుమార్ (16), అమిత్ కుమార్ (14), సెజల్ కుమారి (16), పాలక్ కుమారి (14),హర్షల్ కుమార్ (8), భావ (5)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఈది సురక్షితంగా ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. పడవ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందంలో రంగంలోకి దిగి డ్యామ్‌లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, ఇప్పటి వరకు వారి డెడ్‌బాడీలు మాత్రం బయటకు తీసుకురాలేదు. ఈ సమాచారం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు డ్యామ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ❗️Boat Tragedy: Eight members of family die after boat capsizes in Panchkhero Dam, Jharkhand One survivor swam to safety. The dead were aged from 5-40, seven of them under the age of 18. @RT_India_official pic.twitter.com/IsVG99QC3W — @NabaKumarRay (@Naba_Kumar_Ray) July 17, 2022 -
కాకినాడ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బోటు యజమానులు
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బోటు యమజానులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురయిన బోటుపై టీడీపీ నేత పట్టాభి అసత్య ప్రచారం చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహించిన బోటు యజమానులు.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, మత్స్యకారులకు మధ్య తోపులాట జరిగింది. బోటు యజమానులు ఆందోళనతో పట్టాభి టీడీపీ కార్యాలయంలో దాక్కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. (చదవండి: అభివృద్ధా? అయితే... వద్దట!) ఈ సందర్భంగా కాకినాడ డీఎస్సీ భీమారావు మాట్లాడుతూ.. కాకినాడలో బోటు దగ్ధం ప్రమాదవశాత్తు జరిగింది. ఆరోజు సాయంత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా బోటు యాజమానిని పరామార్శించారు.మాజీ ఎమ్మెల్యే ధూళిపాళి నరేంద్ర దగ్ధమైన బోటులో మాదకద్రవ్యాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణల పై వారంలోగా ఆధారాలు ఇవ్వాలని ధుళిపాలికి నోటిసు జారీ చేస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: అమరావతి టీడీపీలో ముసలం -
విషాదం: ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే!
Venezuela Mother Sacrifice Story: మనిషికి మాత్రమే కాదు.. మిగతా జీవరాశికి తల్లి స్పర్శే మొదటి ప్రేమ. అమ్మ ప్రేమ జీవికి ఆప్యాయతను పరిచయం చేస్తుంది. ‘అమ్మ’.. మాటల్లో వర్ణించలేని ఓ మధురానుభూతి. అందుకేనేమో తల్లికి మాత్రమే సాధ్యపడే త్యాగానికి ఆమె సిద్ధపడింది. ప్రాణం పోతోందని తెలిసి కూడా సాహసానికి పూనుకుంది. తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఆ తల్లి గాథ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరితో కంటతడి పెట్టిస్తోంది. వెనిజులా బోట్ ప్రమాదం.. సెప్టెంబర్ 3న కరేబియన్ దీవులవైపు వెళ్లిన వెనిజులా టూరిస్ట్ క్రూజ్ బోట్ ఒకటి అదృశ్యం అయ్యిందని నావికా అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత ‘లా టార్టు’ దీవి సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్ బోట్‌ను గుర్తించి.. దగ్గరి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగిన ఇద్దరు చిన్నారుల్ని గుర్తించి వెంటనే కాపాడారు. ఆ తల్లి పేరు మార్లేస్ బీట్రిజ్ చాకోన్ మర్రోక్విన్. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదా ట్రిప్ కోసం వెళ్తే.. అది కాస్త వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపింది. నరకం ఓర్చుకుంది.. భారీ అలల కారణంగా క్రూజ్ దెబ్బతినగా.. చిన్న లైఫ్ బోట్ సాయంతో మార్లేస్, తన బిడ్డల్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. వెనిజులా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అక్వాటిక్ స్పేసెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగాక నాలుగు రోజులపాటు ఆ తల్లీబిడ్డలు ఆ చిన్న లైఫ్బోట్లోనే ఉన్నారు. తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్ వీలైనంత ప్రయత్నం చేసింది. వాళ్ల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకుంది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె. మొత్తం తొమ్మిది మంది లైఫ్ బోటులో తల్లి మృతదేహంలో ఒదిగి పడుకున్న పిల్లలను.. కారాకస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఒంటిపై సూర్య తాపానికి బొబ్బలు వచ్చాయి. తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు కూడా. మరోవైపు ఈ ఇద్దరు పిల్లల్ని చూసేందుకు నియమించిన యువతి వెరోనికా మార్టినెజ్(25).. పక్కనే ఓ ఐస్ బాక్స్‌లో పడుకుని బతికి బట్టకట్టింది. ప్రస్తుతం కోలుకున్న ఆ యువతి.. మానసికంగా మాత్రం కోలుకోలేకపోతోంది. అయితే ఆ మార్లేస్ భర్త రెమిక్ డేవిడ్ కాంబ్లర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. సరదా ట్రిప్‌లో భాగంగా వెనిజులా హిగుయిరోట్ నుంచి లా టార్టుగా ఐల్యాండ్(కరేబియన్ దీవులు) వైపు తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమారు 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మిగిలిన వాళ్లెవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు -
బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు
గుహవాటి: అసోంలో ఘోర సంఘటన జరిగింది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు సమాచారం. జోర్హాత్ జిల్లా నీమాటిఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ పడవ రెండూ ఢీకొన్నాయి. ఈ రెండు పడవల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు బోల్తా పడడంతో పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్- ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా -
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం ఫోటోలు
-
బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 27 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లోని షితలాఖ్య నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందికి పైగా ప్రయాణీకులతో వెళుతున్న పడవ ఎంఎల్ సబిత్ అల్ హసన్ మరో కార్గో వెజల్‌ను ఢీకొట్టిన ఘటనలో 27 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. పడవతో పాటు కొంత మంది నీటిలో మునిగిపోగా, మరి కొందరు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం 22 మృతదేహాలను వెలికితీయగా, మరో 5 మృతదేహాలను సోమవారం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. ప్రమాదానంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియ పూర్తయిందని బంగ్లాదేశ్ దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ (బిత్వా) ప్రకటించింది. -
కన్నీరే మిగులుతోంది.!
సాక్షి, చింతలమానెపల్లి(సిర్పూర్) : గమ్యం చేరే వరకూ భరోసా లేని పడవ ప్రయాణాలు విషాద రాత రాస్తున్నాయి. గత్యంతరం లేక ప్రాణాలను పణంగా పెట్టి చేపడుతున్న పడవల ప్రయాణం ఇంకో మార్గానికి చేర్చుతున్నాయి. పడవ ప్రమాదాలు చోటుచేసుకుని కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుండగా, మృతుల కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగుల్చుతోంది. పూట గడవడానికి పడవ నడుపుతున్న వారి నిర్లక్ష్యం మూలానికి ప్రయాణికుల ప్రాణాలు నీటిలో కలుస్తున్నాయి. జిల్లాలోని ప్రాణహిత నదీ మీద నిత్యం పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికార యంత్రాంగం గుణపాఠం నేర్వడం లేదు. దీంతో విషాద సంఘటనలు పునరావృతమవుతున్నాయి. జిల్లాలోని సిర్పూర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల సరిహద్దుల్లో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుగా పెన్‌గంగా, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాలు, వ్యాపార, ఇతర అవసరాల రీత్యా నిత్యం ప్రజలు రాకపోకలు సాగి స్తుంటారు. నదులపై వంతెనలు లేకపోవడంతో రేవుల నుంచి నాటు పడవల్లో గట్టు దాటాల్సి వస్తోంది. కౌటాల మండలంలోని వీరవెల్లి, విర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి, రణవెల్లి, చింతలమానెపల్లి మండలంలోని చిత్తామ, గూడెం, బెజ్జూర్ మండలంలోని తలాయి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడెం ఓడరేవుల నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. చింతలమానెపల్లి మండలం లోని చిత్తామ, గూడెం వద్ద మహారాష్ట్రలోని అహేరి, ఆళ్ళపల్లి, ఏటపల్లి, సిరోంచ, సహా చత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు భారీ రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గం కంటే పడవల్లో నదిని దాటితే దూరం తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అందుకే చూపుతున్నారు. ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. నాటు పడవల నిర్వహకులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సి ఉండగా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాటు పడవలను నడిపేవారు సంబంధిత అధికారుల నుంచి లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్సు, అనుభవం లేని వారు నడుపుతుండడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పడవలను నాసిరకంగా తయారు చేయడంతో ప్రయాణ సమయంలో పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. పడవలకు రంధ్రాలు పడ్డప్పుడు వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నామమాత్రపు మరమ్మతులు నిర్వహించి నడుపుతున్నారు. పడవల్లోకి చేరితో నీటిని బకెట్లతో తోడుతుంటారు. ఈ క్రమంలో నీళ్లు అధికమై పడవలు మునిగిపోతున్నాయి. ఆదివారం బీట్ ఆఫీసర్ల ప్రమాదంలోనూ ఇదే జరిగింది. వంతెనలు లేక ఇబ్బందులు.. మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజలకు సంబంధాలున్నాయి. ఈనేపథ్యంలో రవాణా మార్గాలుగా ఇరు ప్రాంతాలకు వెళ్లేందుకు నదిలో నాటు పడవలను ఆశ్రయిస్తారు. చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద వంతెన నిర్మాణంలో ఉండగా ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. కౌటాల మండలంలోని గుండాయిపేట వద్ద పెన్‌గంగా నదిపై వంతెనకు ప్రతిపాదనలు పూర్తయినట్లు అధికారులు తెలుపుతున్నారు. వంతెనల నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇబ్బందులు దూరంకానున్నాయి. వంతెనలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈక్రమంలో ఏమాత్రం వరద ఎక్కువగా ఉన్నా, నడిపే వారు అజాగ్రత్తగా ఉన్నా జరగరానిది జరిగిపోతుంది. అనుమతులు లేకుండానే.. నదులపై లేదా ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల్లో ప్రయాణికులను తరలించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. దీంతో పాటు ఏటా నిర్ణీత కాలవ్యవధిలో రెన్యూవల్ ఉంటుంది. ఆయా సమయాల్లో పోలీసులు, ఇతర శాఖలు తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కాని సరిహద్దులో ఉన్న ప్రాణహిత నదిలో ప్రయాణికులను తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. కేవలం చేపలు పెంచడానికి అనుమతులు పొందిన వారే ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి చేరవేస్తున్నారు. ఇలా పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తుండడంతో వర్షాకాలంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఏడాదిలో ప్రాణహిత నదిలో నలుగురు మృత్యువాత పడడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల వైఫల్యాన్ని తాజా ఘటన ఎత్తి చూపడంతో పాటు గుణపాఠం నేర్చుకోవాలి్సన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు.. 1. ఫిబ్రవరి 16న కాగజ్‌నగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ పోరెడ్డి దినకర్‌రెడ్డి, అతని మామ బాపిరెడ్డి నదిలో నీటి ప్రవాహంలో పడి మృతిచెందారు. 2. 23 మే 2016న మంచిర్యాలకు చెందిన వెంకటేశ్, రాజు, మమత కౌటాల మండలం తుమ్మిడిహేటి వద్ద పడవ మునగడంతో మృతిచెందారు. 3. కౌటాల మండలంలోని వీరవెల్లి వద్ద 2011 ఏప్రిల్ 24న పడవ మునగడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 4. గతేడాది గూడెం వద్ద నదిని దాటుతున్న ప్రయాణికుల పడవ మధ్యలో ఆగిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సి వచ్చి ంది. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వచ్చిన పడవ సైతం చెడిపోవడంతో మరో పడవను ఆశ్రయించారు. ఇలా పడవలు చెడిపోయి ఇబ్బ ందులకు గురైన సంఘటనలు అనేకం ఉన్నా యి. బీట్ ఆఫీసర్ల మరణమే ఆఖరు అయ్యేలా, మరో ప్రమాదం చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
కచ్చలూరు ప్రమాదం : మత్స్యకారులకు ప్రోత్సాహం అందజేత
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 26 మంది టూరిస్టులను రక్షించిన మత్స్యకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందజేసింది. 20 మందికి రూ. 25 వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నజరానా ప్రకటించగా, శనివారం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ నగదు ప్రోత్సహాన్ని మత్స్యకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంత ఉదయభాస్కర్, ఐటీడీఏ పీఓ నిశాంత్ కుమార్‌లు పాల్గొన్నారు. -
అమెరికాలో భారతీయ దంపతుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో భారత్‌కు చెందిన భార్యభర్తలిద్దరు మరణించారు. స్కూబా డైవింగ్ కోసం వెళ్తున్న వీరి పడవ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ ద్వీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... నాగ్‌పూర్‌కు చెందిన ప్రఖ్యాత శిశువైద్యుడు సతీష్ డియోపుజారి కుమార్తె అమెరికాలో దంత వైద్యురాలిగా పని చేస్తుండగా.. అల్లుడు ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సతీష్ కుమార్తె, అల్లుడు స్కూబా డైవింగ్ కోసమని కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ ద్వీపానికి వెళ్లారు. ఆ సమయంలో వీరు ప్రయాణం చేస్తున్న పడవలో ఒక్కసారిగా పడవలో మంటలు చెలరేగి కాలిఫోర్నియా సముద్రతీరంలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో 33 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు డైవర్స్ ఉన్నట్లు సమాచారం. పడవ మునిగిపోవడంతో వీరిలో 34 మంది మరణించినట్లు తెలిసింది. ఐదుగురు డైవర్స్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా డియో పుజారి రెండో కుమార్తె కూడా అమెరికాలోనే ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆమె అధికారులను కలుసుకుని సాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ప్రమాదం గురించి డియోపుజారి మాట్లాడుతూ.. తన కుమార్తె అమెరికాలో దంత వైద్యురాలుగా పనిచేస్తోందని, అల్లుడు కూడా అమెరికాలోని ఓ ఫైనాన్స్ కంపెనీ పనిచేస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పటివరకు తన కూతురు, అల్లుడి మరణంపై అమెరికా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సతీష్ డియోపుజారి ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: కాలిఫోర్నియాలో ఘోర అగ్ని ప్రమాదం) -
గోదావరిలో ప్రమాద సుడిగుండాలు
సాక్షి, అమలాపురం : గోదావరిలో పడవలు, లాంచీల ప్రమాదాలు జరిగినప్పుడు చోటు చేసుకునే పెనువిషాదం గురించి తెలుసుకునేందుకు.. గత ఏడాది మే, జూలై నెలల్లో మంటూరు, పశువుల్లంక దుర్ఘటనలు చాలు. ఇవే కాదు ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు జరగడం, పదుల సంఖ్యలో లంకవాసులు, రైతులు మృత్యువాత పడడం సర్వసాధారణంగా మారింది. గోదావరి మీద ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే. వరదల సమయంలోనైతే ప్రమాదాలు మరింత అధికంగా జరిగే అవకాశముంటుంది. అప్పుడు జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైంది. గోదావరికి వరద నీరు వస్తోంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవల మీద.. లాంచీల మీద ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన ఇటు మన జిల్లాలోని దేవీపట్నం, చింతూరు.. అటు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం తదితర మండలాల పరిధిలో పలు గ్రామాలు ఉన్నాయి. కొండలు, గోదావరి మధ్య ప్రాంతంలో ఉండడంతో వీటికి రహదారి సౌకర్యం అంతంతమాత్రమే. దీంతో పోలవరం, కొవ్వూరు, దేవీపట్నం, పురుషోత్తపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు వివిధ పనులపై నిత్యం వచ్చే ఆయా గ్రామాల ప్రజలు పూర్తిగా లాంచీలు, పడవలపై ఆధారపడి ప్రయాణించాల్సిందే.ఇక బ్యారేజ్ దిగువన గోదావరి పాయల మధ్య ఉన్న లంక గ్రామాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ కేవలం నాటు పడవల మీదనే ప్రయాణాలు చేయాల్సి ఉంది. వ్యవసాయం మాత్రమే జరిగే లంక ప్రాంతాలకు సహితం వరదల సమయంలో పడవల మీద దాటాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా పడవలు, లాంచీలు మీద రాకపోకలు సాగించే గ్రామాలు 70 వరకూ ఉంటాయని అంచనా. వరద ఉధృతంగా ఉన్న సమయంలో సహితం లంకవాసులు దైనందిన కార్యక్రమాల కోసం పడవల మీదనే రాకపోకలు సాగిస్తూంటారు. ఇవికాకుండా కోటిపల్లి – ముక్తేశ్వరం, సఖినేటిపల్లి – నర్సాపురం, కరవాక – ఓడలరేవు, గోగన్నమఠం – బెండమూర్లంక, సలాదివారిపాలెం – పశువుల్లంక, పల్లంకుర్రు – జి.మూలపొలం, పురుషోత్తపట్నం – పోలవరం వంటి రేవుల్లో ప్రయాణికుల రాకపోకలు నిత్యం పడవలు, పంటులపై సాగుతూనే ఉంటాయి. వీటిలో కోటిపల్లి, సఖినేటిపల్లి, పశువుల్లంక(గత ఏడాది ప్రమాదం తరువాత)ల్లో పంటుల మీద రాకపోకలు సాగుతున్నాయి. పురుషోత్తపట్నం నుంచి లాంచీల ప్రయాణం సాగుతోంది. మిగిలిన అన్ని రేవుల్లోనూ ఇంజిన్ పడవలే శరణ్యం. ఆ ప్రాంతాలకు పడవలే గతి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివారిపాలెం, కమిని, గురజాపులంక, శేరులంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాల ప్రజలు బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే పడవ ప్రయాణాలే దిక్కవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవలే గతి. తాళ్లరేవు మండలం గోవలంక, పిల్లంక, అరటికాయలంకలకు వెళ్లే రైతులు పడవల మీదనే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. మామిడికుదురు, అల్లవరం మండలాల్లో ప్రవహిస్తున్న వైనతేయ నదీపాయల మధ్య కరవాక – ఓడలరేవు, గోగన్నమఠం – బెండమూర్లంక, పెదపట్నంలంక – ముంజువరం కొట్టు మధ్య పడవ ప్రయాణాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక – దొడ్డిపట్ల మధ్య పడవ ప్రయాణాలు సాగుతున్నాయి. పడవ మీదనే జిల్లా వాసులు పశ్చిమ గోదావరికి వెళ్తూంటారు. అలాగే ఎల్.గన్నవరం – కోడేరులంక గ్రామాల ప్రజలు పడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. కపిలేశ్వరపురం – కేదార్లంక మధ్య నాటు పడవ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు నుంచి రామాలయంపేట, జి.మూలపొలం మధ్య; కుండలేశ్వరం – కేశనకుర్రుపాలెం మధ్య పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకూ వెళ్లేందుకు, పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీలను వినియోగిస్తున్నారు. వీఆర్ పురం మండలం తమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు; కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకూ పడవలపై వెళ్తూంటారు. గోదావరిలో ప్రమాదాల పరంపర 1990 : ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్తూండగా పడవ మునిగి 10 మంది చనిపోయారు. 1992 : ఐ.పోలవరం మండలం గోగుల్లంక, భైరవలంకల మధ్య చింతేరుపాయలో పడవ బోల్తాపడి 9 మంది మృతి చెందారు. 1995 : పాపికొండలు మార్గంలో జరిగిన అతి పెద్ద ప్రమాదంలో సుమారు 98 మంది మృత్యువాత పడ్డారు. 2004 : తాళ్లరేవు మండల పరిధిలో గోదావరి పాయపై జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 2009 : దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద నాటు పడవ ప్రమాదంలో 10 మంది జలసమాధి అయ్యారు. 2012 : పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి నదీపాయలో ఇంజిన్ బోటు బోల్తా పడి ఐదుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. 2016 : ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద గోదావరి వరద ఉధృతికి ఐదుగురు రైతులు మృతువాత పడ్డారు. -
కొచి ఫోర్ట్ తీరంలో ఘోర ప్రమాదం..
-
ఎరుపెక్కిన కెరటాలు
- కొచి ఫోర్ట్ తీరంలో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం కొచి: కేరళలోని కొచి ఫోర్ట్ తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బుధవారం మద్యాహ్నం ఓ ప్రయాణికుల నౌనకు.. చేపల పడవ ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైపిన్ ద్వీపం నుంచి కొచి పోర్ట్ తీరానికి బయలుదేరిన నౌకలో 30 మంది ప్రయాణిస్తున్నారు. కొద్ది సేపట్లో తీరానికి చేరుకుంటుందనగా.. చేపల వేటకు ఉపయోగించే పడవ ఒకటి వేగంగా దూసుకొచ్చి నౌకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా, 20 మంది గాయాలతో బయటపడ్డారు. తీర రక్షక దళం, నౌకా దౌళం, స్థానిక పోలీసులు, జాలర్లు కలిసికట్టుగా క్షతగాత్రులను కాపాడారు. రెస్యూ ఆపరేషన్‌లో గజ ఈతగాళ్లతోపాటు చేతక్ హెలికాప్టర్ ను కూడా వినియోగించినట్లు నౌకాదళం ప్రతినిధులు పేర్కొన్నారు.