బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 27 మంది మృతి | Passenger boat capsizes after collision with cargo vessel in Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 27 మంది మృతి

Apr 6 2021 4:33 AM | Updated on Apr 6 2021 9:47 AM

Passenger boat capsizes after collision with cargo vessel in Bangladesh - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లోని షితలాఖ్య నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందికి పైగా ప్రయాణీకులతో వెళుతున్న పడవ ఎంఎల్‌ సబిత్‌ అల్‌ హసన్‌ మరో కార్గో వెజల్‌ను ఢీకొట్టిన ఘటనలో 27 మంది మరణించారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు బంగ్లాదేశ్‌ పోలీసులు తెలిపారు.

పడవతో పాటు కొంత మంది నీటిలో మునిగిపోగా, మరి కొందరు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం 22 మృతదేహాలను వెలికితీయగా, మరో 5 మృతదేహాలను సోమవారం వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్‌ గార్డ్, ఫైర్‌ సర్వీస్, పోలీసు బలగాలు పాల్గొన్నాయి. ప్రమాదానంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియ పూర్తయిందని బంగ్లాదేశ్‌ దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ (బిత్వా) ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement