సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌కు వరద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, పులిచింతల నుంచి దిగువకు నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కు రెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో, అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇదే సమయంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు.. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లోకి ఇన్ ఫ్లో 88,879 క్యూసెక్కులుగా ఉండగా.. సముద్రంలోకి 71,650 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. ఇక, కాలువల ద్వారా 17,229 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాగా, రెండు అడుగుల మేర 30 గేట్లు, ఒక్క అడుగు మేర 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment