
సాక్షి, విజయవాడ: ఓ విద్యార్థి ఆదివారం ప్రకాశం బ్యారేజ్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి నుంచి నేరుగా బ్యారేజి వద్దకు చేరుకున్న అతను ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు. నదిలోకి దూకిన వ్యక్తి నాగూర్‌గా పోలీసులు గుర్తించారు.
అతను నదిలోకి దూకుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కృష్ణా నదిలో స్పీడ్ బోటుల ద్వారా నాగూర్‌ను గాలించి పట్టుకున్నారు. అప్పటికే నాగుర్ బాగా నీళ్లు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనికి ప్రాథమిక వైద్యం అందించి.. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగూర్ ప్రాణాలు విడిచాడు.