గుంటూరు : ఊహించినట్లుగానే గుంటూరు జిల్లాలోని పులిచింతల నీట మునిగింది. పులిచింతల ప్రాజెక్ట్కు నీటిమట్టం పెరగటంతో కోళ్లూరు గ్రామం కూడా పూర్తిగా జలమయం అయ్యింది. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలైన గొల్లపేట, చిట్యాల, చిట్యాల తండా, బోదనం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమంటున్నారు.
ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 10.30 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 46.5 టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి అయిన దానిని బట్టి 11 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిల్వ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు టీఎంసీల నీరు వస్తే తెలంగాణలో నాలుగు గ్రామాలకు ముంపు వాటిల్లే ప్రమాదం ఉంది. కాగా గ్రామాల్లోకి వచ్చేస్తున్న నీరు ఇప్పటికే పంట పొలాలను ముంచెత్తుతోంది. ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పైరు వరద నీటికి మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీట మునిగిన పులిచింతల
Published Sat, Oct 25 2014 11:01 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement