![CM Jagan Orders To Estimate Flood Losses In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/20/CM-YS-JAGAN_1.jpg.webp?itok=chzN8npI)
సాక్షి, విజయవాడ : భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గణనీయంగా తగ్గింది. ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థల సేవలు కొనసాగుతున్నాయి. భారీ వరదల నేపథ్యంలో ప్రకాశం నుంచి ఇప్పటివరకు 300 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక వరదల కారణంగా కృష్ణా జిల్లాలో 33 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 4300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటమునిగాయి. వరద తాకిడికి 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నాయి.
పూర్తి స్థాయిలో నష్టం అంచనాలు లెక్కించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన నష్ట నివేదికలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. కడపటి వార్తలు అందేసరికి ప్రకాశం బ్యారేజీకి 1.21 లక్షల క్యూసెక్కుల వరదలు వస్తుండగా.. 1.04 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునాసాగర్, పులిచింతల గేట్లు మూసేడయంతో ఇన్‌ఫ్లో నిలిచిపోనుంది.
(చదవండి : వరద తగ్గింది)
Comments
Please login to add a commentAdd a comment