River Krishna
-
గాల్లో తేలుతున్నట్లు.. నీటిపై నడయాడుతున్నట్లు..
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ పర్యాటకసిగలో మరో కలికితురాయి చేరనుంది. పర్యాటక ప్రియులకు గాల్లో తేలుతున్నట్లు..నీటిలో నడయాడుతున్నట్లనిపించేలా.. అద్భుత అనుభూతిని కలిగించే ‘గాజు వంతెన’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఎంతో ఎత్తైన ప్రదేశంలో నిర్మించే ఈ గాజువంతెనపై నడుసూ్త..కింద నీటి ప్రవాహాన్ని చూస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం అంటే ఆ మజానే వేరు. చదవండి: అయ్యో.. మొబైల్ పోయిందా? ఇలా చేయండి నంద్యాల జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై ఈ గాజు వంతెన నిర్మితం కానుంది. రూ.703.68 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కేఏ జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై గాజు వంతెనను నిర్మించనున్నారు. 800 మీటర్ల పొడవుతో నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలి రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంగమేశ్వరం వద్ద రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. నదులపై వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం, రైళ్లు వెళ్లేందుకు మరో మార్గం నిర్మిస్తారు. పర్యాటకులు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేక కారిడార్‌తో కూడిన గాజు వంతెన నిర్మిస్తారు. స్తంభాలు లేని వంతెన ఏపీలోని సంగమేశ్వరం, తెలంగాణలోని మల్లేశ్వరం తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు భారీ పైలాన్లను నిర్మిస్తారు. తీరం నుంచి 160 మీటర్ల తర్వాత పైలాన్లు ఉంటాయి. రెండు పైలాన్ల మధ్య 460 మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో పైలాన్‌కు రెండు వైపులా 15+15 చొప్పున 90 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటి ఆలంబనగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. ఇందులో సెంట్రల్ మీడియన్ భాగంలో గాజు ప్యానల్ కారిడార్ ఉంటుంది. దానికి రెండు వైపులా వాక్‌వేస్ ఉంటాయి. ఆ చివర, ఈ చివర గాజు ప్యానల్స్ ఉంటాయి. వీటి నుంచి దిగువన కృష్ణానది సోయగాలను చూడవచ్చు. గాజువంతెనపై నడుస్తూ నదిలో నడుస్తున్న అనుభూతినీ పొందవచ్చు. -
విషాదం: కొడుకు వీడియో తీస్తుండగానే..
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా): తాడేపల్లి కనకదుర్గవారధి మీద ఓ వృద్ధుడు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తానంటూ చెప్పి అమాంతం కృష్ణానదిలో దూకి గల్లంతైన ఘటనపై తాడేపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గల్లంతైన యం.దుర్గాప్రసాద్ తమ్ముడి కొడుకు సుదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అయిన దుర్గాప్రసాద్, ఆయన స్నేహితులు ముగ్గురు, కొడుకు వరసైన సుదీప్ తాడిగడప నుంచి కనకదుర్గవారధిపైకి వచ్చి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు కుంకుమ, పసుపు, పూలు చల్లుదామని మొదట అందరూ కలిసి కృష్ణానదిలో చేతిలో పట్టుకున్న పూజా సామగ్రిని వదిలిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం పెదనాన్న అయిన దుర్గాప్రసాద్ నేను ఒక్కణ్ణే పూజ చేస్తాను, వీడియో తియ్యి అంటూ చెప్పి తన జేబులో ఉన్న సూసైడ్ లెటర్‌ను, మిగతా వస్తువులను, సెల్‌ఫోన్‌ను కొడుక్కు ఇచ్చి పూలు చల్లుతూ వీడియో తీస్తుండగానే అమాంతం కృష్ణానదిలోకి దూకినట్లు తెలియజేశాడు. సూసైడ్‌నోట్‌లో “నా చావుకు ఎవరి ప్రమేయం లేదు. నాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చనిపోతున్నాను. నా తమ్ముడు అడ్రస్ మన్నె జనార్ధనరావు, తాడిగడప, విజయవాడ’అని రెండు ఫోన్ నంబర్లు రాసి, సంతకం పెట్టి ఉంది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తదుపరి చర్యలు చేపట్టకుండా ఏపీని ఆగమనండి
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపున కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఇతర ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని కేంద్రం అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఇటీవల రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పం దించారు. సదరు లేఖ అందిందని, దాన్ని తమ శాఖ పరిశీలిస్తోందని పే ర్కొంటూ శనివారం బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి లేఖ రాశారు. వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతికంగా పరిశీలించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను ఆదేశించినట్టు ఆ లేఖలో షెకావత్ పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న కృష్ణా నదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది తేలే వరకు ఈ ప్రాజెక్టుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు చెప్పాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అలాగే, కృష్ణానది నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల చర్యలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తమ శాఖ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. ఇది తెలంగాణ విజయం: బండి సంజయ్ కేంద్రమంత్రి ఆదేశాలపై సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తన లేఖకు స్పందించినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఇది శుభపరిణామమని, తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. -
30 ఏళ్ల వరద లెక్కలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో వరద జలాల లెక్కలను పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేశాకే మిగులు జలాల సంగతి తేల్చాలని కేంద్ర జల సంఘం (సీబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాలు 30 ఏళ్ల వరద లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగానే ఓ నిర్ణయానికి రావచ్చనే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ నెలాఖరులోగా ఇరు రాష్ట్రాలు వరద జలాల డేటా సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించాయి. మిగులు జలాలపై బుధవారం సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అధికారులు తెలంగాణ, ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్, కృష్ణా బోర్డు తరఫున సాంకేతిక కమిటీ సభ్యకార్యదర్శి హరికేశ్‌మీనా, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు నరసింహారావు, నాగేశ్వరరావు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇరవై నిమిషాల పాటు సాగిన కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున సీఈ నరసింహారావు మాట్లాడుతూ, ఈ ఏడాది ఏపీ తన వాటాకు మించి నీటిని వినియోగించిన అంశాన్ని దృష్టికి తెచ్చారు. వరద జలాలను సైతం ఎక్కువగా వినియోగించిందని, పోతిరెడ్డిపాడు ద్వారా అధికంగా నీటిని వినియోగించారని వెల్లడించారు. (చదవండి: తెలంగాణకు తీరని నష్టం) ఈ దృష్ట్యా వరద జలాలను ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వినియోగించుకోవాలో వాటాలు నిర్ణయించాలని కోరారు. ఏపీ తరఫున సీఈ మాట్లాడుతూ, ఈ నెలాఖరుతో వాటర్ ఇయర్ ముగుస్తున్నందున ఈ ఏడాది మిగులు జలాల వాటా ఎంత దక్కుతుందో చెప్పాలని కోరారు. అయితే దీనికి సీడబ్ల్యూసీ అభ్యంతరం చెబుతూ, ఇప్పటికిప్పుడు మిగులు జలాల వాటాలు తేల్చడం సాధ్యం కాదని తెలిపింది. మిగులు జలాలపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే శాశ్వత పరిష్కారం కనుగొందామని సూచించింది. జూన్ మొదటి వారంలో మరోమారు కాన్ఫరెన్స్ నిర్వహిద్దామని తెలిపింది. -
తెలంగాణకు తీరని నష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలిచిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం స్పష్టం గా చెబుతోందని పేర్కొన్నారు. అయినా దానికి విరుద్ధంగా ఏపీ నడుచుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా కొత్తదని, దీనికి ఎలాంటి అనుమతుల్లేవని, బోర్డు తక్షణం జోక్యం చేసుకొని దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీంతోపాటు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచడం కూడా తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు విఘాతం కలిగించేదేనని, ఈ దృష్ట్యా ఏపీ తీసుకొచ్చిన జీవో 203పై మరింత ముందుకెళ్లకుండా బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, నర్సింహా.. కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో బుధవారం జలసౌధలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు పేర్కొంటూ రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఏపీ ప్రాజెక్టులతో జరిగే నష్టాన్ని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు. ఈ అంశంపై తమ పరిధిలో ఏపీ నుంచి వివరణ కోరతామని బోర్డు వారికి హామీ ఇచ్చింది. అలా అయితే అభ్యంతరం లేదు: రజత్ భేటీ అనంతరం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టంపై బోర్డుకు వివరించామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించినట్లు చెప్పారు. గతంలోనే ఈ అంశంపై ఫిర్యాదు చేశామని, దీనిపై ఏపీ వివరణను బోర్డు కోరిందని, అయితే ఇప్పుడు అధికారికంగా జీవో వచ్చినందున తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. 3 టీఎంసీలతో చేపట్టే లిఫ్టు పథకం ముమ్మాటికీ కొత్తదేనని, దీనికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలని చెప్పామన్నారు. ఈ సందర్భంగానే తమ వాటా 512 టీఎంసీల నుంచే నీటిని వినియోగిస్తామని ఏపీ అంటోంది కదా అని ప్రశ్నించగా.. ‘ఏపీ తమ వాటా మేరకు నీటిని వాడుకుంటే అభ్యంతరం లేదు. అయితే అంతే నీటిని వాడుకుంటున్నారన్న దానికి సరైన విధానం లేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ పెట్టాలని చెప్పినా అది పూర్తిగా అమల్లోకి రాలేదు. అక్కడి నీటి వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదు. మాటల్లో చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటైతే సమస్యే కదా’అని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం మేరకు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర కేటాయింపులున్నాయని, అయితే పరీవాహకం ఆధారంగా చూస్తే తెలంగాణకు సైతం వాటా పెరగాల్సి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ ముందు తాము పోరాడుతున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో భారీ వరదలు వచ్చాయని, అలా వచ్చినప్పుడు సమస్య లేదని, అదే 2017, 2018లో వరద లేక క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలానికి వరద రాకుంటే తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలకు నీరందడం కష్టం అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రాజెక్టులను ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. -
‘మిగులు’ పంపకాలపై దృష్టి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీచేసే అంశంపై కృష్ణా బోర్డు దృష్టి పెట్టింది. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉన్నా, అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య తాత్కాలిక ఒప్పందాన్ని కుదిర్చే చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే జూన్‌లో వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే బోర్డు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి, ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుగా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి కేంద్ర జల వనరుల శాఖ ఆమోదం మేరకు వచ్చే వాటర్ ఇయర్లో దాన్ని అమలు చేయనుంది. (చదవండి: అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్) ఇప్పుడన్నా బోర్డు తేల్చేనా..? బజావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీ, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా ఇంత అని నిర్ణయించకపోవడంతో ఆయా రాష్ట్రాలు వాటి సరిహద్దుల్లోని ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారమే 34:66 నిష్పత్తిన తెలంగాణ, ఏపీ నీటిని వాడుకుంటున్నాయి. అయితే 2019–20 వాటర్ ఇయర్లో మొత్తం ఇరు రాష్ట్రాల నికర జలాల వాటా 811 టీఎంసీలకు మించి నీరొచ్చింది. మొత్తం గా 910 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు (ఏపీ–637 టీఎంసీలు, తెలంగాణ–273 టీఎంసీలు) వినియోగించుకోగా, మరో 797 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ప్రాజెక్టులు నిండి, వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదని, వరద నీటిని వాడుకుంటే దాన్ని రాష్ట్రాల వినియోగ లెక్కల్లో చూపరాదని ఏపీ గతంలో బోర్డు భేటీల్లో కోరింది. వరద ఉన్న 32 రోజుల్లో తాము 132 టీఎంసీల మేర నీటిని వినియోగించుకోగా, తెలంగాణ సైతం 39 టీఎంసీల మేర వాడుకుందని సైతం ప్రస్తావించింది. అయితే ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించలేదు. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చడం ఆలస్యమవుతున్నందున బోర్డు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని కోరింది. (చదవండి: దుమ్ముగూడెం టెండర్లలో భారీ కుంభకోణం) చేసేది లేక బోర్డు దీనిపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో కమిటీని నియమించింది. ఇందులో బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను చెప్పనుంది. ఆయా రాష్ట్రాల ఈఎన్సీలు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కాన్ఫరెన్స్ అనంతరం బోర్డు తన నివేదికను కేంద్రానికి సమర్పించి, వారి ఆమోదం ప్రకారమే నడుచుకోనుంది. గోదావరి జలాల అంశమూ తెరపైకి.. కొత్తగా తెలంగాణ గోదావరి మిగులు జలాల అంశాన్నీ తెరపైకి తెచ్చింది. గోదా వరిలో తెలంగాణకు 954, ఏపీకి 500 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఏటా గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నా, మిగులు జలాలపై మాత్రం గతంలో ట్రిబ్యునల్ కానీ, కేంద్రం కానీ తేల్చలేదు. ఈ వాటర్ ఇయర్‌లోనూ గోదావరిలో 3,788 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. ప్రస్తుతం తెలంగాణ వాటా 954 టీఎంసీల మేరకు నీటి వినియోగం చేసేలా ప్రాజెక్టులు పూర్తయినందున, అంతకుమించి నీటిని తీసుకునేలా మిగులు జలాల వాటాను తెరపైకి తెచ్చింది. కనీసంగా 600 టీఎంసీల వాటా దక్కించుకునేలా ప్రణాళిక రచిస్తోంది. దీనిపైనా గోదావరి బోర్డుకు లేఖ రాయాలని, అటు నుంచి వచ్చే అభిప్రాయాల మేరకు కేంద్రం వద్ద పోరాడాలని భావిస్తోంది. -
అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను వినియోగిస్తూ పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 పూర్తిగా అక్రమమని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరంగా ఉన్న ఈ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సహా ఎలాంటి ముందడుగు వేయకుండా ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కృష్ణా జలాలను ఆధారంగా చేసుకొని చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఏపీ నిర్ణయం తీవ్ర నష్టం చేస్తుందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సమా వేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఇందులో ఏపీ తెచ్చిన జీవో అంశాలను లేఖలో పేర్కొంటూ, ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరిగాయో వివరించారు. శ్రీశైలం నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ చేపడుతున్న ఎత్తిపోతలతో పాటు, పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖలోని ప్రధానాంశాలివీ.. (చదవండి: ‘మిగులు’ పంపకాలపై దృష్టి!) ఏపీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అతిక్రమించి ఈ ప్రాజెక్టులు చేపడుతోంది. ఇవి పూర్తిగా కొత్త ప్రాజెక్టులే. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టరాదనే నిబంధనను ఏపీ తుంగలో తొక్కింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణతో పాటు శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సంబంధించి వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలతో గతంలోనే ఇరిగేషన్ ఈఎన్సీ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై బోర్డు స్పందిస్తూ, కొత్త ప్రాజెక్టుల డీటైల్డ్ రిపోర్టులు బోర్డుకు సమర్పించాలని ఇదివరకే బోర్డు ఏపీని ఆదేశించింది. అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు మే 5న జీవో నం.203 జారీచేసింది. దీని ప్రకారం రూ.6,829.15 కోట్లతో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేయనున్నారని తెలిపారు. ఇలా లిఫ్ట్‌చేసే నీటిని పోతిరెడ్డిపాడు నుంచి నాలుగు కి.మీ. దూరంలోని శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌కు లింక్ చేయనున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి అదనంగా కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు కాలువ క్యారింగ్ కెపాసిటీని ఏపీ పెంచుతోంది. కాబట్టి దీన్ని పూర్తిగా కొత్త ప్రాజెక్టుగా చూడాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని రోజుకు 8 టీఎంసీలకు పెంచేలా పునర్వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధంగా, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేలా ఏపీ నిర్ణయం ఉంది. శ్రీశైలం రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అదనపు నీటిని తీసుకునే ముందు మా రాష్ట్రానికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. భారతదేశంలోని ఒక బాధ్యతాయుతమైన రాష్ట్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఎవరూ ఊహించరు. హైదరాబాద్ నగర తాగునీరు, మిషన్ భగీరథ అవసరాలతో పాటు పాత మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం జలాశయంపైనే ఆధారపడుతోంది. ఏపీ కొత్త ప్రాజెక్టులతో నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్, ఏఎమ్మార్ ఎస్ఎల్బీïసీ, కల్వకుర్తి, డిండి, పాలమూరు– రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులు, శ్రీశైలం ఎడమగట్టు పవర్‌స్టేషన్‌లో విద్యుత్ ఉత్పాదనపై తీవ్ర ప్రభావం పడుతుంది. బేసిన్ అవతలి అవసరాలకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తెలంగాణలోని కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు ప్రమాదంలో పడతాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బేసిన్ అవతలికి నీటిని తరలిస్తున్న ఏపీ వాటికి సరైన లెక్కలు కూడా చెప్పడంలేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీలు లేకపోవడంతో ఏపీ ఎన్ని నీళ్లు తీసుకుంటుందో కూడా లెక్కలు లేవు. దీంతో ఆ రాష్ట్రం ఎక్కువ ప్రయోజనం పొందుతోంది. విచక్షణారహితంగా, ఇష్టారాజ్యంగా కృష్ణానీటిని బేసిన్ అవతలికి మళ్లిస్తోంది. వాస్తవంగా పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకే అనుమతి ఉంది. కానీ, ఏపీ కుట్రపూరితంగా దాని కెపాసిటీని 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడంతో పాటు పవర్ ఛానల్ ద్వారా మరో 5వేల క్యూసెక్కులు వినియోగిస్తోంది. ఈ కుట్రను తెలంగాణ.. ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లింది. దీంతో ప్రస్తుతం ఏపీ నిర్ణయం న్యాయ పరిధిలోకి వస్తుంది. ఆయా రాష్ట్రాల పరివాహకాన్ని పరిగణనలోకి తీసుకొని జలాల పంపిణీ ఉండాలన్న ప్రాథమిక సూత్రం మేరకు, ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీ మేర కచ్చితంగా దక్కుతాయి. సమీప భవిష్యత్తులోనే ఈ నిర్ణయం వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏపీ శ్రీశైలం జలాశయం నుంచి అదనపు జలాలను తీసుకెళ్లడం పూర్తిగా అన్యాయం. పునర్వ్యవస్థీకరణ చట్టం, 11వ షెడ్యూల్లోని 85(8)(డి) క్లాజ్–1 ప్రకారం చట్టబద్ధ అధికారాలున్న కృష్ణా బోర్డు.. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులను సమర్థించడంగానీ, సిఫార్సు చేయడంగానీ సమర్థనీయం కాదు. నేడు కృష్ణాబోర్డు చైర్మన్‌తో రజత్‌కుమార్ భేటీ ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203జీవోను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఈ ప్రాజెక్టులపై కృష్ణాబోర్డు చైర్మన్‌ను నేరుగా కలిసి వివరించాలని నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో రజత్‌కుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బోర్డు చైర్మన్‌తో భేటీ అయి, ఏపీ జీవోలపై ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ చర్యలు తెలంగాణకు ఎలా భంగకరమో వివరించనున్నారు. కాగా కృష్ణా, గోదావరి బోర్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ మెంబర్‌గా రజత్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. గతంలో ఈ స్థానంలో నీటి పారుదల శాఖ ఇన్చార్జి బాధ్యతలు చూసిన సీఎస్ సోమేశ్‌కుమార్ సభ్యుడిగా ఉండగా, ఆయన స్థానంలో ప్రస్తుతం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రజత్‌కుమార్ నియమితులు కావడంతో ఆయనను సభ్యుడిగా నియమించింది. (చదవండి: ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్) -
న్యాయ పోరాటం చేస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, జీఓ కూడా విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా చెబుతోందని, కానీ ఏపీ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదని పేర్కొన్నారు. (చదవండి: ప్రగతి భవన్‌కు రండి) ‘‘శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణను సంప్రదించకుండా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డులో ఫిర్యాదు చేస్తాం’’అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడం గతంలో ఉన్న వివాదాలు, విభేదాలు పక్కనపెట్టి రెండు రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని ఏపీకి స్నేహహస్తం అందించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని తానే చొరవ చూపించానని, కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి కొత్త పథకం ప్రకటించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తేలేదని, ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీలు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటిపారుదల సలహాదారు ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏజీ బీఎస్ ప్రసాద్, అడిషనల్ ఏజీ రామచందర్‌రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. (చదవండి: హైదరాబాద్‌కు చేరుకున్న‘వందేభారత్’ ఫ్లైట్) -
‘కృష్ణా జలాలపై రాజకీయాలు సరికాదు’
సాక్షి, నెల్లూరు: కృష్ణా జలాల వినియోగంపై కొన్ని పార్టీలు రాజకీయం చేయడం సరికాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 800 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని.. ఇందుకోసం రూ.7 వేల కోట్లతో పాలనాపరమైన అనుమతులను ఇచ్చారని వివరించారు. కృష్ణాకు సగటున 30 రోజుల పాటు మాత్రమే వరద వస్తోందని.. ఈ సమయంలోనే నీటిని పూర్తిగా వాడుకోవాలని చెప్పారు. (గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ సమీక్ష) ‘‘నీటి వినియోగం కృష్ణా రివర్ మెనేజ్మెంట్ బోర్డ్ ప్రకారమే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య చక్కటి సంబంధాలున్నాయి. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానంపై పరస్పరం చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కరోనా వల్ల సమావేశాలు ఆలస్యమయ్యాయని’’ ఆయన పేర్కొన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. (విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ) -
‘ప్రజలు బలైపోయినా బాబుకు ఫరవాలేదట..’
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలేమైనా ఫరవాలేదు.. తను బాగుంటే చాలు అన్న తీరుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం, బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్లో.. ‘అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు ‘తీసేసిన తాసిల్దార్లు’’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు. -
నష్టం అంచనాలు లెక్కించండి : సీఎం జగన్
సాక్షి, విజయవాడ : భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గణనీయంగా తగ్గింది. ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థల సేవలు కొనసాగుతున్నాయి. భారీ వరదల నేపథ్యంలో ప్రకాశం నుంచి ఇప్పటివరకు 300 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక వరదల కారణంగా కృష్ణా జిల్లాలో 33 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 4300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటమునిగాయి. వరద తాకిడికి 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయిలో నష్టం అంచనాలు లెక్కించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన నష్ట నివేదికలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. కడపటి వార్తలు అందేసరికి ప్రకాశం బ్యారేజీకి 1.21 లక్షల క్యూసెక్కుల వరదలు వస్తుండగా.. 1.04 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునాసాగర్, పులిచింతల గేట్లు మూసేడయంతో ఇన్‌ఫ్లో నిలిచిపోనుంది. (చదవండి : వరద తగ్గింది) -
కృష్ణా వరదలపై సీఎం జగన్ సమీక్ష
వాషింగ్టన్ డీసీ: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణానది వరదలపై సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపించిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఎగువనుంచి వస్తున్న వరద నీరు, విడుదల చేస్తున్న జలాలపై ఆరా తీశారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. బాధితులకు సహాయం అందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని, బాధితులకు సహాయం చేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. వరద సహాయ కార్యక్రమాలు చురుగ్గా, వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రికి సీఎంఓ అధికారులు వివరించారు. ఇక వాషింగ్టన్ డీసీ నుంచి సీఎం జగన్ డల్లాస్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.11 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30) డల్లాస్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రముఖులను కలుసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని.. కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీలో సందడి వాతావరణం నెలకొంది. సీఎం జగన్ సభకోసం ప్రవాసాంధ్రులు భారీగా తరలివస్తున్నారు. -
కరకట్ట లోపల భవనాలను పరిశీలించిన మంత్రులు
సాక్షి, గుంటూరు : కృష్ణా నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు, మంత్రులు పరివాహక ప్రాంతంలో తాజా పరిస్థితిని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు కరకట్ట లోపల ఉన్న భవనాలను పరిశీలించారు. కరకట్ట లోపల ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌తోపాటు, తులసి వనం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, నీటి మునిగిన పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరద నీరు కరకట్టపైన ఉన్న నివాసాల్లోకి రావడంతో.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టామని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవద్దని హితవు పలికారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కరకట్టపై ఉన్న నివాసాల్లోకి నీరు ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజల భద్రతపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వరదలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేందుకు వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు నివాసం కూడా కరకట్టపైనే ఉండటం.. అక్కడ టీడీపీ శ్రేణులు హంగామా సృష్టించడం అందులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంపు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటాం.. అనంతరం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ కృష్ణ లంకలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ బొప్పన భవకుమార్ మంత్రులకు ముంపు సమస్యను వివరించారు. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని ముంపు బాధితులు మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంలో జాప్యం చేసి టీడీపీ ప్రభుత్వం తమ కొంపలు ముంచిందని మండిపడ్డారు. బాధితుల సమస్యలపై స్పందించిన మంత్రి బొత్స.. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ముంపు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాలే రాని చంద్రబాబు పాలనలో వరదలు అంటే ఎవరికి తెలియవు.. అలాంటి మాజీలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమం లేకే ఈ ప్రాంతవాసులు ముంపుకు గురయ్యారని విమర్శించారు. నష్ట నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
‘వరదకు చెబుదామా చంద్రబాబు ఇంట్లోకి రావొద్దని..’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల వైఖరిపై నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. కృష్ణా పరివాహకంలో డ్రోన్ సాయంతో వరద పరిస్థితుల్ని అంచనా వేస్తున్నామన్న ఆయన.. డ్రోన్ వినియోగిస్తే టీడీపీ నేతలకు వచ్చిన బాధేంటని ప్రశ్నించారు. శుక్రవారం మంత్రి అనిల్‌కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ‘శ్రీశైలం నిండకుండానే నీళ్లు కిందకి వదిలేసామని దేవినేని ఉమా అర్థంపర్థం లేకుండా వాదిస్తున్నారు. ఆయన చెప్పినట్టు చేస్తే చంద్రబాబు ఇల్లు ఎప్పుడో మునిగిపోయేది. అయినా.. చంద్రబాబు ఉన్నన్నాళ్లు ఎక్కడైనా నీళ్లు వచ్చాయా..? అందుకే టీడీపీ నాయకులు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. శ్రీశైలం మొత్తం నింపి నీళ్లు వదలాలి అని సలహాలిస్తున్నారు. ఒక్కసారి పరిస్థితులు గమనించండి. అన్ని డ్యామ్‌లను నింపి ఒకేసారి నీటిని వదిలితే 12 లక్షల క్యూసెక్కులకు పైగా వదలాల్సి వచ్చేది. అది సరైంది కాదు. ప్రతి రిజర్వాయర్‌లో కొంత వెసులుబాటు ఉంచుకుని నీళ్లు వదులుతాం. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద పోటెత్తడంతో ఇబ్బందుల్లో పడతామని గ్రహించి చంద్రబాబు ముందే హైద్రాబాద్ వెళ్లిపోయారు. ప్రకాశం బ్యారేజీకి నాలుగు రోజుల కిందట నీళ్లు వదలడం ప్రారంభించాం. ప్రతిపక్ష నాయకుడి ఇల్లు మునిగితే చూస్తూ ఊరుకోలేం కదా. ఒకవేళ అలానే వదిలేస్తే ఇల్లు మునిగేవరకు ఎవరూ స్పందించలేదని మళ్లీ మాపై విమర్శలు చేస్తారు. పోనీ వరదలకు చెబుదామా చంద్రబాబు నివాసంలోకి నీళ్లు రావద్దని. వరద ముంపు లేదనుకుంటే.. బాబు ఇంటి దగ్గర ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారు. ఇసుక బస్తాలు వేసి వరద వెళ్లే మార్గానికి అడ్డంకులు సృష్టించడం సరైందేనా. ఇక్కడ మీ ఇల్లు కాపాడుకోవడానికి వేరొకరి ఇల్లు మునిగేలా చేస్తారా. వరదలకు పడవ కొట్టుకుని వస్తే మాకు మేనేజ్మెంట్ తెలియదంటున్నారు. బాబులా గోదావరి పుష్కరాలు లో 29 మంది ప్రాణాలు పోగొట్టుకునేలా చేసేంత మేనేజ్మెంట్ మాకు తెలియదు. ఒకవేళ టీడీపీ వాళ్ల హయాంలో నీళ్లు వచ్చుంటే రూ. 50 కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టేవాళ్లు. కుషన్ లేకుండా డ్యామ్‌లు మొత్తం నింపితే బ్యాక్ వాటర్ వలన గ్రామాలు ఎక్కువగా మునిగిపోతాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటిని విడుదల చేస్తున్నాం. రైతులంతా సంతోషం గా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం తెగ బాధ పడిపోతున్నారు. చంద్రబాబు పాలనా కాలంలో దేశం మొత్తం వర్షాలు లేక.. రిజర్వాయర్లకి నీళ్లు రాకుండాపోయాయి’ అన్నారు. -
‘ముప్పు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారు’
సాక్షి, విజయవాడ : పులిచింతల నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీవైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. 4.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రులు కురసాల కన్నబాబు ,వెల్లంపల్లి శ్రీనివాస్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ ,జేసీ మాధవీ లత వరద పరిస్థితుల్ని వారికి వివరించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళతో ఉన్నాయని కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘కృష్ణా, గోదావరినదులు ఉప్పొంగడంతో వరదలు పోటెత్తుతున్నాయి. 4.47లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి కిందకు విడుదల చేస్తున్నారు. నాగాయలంక, కంచికచర్ల, భవానీపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం. నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మునిగిపోయిన తర్వాత సహాయక కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కాదిది. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, ఇతర సదుపాయాలు కల్పించాం. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు స్నానానికి నదిలో దిగొద్దు. ముందస్తుగా గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం’అన్నారు. మంచి చెప్పినా రాజకీయమన్నారు.. ప్రకాశం బ్యారేజీ 70గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పదేళ్ల తర్వాత అన్ని డ్యామ్‌లు నిండుకుండలా మారాయని ఆనందం వ్యక్తం చేశారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మాజీ సీఎం చంద్రబాబు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి నీటి వరద వచ్చింది. చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు. వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముప్పు వస్తుందని సీఎం జగన్ ముందే చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి చెప్పినా రాజకీయ కోణంలోనే చూశారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముంపు ముప్పులో చంద్రబాబు కరకట్ట నివాసం..!
సాక్షి, అమరావతి : కష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కి తరలించారు. ఇంట్లోని కింది గదుల్లో ఉన్న సామాన్లను మేడపైకి తరలించారు. వరద ముప్పును ముందే గ్రహించిన చంద్రబాబు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు పయనమైనట్టు సమాచారం. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. -
కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలి
బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను మరోమారు కోరిన రాష్ట్రం ► పోలవరం, పట్టిసీమల కింద ఏపీ గోదావరి నీటిని తరలిస్తున్నందున ఆ మేరకు కృష్ణాడెల్టాకు కోత పెట్టాలి ► పాలమూరు, డిండి, వాటర్ గ్రిడ్‌కు నీటి కేటాయింపులు చేయాలి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో తమకున్న నికర జలాల కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్లో రాష్ట్రానికి మొత్తంగా 599.90 టీఎంసీల మేర అవసరాలున్నాయని, ఇందులో రాష్ట్రానికి ఉన్న పరివాహకం, సాగు యోగ్యభూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభాను దృష్టిలో పెట్టుకొంటే ప్రస్తుతం లభ్యతగా ఉన్న 811 టీఎంసీల నికర జలాల్లో 574.6 టీఎంసీలు తెలంగాణకు దక్కాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు అదనపు వాటాలు దక్కుతాయన్న అంశాన్ని వివరిస్తూ, పెరిగే వాటాను రాష్ట్రానికి కేటాయించాలని కోరింది. పోలవరం, పట్టిసీమల కింద చేస్తున్న వినియోగం మేరకు ఏపీకి కృష్ణా డెల్టా కింద చేసిన కేటాయింపుల్లో కోత పెట్టాలని విన్నవించింది. ఇక ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవికావని, వాటికి అవసరాలకు అనుగు ణంగా నీటి కేటాయింపులు చేయాలని విన్న వించింది. ఈ మేరకు కృష్ణా జలాలపై విచా రణ చేస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు సోమవారం 67 పేజీలతో అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అఫిడవిట్‌లోని ప్రధానాంశాలివీ... ⇒ తెలంగాణకు కృష్ణా బేసిన్లో 68.5శాతం పరివాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 36.9 శాతమే. అదే ఏపీకి 31.5 శాతం పరివాహకం ఉన్నా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలను ఏపీ బేసిన్ బయటే వాడుకుం టోంది. బేసిన్ పరివాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణలో 36.5 లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో కేవలం 15.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. జనాభాపరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో కేవలం 78.29 లక్షలు (28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలను పరిగణన లోకి తీసుకుంటే 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 574.6 టీఎంసీలు, ఏపీకి 236.4 టీఎంసీలు దక్కుతాయి. ⇒ రాష్ట్రంలో 299 టీఎంసీలకు ప్రాజెక్టులు నిర్మితమై ఉండగా, 225 టీఎంసీలకు ప్రాజె క్టులు నిర్మాణంలో ఉన్నాయి, మరో 36 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టా ల్సి ఉంది. ఇక తాగు నీరు, పరిశ్రమల నీటి అవసరాలకు కలిపి రాష్ట్రానికి మొత్తంగా 599.90 టీఎంసీల అవసరం ఉంటుంది. ⇒ 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన 80 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలి. ఇక ఏపీ పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలిస్తోంది. ఈ దృష్ట్యా పట్టిసీమ ద్వారా చేస్తున్న వినియోగం మేరకు కృష్ణా డెల్టాకు కోత పెట్టాలి. ⇒ బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటి అవసరాలు తీరాకే బేసిన్అవతలి ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాలి. ⇒ కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వాడుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా, అదే కృష్ణాలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న అనుమతినిచ్చింది. వీటితోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, వాటర్‌గ్రిడ్‌లకు లభ్య త జలాలను కేటాయించి 7దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించాలి. ⇒ ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. ఈ దృష్ట్యా ఇక్కడ లభ్యత జలాలు వచ్చేట్లు ఏపీ సహకరించేలా చూడాలి. -
రబీ వేళ ఆంధ్రప్రదేశ్ రచ్చ!
• కృష్ణా జలాల్లో రాష్ట్ర నీటి వాడకానికి కోత పెట్టే ప్రయత్నం •తెలంగాణ 36 శాతం అధికంగా నీరు వాడుకుందని • బోర్డుకు ఫిర్యాదు.. రాష్ట్రాన్ని వివరణ కోరిన కృష్ణా బోర్డు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్ర వాటాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పేచీకి దిగింది. రాష్ట్ర రబీ అవసరాలకు నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డును తెలంగా ణ ప్రభుత్వం కోరిన సమయంలో..అందులో కోత పెట్టించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత వాటర్ ఇయర్లో తెలంగాణలో సగటు వర్షపాతం అధికంగా నమోదైందని, ఆ ప్రకారం తెలంగాణ వాటాలకు మించి కృష్ణా జలాలను వాడుకుందని వాదిస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదుపై కదిలిన బోర్డు.. దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణకు లేఖ రాసింది. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ సోమవారం తెలంగాణకు లేఖ రాశారు. చిచ్చు పెట్టే లెక్కలు... గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉండ టంతో రబీ అవసరాలకు నీటిని విడుదల చేయాలంటూ తెలంగాణ, ఏపీ ఇప్పటికే బోర్డును కోరారుు. నీటి అవసరాల జాబితా ను సమర్పించారుు. మొత్తంగా కృష్ణాలో 103 టీఎంసీ లు తెలంగాణ కోరింది. ఈ ఏడాది లభ్యత నీటిలో ఏపీ 187.18 టీఎంసీలు వాడుకోగా తాము 64.8 టీఎంసీలనే వినియోగించు కున్నామని బోర్డుకు తెలిపింది. తెలంగాణ నీటి విడుదల విజ్ఞప్తిపై అభ్యం తరం వ్యక్తం చేస్తూ ఏపీ సోమవారం బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ ఇప్పటికే అధికంగా నీటిని వాడుకుందని ఫిర్యాదు చేసింది. లేఖలో ఏపీ ఏం చెప్పిందంటే... ‘ఈ ఏడాది తెలంగాణలో సగటు కంటే 18 శాతం అధికంగా 982.7 మి.మీ. వర్షం కురిసింది. ఏపీలో 582.50 మి.మీ.యే కురిసింది. తెలంగాణలో భారీ వర్షాలతో చెరువుల కింద 89.15 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. దీన్ని నమోదు చేయకుండా కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోని చిన్న నీటివనరుల కోసం బచావత్ ట్రిబ్యునల్ 89.11 టీఎంసీలు కేటరుుంచినా 30 టీఎంసీలకు మించి వాడుకోలేని స్థితి ఉందని గతంలోనే స్పష్టం చేసినా ఏపీ మళ్లీ ఫిర్యాదు చేయడం రబీ అవసరాల్లో కోత పెట్టజూడటమేనని తెలంగాణ మండిపడుతోంది. -
వరద ఉధృతి తగ్గుముఖం
మున్నేరు నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి పెరిగిన సందర్శకులు రెండు రోజులుగా నిండుకుండలా కనిపించిన కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుతోంది. వరద ఉధృతి నెమ్మదించడంతో పులిచింతల ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ దిగువకు వదిలే నీటిని తగ్గించారు. ప్రస్తుతానికి మూసీ నది నుంచి మాత్రమే కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మూసి వరద తగ్గుముఖం పడితే యథాతథ స్థితికి చేరే అవకాశం ఉంది. సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆదివారం తగ్గుముఖం పట్టింది. 1.33 లక్షల క్యూసెక్కులు వచ్చే నీరు 1,01,222 క్యూసెక్కులకు పరిమితమైంది. శనివారం బ్యారేజీ దిగువకు 1.50 లక్షల క్యూసెక్కులు వదలగా.. ఆదివారం కేవలం 93,240 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. కాల్వలకు 7,982 క్యూసెక్కులు వదలిపెట్టారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను రెండడుగుల ఎత్తుకు పరిమితం చేశారు. మున్నేరు నుంచి శనివారం 60 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. ఆదివారం 25 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సోమవారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. పెనుగంచిప్రోలు, వేదాద్రి, ముక్త్యాలల్లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్లకు సందర్శకుల తాకిడి.. ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు సెలవు కూడా కావడంతో ప్రకాశం బ్యారేజీకి సందర్శకుల తాకిడి ఎక్కువైంది. సాధారణ రోజుల్లో బ్యారేజీ దిగువన ఇసుక తిన్నెలు మాత్రమే దర్శనమిస్తుంటాయి. అలాంటిది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు దూసుకుపోవడాన్ని ప్రజలు తిలకించి పులకించారు. బ్యారేజీపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ పోలీసులు వాహనాలను నిలవనివ్వలేదు. దీంతో పద్మావతి ఘాట్, కృష్ణవేణì , దుర్గా, పున్నమి ఘాట్ల వద్దకు సందర్శకులు వెళ్లారు. చిరు వ్యాపారాలు జోరుగా సాగాయి. భవానీ ద్వీపానికి తగ్గిన సందర్శకులు కృష్ణానదికి వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో భవానీ ద్వీపానికి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. వదరల కారణంగా నదిలోకి వెళ్లేందుకు ఆసక్తి కనపరచలేదు. నదిలో బోటింగ్ య«థావిధిగా సాగుతున్నప్పటికీ సందర్శకులు మాత్రం ఒకడుగుడు వెనక్కి వేశారు. సాధారణంగా వారాంతంలోను, సెలవు రోజుల్లోనూ 2,500 మంది ద్వీపానికి వస్తారు. ఆదివారం మాత్రం ఐదారు వందలకు మించి రాలేదు. బోటింగ్ ద్వారా పర్యాటక సంస్థకు రూ.లక్ష ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ. 35 వేలకే పరిమితమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
కర‘కట్’
హంసలదీవి సమీపంలో సముద్ర కరకట్టకు భారీ కోత వరద నీటితో ఉధతంగా ప్రవహిస్తున్న కష్ణమ్మ తీరప్రాంతాల ప్రజల్లో ఆందోళన కోడూరు:సముద్రం బారి నుంచి దివిసీమ ప్రజలను రక్షించి కాపాడుతున్న ‘దివి రక్షణ’ కవచమైన కష్ణా కరకట్ట భారీస్థాయిలో కోతకు గురవుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీరప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజీ నుంచి పెద్దఎత్తున వరద నీటిని సముద్రంలోకి వదలడంతో కష్ణానదిలో నీటి ఉధతి గంటగంటకు పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర వదిలిన నీరు మొత్తం మండల పరిధిలోని హంసలదీవి సమీపంలోని సాగరసంగమం వద్ద సముద్రంలో కలుస్తాయి. అయితే ఈ వరద నీరు మొదట అవనిగడ్డలోని పులిగడ్డ అక్విడెట్ చేరుకొని అక్కడ నుంచి ఉల్లిపాలెం మీదగా సముద్రంలో కలవాల్సి ఉంది. వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు నీరు ఊళ్ల మీద పడకుండా 2004వ సంవత్సరంలో నాగాయలంక మండలం గుల్లమోద నుంచి ఉల్లిపాలెం వరకు రూ.25కోట్ల వ్యయంతో కరకట్టను నిర్మించారు. అయితే 2008 సంవత్సరంలో వచ్చిన భారీ వరదల ప్రభావానికి ఉల్లిపాలెం సమీపంలో కరకట్టకు భారీ కోత ఏర్పడింది. ఆ కోత ప్రాంతంలో భారీ కొండరాళ్లతో రివిట్మెంట్ వేశారు. మళ్లీ పక్కనే మరో కోత.. మళ్లీ అక్కడే సముద్రం అటుపోట్లతో రెండు నెలల క్రితం కరకట్టకు కోత ఏర్పడింది. తాజా వరద ఉధతికి కోత మరింత ఎక్కువై ఎప్పడైనా గండిపడే ప్రమాదం పెరిగింది. రెండు నెలల నుంచి సమస్యను ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ ఉపద్రవాలు సంభవించక ముందే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కృష్ణా నది తీరంలో అమరలింగేశ్వర గుహ
-
యుగయుగాల కృష్ణమ్మకు వందనం...
స్మరణాత్ సర్వదోషఘ్నీం, దర్శనాత్ స్వర్గదాయినీం స్నానేన ముక్తిదాం పుణ్యాం కృష్ణవేణీం నమామ్యహమ్ కృష్ణానదిని తలుచుకుంటే చాలు దోషాలన్నీ పోతాయి. చూస్తే చాలు స్వర్గం లభిస్తుంది. స్నానం చేస్తే ముక్తి చేకూరుతుంది. విష్ణుస్వరూపంగా కృష్ణ, శివస్వరూపంగా వేణి సహ్య పర్వతంపై అశ్వత్థ (రావి), అమలక (ఉసిరి) చెట్ల మొదటి నుంచి ప్రవహిస్తూ కలిసిపోయి కృష్ణవేణిగా ఒక్కటైనారు. హంసలదీవి సాగర సంగమం వరకు ఎన్నో తీర్థాలుగా, క్షేత్రాలుగా యుగయుగాలుగా ప్రవహిస్తున్న నదులరాణి కృష్ణవేణి. ఏ నదులూ కృష్ణమ్మకు సాటి రావు. మిగిలిన నదులన్నీ బ్రహ్మ సృష్టి. శ్రీమన్నారాయణుడు లోకరక్షణ కోసం తన జలావతారంగా కృష్ణానదిని సృష్టించాడు. ఆయనకు తోడుగా పరమేశ్వరుడు తన జలరూపాన్ని వేణీనదిగా చేశాడు. శివకేశ వ సృష్టి కృష్ణవేణి. అల గంగమ్మకు లేదు గౌతమికి లేదీ యోగ మా విష్ణువే వెలసెన్ నీవుగ కృష్ణవేణి! కలిలో వెంటాడు పాపమ్ములన్ తొలగం ద్రోయగ మోక్షమీయగ కళాదుర్గమ్మైవై జ్ఞానదో హలవై కూర్తువు భుక్తి ముక్తులను సస్యశ్యామలానందినీ! అని కవులు కృష్ణవేణీ వైభవాన్ని ఎన్నో విధాలుగా కీర్తించారు. స్కాందపురాణం, పద్మపురాణాలలో రామాయణ భారత భాగవతాలలో కృష్ణానదీ ప్రస్తావన ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు కృష్ణవేణిని భక్తి ప్రపత్తులతో స్తుతించారు. వారి వాక్కులో మహిమ, మంత్రబలం వల్ల ఆ స్తోత్రాలు చదివినవారికి ఎన్నో లాభాలు ఉంటాయి. కలియుగంలో మానవులు తమ పాపాలు పోగొట్టుకోవడానికి గంగ, యమున, నర్మద, గోదావరి వంటి నదుల్లో మునుగుతారు. వారందరి పాపాలతో ఈ నదులు కలుషితం అవుతాయి. వాటి కాలుష్యం పోవటానికి, మళ్లీ పవిత్రం కావటానికి శ్రీమహావిష్ణువు తన అంశతో కృష్ణానదిని సృష్టించాడు. నదులన్నీ వచ్చి కృష్ణలో మునగాలి. అప్పుడు అవి స్వచ్ఛం అవుతాయి. గంగానది కాకి రూపంలో వచ్చి కృష్ణా సాగరసంగమంలో మునిగి హంసగా మారింది. అక్కడ హంసలదీవి ఏర్పడింది. కృష్ణ హంసతీర్థం అయ్యింది. ‘కృష్ణా కృష్ణాంగ సంభూతా ప్రాణినాం పాపహారిణీ స్వర్గదా మోక్షదా నౄణాం భవబంధముక్తిదా’ అంటూ సూతమహర్షి కీర్తించాడు. ‘కార్యద్వయం సముద్దిశ్య కృష్ణవేణీ భవామ్యహం జగతా రక్షణార్థాయ మద్భక్తానాం చ ముక్తయే’ రెండు పనుల కోసం నేను కృష్ణవేణిగా అవతరించాను. ఒకటి లోకాలను పాపాల నుంచి రక్షించడం, రెండు నా భక్తులకు ముక్తినివ్వడం కోసం అని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కృష్ణవేణి ఘనతను చెప్పాడు. నేనే కృష్ణవేణిని కనుక కృష్ణనీళ్లు త్రాగినవారి హృదయంలోకి నేను ప్రవేశిస్తాను. వారి భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తాను. అందరూ కృష్ణ నీరు త్రాగండి అని శ్రీమహావిష్ణువు చెప్పాడు. ‘కృష్ణాం ససర్జ సంపన్నో దివ్యమూర్తిం సులోచనాం శ్యామలాం విష్ణుచిహ్నాంకాం చతుర్భుజాం శుభప్రదామ్’ అని నారద మహర్షి కృష్ణవేణీ రూపాన్ని వర్ణించాడు. కల్పాద్యస్య కృతస్యాదా వియం దేవీ వసత్పురా వైష్ణవీ బ్రహ్మణః పుత్రీ పూజ్యమానా సురర్షిభిః తథా పుణ్యమయీ కృష్ణా సర్వత్ర సుధియో జనః విష్ణు స్వరూపిణి, బ్రహ్మ దత్తపుత్రిక, దేవతలు, ఋషులు పూజించే కృష్ణానది సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఆమె పుణ్యప్రదాయిని.. అని సాక్షాత్తు పరమేశ్వరుడు కృష్ణ ఎంత ప్రాచీనమైనదో చెప్పాడు. పేరు ఎలా వచ్చింది... కృష్ణానదికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా పరమేశ్వరుడు ప్రకటించాడు. నదీనమగ్రజననాత్ మాహాత్మ్యాత్చ మహత్వతః సర్వం కర్షతి చాఘౌఘం తేన కృష్ణా ప్రకీర్తితా అన్ని నదుల కంటే ముందు పుట్టి తన మహిమతో అందరి పాపాలను తనలోకి ఆకర్షించుకొనే శక్తి కలిగి ఉండడం వల్ల ఈ నదికి కృష్ణా అనే పేరు వచ్చిందని కుమారస్వామికి శివుడు వివరించాడు. తన రూపమైన వే ణీ నది కలవటం వల్ల కృష్ణవేణి అయిందని కూడా చెప్పాడు. కృస్ణానదికి సహ్యజ అనే పేరు కూడా ఉంది. దానికి కారణం భూలోకంలో కృష్ణ సహ్యగిరి ప్రార్థనకు అంగీకరించి సహ్యపర్వతంపై నుంచి ప్రవహించింది. అప్పుడు కృష్ణ సహ్యాద్రికి ఈ వరం ఇచ్చింది. ఏవమస్తు గిరిశ్రేష్ఠత్వత్తస్సంప్రభవామ్యహమ్ సుతా తవ భవిష్యామి సహ్యజేత్సపి విశ్రుతా సహ్యపర్వతరాజా! నేను నీ నుండి ప్రవహించి నీ కుమార్తెను అవుతాను. ఇక నుంచి నన్ను సహ్యజ అనే పేరుతో పిలుస్తారు. నీ పేరు శాశ్వతం అవుతుంది అన్నది. నారదమహర్షి మరొక దేవ రహస్యాన్ని కృష్ణానది గురించి ఇలా చెప్పాడు... సురభిర్దివిలోక విశ్రుతా భువి కృష్ణేవరప్రపూరణే సురభేరియమేవ బాధికా స్వజనేభ్యోఖిలమోక్షదా దేవలోకంలో కామధేనువు ఉంది. అడిగినవన్నీ ఇస్తుంది. మానవుల కోసం భూలోకంలో కోరికలు తీర్చే కృష్ణానది ఏర్పడింది. కామధేనువు కోరిన కోరికలు మాత్రమే తీరుస్తుంది. కృష్ణ అంతకంటే ఎంతో గొప్పది. తన భక్తుల కోరికలు తీర్చటమే కాక మోక్షాన్ని కూడా ఇస్తుంది. వరద కృష్ణమ్మ అంత పరవళ్లు ఎందుకు తొక్కుతుందో మార్కండేయ మహర్షి వర్ణించాడు. కృష్ణానది అలలు స్వర్గానికి మెట్లులాగా ఉంటాయన్నాడు. యాభాతి వితతా భూమౌ నృణాముత్తరాయవై నృణాంరోషేణ పాపాని భాతి హంకుర్వతవయా వరదలు వచ్చినప్పుడు కృష్ణవేణి నరుల పాపాలను చూసి హుంకరిస్తున్నట్టు, బుస కొడుతున్నట్లు ఉంటుంది. కృష్ణవేణి ముగ్గురమ్మల రూపం. ‘ఆవర్తనాభిః పద్మాక్షీ శుభ్రాంగీ ఫేనహారిణీ’ స్వచ్ఛమైన నీటిలో, తెల్లని నురుగు హారాలతో కృష్ణ సరస్వతిలా ఉంటుంది. ‘చకాస్తియా స్వయం లక్ష్మీః జగద్దుర్గతి నాశినీ’ పద్మహస్త అయిన లక్ష్మిలా ఉంటుంది. ‘సౌభాగ్యదాయినీ గౌరీ యా భాతి జగదంబికా’ సౌభాగ్యాన్ని ఇచ్చే జగదాంబ గౌరిలా ఉంటుంది కృష్ణ. పురాణాల్లో ఇన్ని విధాలుగా వర్ణింపబడిన యుగయుగాల కృష్ణమ్మకు కోటి దండాలు. పుణ్యదాయినికి పుష్కర ప్రణామాలు. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మహాబలేశ్వర్కు దిగువన ఉన్న పట్టణం ‘వాయి’లో ఏడు కృష్ణా ఘాట్లు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో డ్యోలా గణపతి ఆలయం ఉంది. కృష్ణానదికి వరద వస్తే ... ఆ నీరు ఆలయాన్ని తాకకుండా ఉండడానికి డ్యోలా గణపతి ఆలయ వెనుక భాగాన్ని చేప ఆకారంలో నిర్మించారు. -
కృష్ణా జలాలను మళ్లీ కేటాయించండి
సుప్రీంలో తెలంగాణ వాదన బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు ఏపీ మా ఆకాంక్షలను వినిపించలేదని వెల్లడి కేటాయింపులు మళ్లీ చేయొద్దన్న మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎస్ఎల్పీని విచారణకు స్వీకరించిన ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయింపు లు మళ్లీ మొదట్నుంచీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. గతవారం ఈ పిటిషన్ జస్టిస్ సుధాంశుజ్యోతి ముఖోపాధ్యా య, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అని పేర్కొంటూ.. మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు సూచించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ కేసు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ ప్రఫుల్లా సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తొలుత తెలంగాణ తరపున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ కృష్ణమూర్తి స్వామి పిటిషన్‌లోని విజ్ఞాపనను ధర్మాసనానికి వివరించారు. ‘‘కృష్ణా జలాల కేటాయింపులు జరుపుతూ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అవార్డును తాము చెప్పేవరకు గెజిట్‌లో నోటిఫై చేయరాదని న్యాయస్థానం కేం ద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏపీ విభజన నేపథ్యంలో జూన్ 2నుంచి తెలంగాణ ప్రత్యే క రాష్ట్రంగాఉంది. ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు మేం స్వతంత్రంగా పిటిషన్ దాఖలు చేశాం. ఎందుకంటే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తమ వాదనలు వినిపించినప్పుడు మా ప్రాంత ఆకాంక్షలు, అవసరాలు వ్యక్తపరచలేదు. అందువల్ల కృష్ణా జలాల కేటాయింపులు మళ్లీ జరపాలని మా అ భ్యర్థన’’ అని విన్నవించారు. మహారాష్ట్ర తరపు న్యాయవాది అంధ్యార్జున తన వాదనలు విని పిస్తూ.. ‘ ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో వివాదం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యే ఉన్నం దున అన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ న్యాయవాది కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇదే అంశంలో ఏపీ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అవార్డును గెజిట్‌లో నోటిఫై చేయాలన్న మహారాష్ట్ర పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అన్ని అంశాలను మరోసారి పరిశీలించాలన్నదే మా అభ్యర్థన.. ప్రస్తుతం మా సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా వారంపాటు విచారణనువాయిదా వేయగలరని కోరుతున్నాం’’ అని విన్నవించారు. దీంతో ధర్మాసనం ఈ కేసును డిసెంబర్ 1కి వాయిదా వేసింది.