
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలేమైనా ఫరవాలేదు.. తను బాగుంటే చాలు అన్న తీరుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం, బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇక మరో ట్వీట్‌లో.. ‘అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు ‘తీసేసిన తాసిల్దార్లు’’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment