
రబీ వేళ ఆంధ్రప్రదేశ్ రచ్చ!
కృష్ణా నదీ జలాల్లో రాష్ట్ర వాటాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పేచీకి దిగింది.
• కృష్ణా జలాల్లో రాష్ట్ర నీటి వాడకానికి కోత పెట్టే ప్రయత్నం
•తెలంగాణ 36 శాతం అధికంగా నీరు వాడుకుందని
• బోర్డుకు ఫిర్యాదు.. రాష్ట్రాన్ని వివరణ కోరిన కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్ర వాటాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పేచీకి దిగింది. రాష్ట్ర రబీ అవసరాలకు నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డును తెలంగా ణ ప్రభుత్వం కోరిన సమయంలో..అందులో కోత పెట్టించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత వాటర్ ఇయర్‌లో తెలంగాణలో సగటు వర్షపాతం అధికంగా నమోదైందని, ఆ ప్రకారం తెలంగాణ వాటాలకు మించి కృష్ణా జలాలను వాడుకుందని వాదిస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదుపై కదిలిన బోర్డు.. దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణకు లేఖ రాసింది. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ సోమవారం తెలంగాణకు లేఖ రాశారు.
చిచ్చు పెట్టే లెక్కలు...
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉండ టంతో రబీ అవసరాలకు నీటిని విడుదల చేయాలంటూ తెలంగాణ, ఏపీ ఇప్పటికే బోర్డును కోరారుు. నీటి అవసరాల జాబితా ను సమర్పించారుు. మొత్తంగా కృష్ణాలో 103 టీఎంసీ లు తెలంగాణ కోరింది. ఈ ఏడాది లభ్యత నీటిలో ఏపీ 187.18 టీఎంసీలు వాడుకోగా తాము 64.8 టీఎంసీలనే వినియోగించు కున్నామని బోర్డుకు తెలిపింది. తెలంగాణ నీటి విడుదల విజ్ఞప్తిపై అభ్యం తరం వ్యక్తం చేస్తూ ఏపీ సోమవారం బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ ఇప్పటికే అధికంగా నీటిని వాడుకుందని ఫిర్యాదు చేసింది.
లేఖలో ఏపీ ఏం చెప్పిందంటే...
‘ఈ ఏడాది తెలంగాణలో సగటు కంటే 18 శాతం అధికంగా 982.7 మి.మీ. వర్షం కురిసింది. ఏపీలో 582.50 మి.మీ.యే కురిసింది. తెలంగాణలో భారీ వర్షాలతో చెరువుల కింద 89.15 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. దీన్ని నమోదు చేయకుండా కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోని చిన్న నీటివనరుల కోసం బచావత్ ట్రిబ్యునల్ 89.11 టీఎంసీలు కేటరుుంచినా 30 టీఎంసీలకు మించి వాడుకోలేని స్థితి ఉందని గతంలోనే స్పష్టం చేసినా ఏపీ మళ్లీ ఫిర్యాదు చేయడం రబీ అవసరాల్లో కోత పెట్టజూడటమేనని తెలంగాణ మండిపడుతోంది.