
సాక్షి, విజయవాడ: వరద ఉధృతికి కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ 68వ గేట్‌కు అడ్డుపడిన పడవను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎట్టకేలకు విజయవంతంగా తొలగించారు. బ్యారేజ్‌కు ఎటువంటి నష్టం కలుగకుండా బెకెమ్ కంపెనీ ఇంజినీర్ల సాయంతో బోటు తొలగించారు. ఎలాంటి నష్టం లేకుండా ఈ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పడవను తీసేయడంతో ప్రకాశం బ్యారేజ్ 68వ గేట్‌ను అధికారులు దించనున్నారు.
కృష్ణ వదర ప్రవాహానికి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్‌కు అడ్డంగా నిలిచిన పడవను తొలగించడానికి ఐదు రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎగువ ప్రాంతం నుంచి 22 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండటంతో ఈ పడవను తొలగించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పడవ తొలగింపునకు రెండు వించులు,రెండు భారీ క్రేన్లు, 50 ఎంఎం స్టీల్ రోప్‌ను వినియోగించారు. బోటు తొలగింపు చర్యల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందంతోపాటు బెకెమ్ కంపెనీ ఇంజినీర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment