ప్రకాశం బ్యారేజీ: రేపు భారీగా వరదనీరు.. యంత్రాంగం అప్రమత్తం | Officials Alerted To Possibility Of Heavy Flood Water Reaching Prakasam Barrage | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజీ: రేపు భారీగా వరదనీరు.. యంత్రాంగం అప్రమత్తం

Jul 31 2021 4:40 PM | Updated on Jul 31 2021 5:05 PM

Officials Alerted To Possibility Of Heavy Flood Water Reaching Prakasam Barrage - Sakshi

రేపు ప్రకాశం  బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమతమైంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండటంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

సాక్షి, విజయవాడ: రేపు ప్రకాశం  బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమతమైంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండటంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉండగా, నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నానికి, సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement