
నేనేం తప్పుగా మాట్లాడలేదు: గడ్కరీ
తన చేసిన లంచం వ్యాఖ్యల్లో తప్పేంలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
న్యూఢిల్లీ: తన చేసిన లంచం వ్యాఖ్యల్లో తప్పేంలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తానేం తప్పుగా మాట్లాడలేదని ఆయన సమర్థించుకున్నారు. ఓటర్లను లంచం తీసుకోవాలని గడ్కరీ వ్యాఖ్యానించడంతో ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చే డబ్బుల(లంచాలను)ను కాదనకుండా తీసుకోవాలంటూ ఓటర్లకు సూచించారు. ఆదివారం మహారాష్ట్రలోని లాతూరులో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.