Chatrapati Shivaji Terminus
-
ముంబైలో తప్పిన విమానాల ఢీ
ముంబై:ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్ఇండియాకు చెందిన విమానం అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అయింది. టేక్ఆఫ్ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కమ్యూనికేషన్ లోపమే కారణమని వెల్లడైంది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి పొరపాటున ల్యాండింగ్‌కు అనుమతిచ్చినట్లు తేలింది.ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు ఇదే రన్‌వేపై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకన్లు ఆలస్యమైనా భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు క్లియరెన్స్ ఇచ్చిన ఏటీసీ ఉద్యోగిని ఇప్పటికే తొలగించారు. -
అత్యాచారానికి ముందు ప్లాట్‌ఫారంపై ఐదుగురిని..
క్రైమ్: దేశ వాణిజ్య రాజధానిలో కాలేజీ యువతిపై చోటు చేసుకున్న అత్యాచార ఘటనలో మరో విషయం వెలుగు చూసింది. ముంబై లోకల్ ట్రైన్లో 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్‌పై లైంగిక దాడికి తెగబడిన 40 ఏళ్ల నవాజూ కరీం షేక్.. ఆ అఘాయిత్యానికి ముందు ప్లాట్‌ఫాంపైనా ఐదుగురిని వేధించాడు కూడా. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగిన అదే రోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్ 1 పైనా ఐదుగురిని వేధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఎరుపు రంగు టీషర్ట్‌లో కరీం.. ఐదుగురు మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. వాళ్లను చూస్తూ అసభ్యంగా సైగలు చేయడంతో పాటు వాళ్లను తాకేందుకు సైతం ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనలకు సంబంధించి ఎవరూ ఫిర్యాదులు మాత్రం చేయలేదు. బుధవారం నాడు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో లోకల్ ట్రైన్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు నవాజూ కరీం. అంతకు ముందు ఆమె ఎక్కడికి వెళ్లినా అతను ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైల్వే పోలీసుల సాయంతో ఆ రాత్రే నిందితుడు కరీంను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ అయిన ఆనందం ఆవిరి -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61కిలోల గోల్డ్ సీజ్.. కస్టమ్స్ చరిత్రలోనే రికార్డ్
ముంబై: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో బంగారం పట్టుకున్నారు. రెండు వేరు వేరు సంఘటనల్లో మొత్తం 61 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం చరిత్రలో ఒక్కరోజులో సీజ్ చేసిన విలువలో ఇదే అత్యధికమని తెలిపారు. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొదటి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో 1 కేజీ బంగారం బిస్కెట్లను దాచి తీసుకొచ్చారు. మొత్తం రూ.28.17 కోట్లు విలువైన యూఏఈ తయారీ గోల్డ్ బార్స్ 53 లభ్యమయ్యాయి. నలుగురిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ఆపరేషన్‌లో 8 కిలోలు సుమారు రూ.3.28 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారం బయటపడింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బంగారాన్ని మైనం రూపంలో చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దానిని జీన్స్‌లో పెట్టి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇదీ చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే? -
గురుత్వాకర్షణ సిద్ధాంతం.. పియూష్ గోయల్ వివరణ
-
పొరపాటుగా మాట్లాడానూ.. అంత మాత్రానే..
ముంబై : ఏదో పొరపాటుగా మాట్లాడాను అంటూ కేంద్రమంత్రి పియూష్ గోయల్ తను మాట్లాడిన దానికి వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఐన్‌స్టీన్ కనుగొన్నారని పొరపాటున చెప్పడంతో రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన తెగ ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘అయ్యో ఇన్ని రోజులు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటన్ అనుకున్నాం.. కాదా?’ అంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిపై పియూష్ గోయల్ స్పందించారు. మనందరం తప్పులు చేస్తుంటాం. తప్పు చేసిన దానిని సవరించుకోవడానికి నేను భయపడటం లేదు. నేను పొరపాటున ఒకరిపేరు మాట్లాడబోయి మరొకరి పేరును మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. అనుకోకుండా నేను చెప్పిన దాంట్లో ప్రధాన విషయం కాకుండా నేను పొరపాటుగా మాట్లాడిందే హైలెట్ అయిందని గోయల్ వాపోయారు. రాబోయే అయిదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్లు గల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ముంబై నుంచి న్యూఢిల్లీల మధ్య అదనపు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించడానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘వైఫల్యాలు విజయానికి ఒక అడుగు, ఎవరైనా చేసిన తప్పులు భవిష్యత్తులో మంచిదానికి దారితీస్తాయని నేను భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. చదవండి : అయ్యో ఇన్ని రోజులు న్యూటన్ అనుకున్నా?.. కాదా? -
ముంబై వాసులు సహనం వీడాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముంబై వాసులది ఎంత సహనం అంటే, వారి సదుపాయాలను, వారి భద్రతను కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విస్మరించేంత వరకు దారితీసిన సహనం’ అని ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరేశ్ పాటిల్ గురువారం నాడు వ్యాఖ్యానించారు. నగరంలో రైల్వే వంతెనలు, డ్రైనేజీకి సంబంధించిన మ్యాన్‌హోల్స్ కారణంగా నగరవాసులు మృత్యువాత పడుతున్నారని, ఎన్నిసార్లు వీటి గురించి ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంపై ప్రధాని న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ నరేశ్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేసిన గురువారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో నగరంలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్‌లోని పాదాచారుల వంతెన కూలిపోయి అరుగురు ప్రయాణకులు మరణించారు. కనీసం 21 మంది గాయపడ్డారు. కూలిపోయిన వంతెన పక్కనే మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా కార్యాలయం ఉంది. అయినా ఆయన కొన్ని గంటల వరకు మీడియాకు అందుబాటులోకి రాలేదు. 21 మంది గాయపడ్డారు. రోడ్డు నిర్మాణంలో, మరమ్మతుల్లో నాణ్యత ఉండడం లేదంటూ ముంబై హైకోర్టు కూడా గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులను హెచ్చరించింది. అయినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకప్పుడు ముంబై వాసులకు మంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేవి. మున్సిపాలిటీ అధికారులు, పాలకులు ఈ బస్సు సర్వీసులను పట్టించుకోవడం మానేసి మౌలిక సదుపాయాలంటూ రోడ్లు విస్తరిస్తూ ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో రోడ్లపై రద్దీ పెరిగింది. ఫలితంగా కాలుష్యం పెరిగింది. ట్రాఫిక్ జామ్‌లు పెరిగాయి. కేంద్ర మధ్య రైల్వేలైన్‌లోని కుర్లా రైల్వే స్టేషన్‌కు, పశ్చిమ లైన్‌లోని బండ్రా లైన్‌కు నేడు సరైన బస్సు సదుపాయం లేకుండా పోయింది. ఇరుకైన రోడ్లలో కిలోమీటరున్నర దూరం నుంచి పాదాచారాలు నడుచుకుంటూ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇదిలావుంటే ముంబై సముద్ర తీరాన 29.2 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాలని పాలకులు నిర్ణయించారు. ఇందులో పది కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయడానికి 12,700 కోట్ల రూపాయలను కేటాయించారు. అంటే కిలో మీటరుకు 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందన్న మాట. మొత్తం నగర జనాభాలో 1.25 శాతం మంది ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఈ రోడ్డుకు ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం సమంజసమా ? నగరంలో అన్ని రోడ్లను, వంతెనలను అభివృద్ధి చేసిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులను చేపడితే ఎవరు శంకించరు. ఇక ముంబై సహనం వీడాల్సిన సమయం వచ్చింది. (చదవండి: ఈ ఘోరానికి బాధ్యులెవరు?) -
‘సీఎస్టీ’కి కమాండో భద్రత
- 6 నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్న - సెంట్రల్ రైల్వే - ‘ఉగ్ర’ హెచ్చరికల నేపథ్యంలోనే.. - త్వరలో డాగ్స్ కెన్నల్ల నిర్మాణం సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కమాండోలతో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఉగ్రదాడులు జరగే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మరో ఆరు నెలల్లో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కమాండోలను ఏర్పాటు చేయటం వల్ల టెర్మినస్ భద్రతా వలయంలో ఉంటుందని సెంట్రల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అశోక్ భోర తెలిపారు. ప్రస్తుతం ఆర్పీఎఫ్కు ప్రత్యేకంగా 50 మంది సిబ్బంది ఉండగా.. మరో 60 మంది సిబ్బంది అదనంగా చేరనున్నారు. వారిని కొత్తగా ఇటీవల ఫోర్స్‌లో చేరినృబందంతో కలిపి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తారు. ఇందుకు అత్యాధునిక ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పుతారు. వీరికి తోడుగా డాగ్ స్క్వాడ్ల కోసం సెంట్రల్ రైల్వే కొత్తగా కెన్నల్లను నిర్మించనుంది. పన్వేల్, కసారా, లోనావాలాలోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మిస్తుంది. నగర శివార్లలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అక్కడ కూడా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ రైల్వే కమిషనర్ అశోక్ తెలిపారు. ప్రస్తుతం కార్నక్ బందర్, లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ), మాటుంగ, కల్యాణ్‌లలో 29 స్నిఫర్ డాగ్స్‌కు గాను 37 కెన్నీస్లు ఉన్నాయని చెప్పారు. కొత్త డాగ్స్ షెల్టర్లు అందుబాటులోకి రాగానే మరిన్నింటిని సమకూర్చే ప్రయత్నం చేస్తామని వివరించారు. అలాగే ఎలక్ట్రానిక్ నిఘాను కూడా మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. కుర్లా స్టేషన్లో ఇంటిగ్రెటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఐఎస్ఎస్)లో భాగంగా దాదాపు వంద కెమెరాలను అమర్చనున్నామని చెప్పారు. అనంతరం ఎల్టీటీ, కల్యాణ్‌లలో కూడా హై-ఎన్డ్ కెమెరాలను అమర్చుతామన్నారు. సీఎస్టీ, థానేలో ఐఎస్ఎస్ లో భాగంగా కెమెరాలను అమర్చారని, ఈ నెలాఖరుకు దాదర్‌లో కంట్రోల్ రూం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను ఎదుర్కొవడానికి సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని, సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు తగినంత సిబ్బంది ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.