ఏదో నోరు జారీ పొరపాటుగా మాట్లాడాను అంటూ కేంద్రమంత్రి పియూష్ గోయల్ తను మాట్లాడిన దానికి వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఐన్‌స్టీన్ కనుగొన్నారని పొరపాటున చెప్పడంతో రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన తెగ ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘అయ్యో ఇన్ని రోజులు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటన్ అనుకున్నాం.. కాదా?’ అంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిపై పియూష్ గోయల్ స్పందించారు.