15 ఏళ్ల బాలికని అంబులెన్స్‌లో.. | 15 Year Old GIrl Molested In Pakistan | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 29 2018 9:01 AM | Last Updated on Mon, Oct 29 2018 9:24 AM

15 Year Old GIrl Molested In Pakistan - Sakshi

లాహోర్‌ : పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. మానస్థితి సరిగా లేని ఓ 15ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అంబులెన్స్‌ ఉద్యోగులు. పోలీసుల కథనం ప్రకారం.. గురుద్వారా నగరానికి చెందిన మానసిక స్థితి సరిగా లేని బాలిక(15) గత శనివారం అదృశ్యమయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు బాలిక బంధువులు వెతకడం ప్రారంభించారు.

కాగా బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డుపై ఉన్న ఒక అంబులెన్స్‌ నుంచి బాలిక ఏడుపులు వినిపించడంతో అక్కడి వెళ్లి చూశారు. వీరి రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తన కూతురిపై ఇద్దరు అంబులెన్స్‌ ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టారని ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు ప్రభుత్వ అంబులెన్స్‌ ఉద్యోగులైన అహ్సాన్‌ అలీ, సమీన్‌ హైదర్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement