హర్యానాలో దారుణం | 17 Year Old Girl Abducted, Raped By 8 Men In Haryana | Sakshi
Sakshi News home page

హర్యానాలో దారుణం

Published Thu, May 3 2018 4:52 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

17 Year Old Girl Abducted, Raped By 8 Men In Haryana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,చండీఘర్‌ : మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు, హత్యాకాండలకు బ్రేక్‌ పడటం లేదు. తాజాగా హర్యానాలోని మెవాత్‌లో ఓ 17 ఏళ్ల బాలికను అపహరించి 8 మంది లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. నౌ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో అపస్మాకరస్థితిలో పడిఉన్న బాలికను పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెండు మోటార్‌ బైక్‌లు, కారులో వచ్చిన నిందితులు ఆమెను అపహరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.

బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన అనంతరం స్పృహకోల్పోయిన స్థితిలో ఆమెను వదిలివేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. అపస్మారకస్థితిలో బాలికను గుర్తించి ఇంటికి తీసుకువచ్చిన పోలీసులు ఆమెను తల్లితం‍డ్రులకు అప్పగించారు. అయితే తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిందితులను బాలిక గుర్తించిందని, వారు గతంలోనూ తమ కుమార్తె వెంటపడ్డారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని మెవాట్‌ ఎస్పీ నంజీన్‌ భాసిన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement