భక్షక భటులు.. ఒంటరి యువతి పట్ల.. | Police Constables Vulgar Behaviour With Alone Lady In Vijayawada | Sakshi
Sakshi News home page

భక్షక భటులు.. ఒంటరి యువతి పట్ల..

Published Sat, Nov 24 2018 3:48 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

Police Constables Vulgar Behaviour With Alone Lady In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ఒంటరి యువతికి అండగా నిలబడాల్సిన పోలీస్‌ కానిస్టేబుళ్లు కీచకులుగా మారి వేధించారు. తాగిన మత్తులో.. ఒంటరిగా ఉన్నయువతి పట్ల ఇద్దరు కానిస్టేబుళ్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ సంఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. కొద్దిరోజులు క్రితం విజయవాడ నెహ్రూ బస్టాండ్‌లో ఒంటరిగా ఉ‍న్న ఓ యువతి పట్ల ఇద్దరు కానిస్టేబుళ్లు వికృత చేష్టలకు పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న వారు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఇద్దరిని తెలంగాణ కొండాపూర్‌ బెటాలియన్‌కు చెందిన ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లుగా పోలీసులు గుర్తించారు.

వారు పోలీసులు కావటంతో విజయవాడ పోలీసులు ఆ సంఘటనను గోప్యంగా ఉంచారు. బస్టాండ్‌ పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌లో ఉ‍న్న హెడ్‌ కానిస్టేబుల్‌ మూర్తిని మ్యానేజ్‌ చేసుకుని వారు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. దీంతో విజయవాడ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పుమన్నాయి. ఈ సంఘటనపై స్పందించిన సీపీ సిబ్బందిపై సీరయస్‌ అయ్యారని సమాచారం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement