పేదలపై కిరోసిన్ భారం
బద్వేలు అర్బన్: ప్రభుత్వ చౌక దుకాణాలలో నిరుపేదలకు పంపిణీ చేసే నీలికిరోసిన్ ధరను లీటరు రూ.4 చొప్పున పెంచి పేదలపై ప్రభుత్వం భారం మోపింది. ఈ నెల కోటా నుంచి పెంచిన ధరలు అమలు కానున్నాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాలలో గ్యాస్ కనెక‌్షన్ ఉన్నవారికి లీటరు చొప్పున , గ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం రూ.14.75 పైసలు పంపిణీ చేస్తుండగా డీలర్లు రూ.15లు వసూలు చేస్తుండేవారు. ప్రస్తుతం రూ.4 పెంచడంతో ఆ ధర రూ.19కి చేరుకుంది. నియోజకవర్గంలో మొత్తం 71, 286 రేషన్‌కార్డులు ఉండగా అందులో గ్యాస్ కనెక‌్షన్‌లు లేనికార్డులు 25,408 , గ్యాస్ కనెక‌్షన్లు ఉన్నవి 45,878 కార్డులు ఉన్నాయి. ఇప్పటికే కరువు కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం లీటరు కిరోసిన్‌పై రూ.4లు పెంచడం అదనపు భారమని పేద ప్రజలు మండిపడుతున్నారు.
ఈనెల నుంచే అమలు: కిరోసిన్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఈనెల నుంచే అమలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా రేషన్ డీలర్లను రూ.19 ధర మేరకే డీడీలు తీయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కార్డుదారులందరికీ ఈ ధర వర్తిస్తుందా లేక గ్యాస్‌కనెక్షన్ ఉన్న కార్డుదారులకే ఈధర వర్తిస్తుందా అనేదానికి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో డీలర్లు అయోమయానికి గురవుతున్నారు.
పేదలపై పెనుభారం : ప్రస్తుతం లీటరు కిరోసిన్‌పై రూ.4లు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలపై పెనుభారం మోపనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 45,878 మంది గ్యాస్ కనెక‌్షన్లు ఉన్న కార్డుదారులుండగా వారికి ఇచ్చే లీటర్ కిరోసిన్ ప్రకారం ప్రతినెలా రూ.1, 83,512 భారం పడనుంది. ఒకవేళ ప్రభుత్వం కార్డుదారులందరికీ పెంచిన ధరలు వర్తింపచేస్తే రూ.3,86,776లు భారం పడనుంది. మొత్తం కార్డులు