Inflated
-
ఆరోపణలపై స్పందించిన స్నాప్‌డీల్
ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్‌పై వచ్చిన ఆరోపణలపై సంస్థ స్పందించింది. చట్టం, నిబంధనల ప్రకారం విక్రయాదారులు వ్యవహరించాల్సి ఉందని పేర్కొంది. కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నకిలి ఉత్పత్తుల బెడద ప్రపంచవ్యాప్తంగా ఉందని అందుకే బ్రాండ్ షీల్డ్ ద్వారా వీటి నిరోధానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. థర్డ్ పార్టీ బ్రాండ్ల విషయంలో పూర్తి పరిశీలన అనంతరం ఆయా బ్రాండ్లు నకిలీవని తేలితే వెంటనే కేవలం ఒక రోజులోనే వాటిని తొలగిస్తున్నామని తెలిపింది. మార్కెట్ ప్లేస్ ఆధారిత అమ్మకాల్లో ఆయా ఉత్పత్తిదారులు, విక్రయదారులు వీటికి బాధ్యత వహిస్తారని తెలిపింది. ఈ మేరకు స్నాప్‌డీల్ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. 2018 జనవరినుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ప్యాకేజీలపై ధర, ఉత్పత్తిదారుడు పేరు, తేదీ, ఎక్స్పైరీ తేదీ వివరాలను అందించాల్సిన బాధ్యత సెల్లర్స్‌కు ఉందని పేర్కొన్నారు. కాగా భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్‌డీల్ పెంచేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలంటూ అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ)డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని ఆశ్రయించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
పేదలపై కిరోసిన్ భారం
బద్వేలు అర్బన్: ప్రభుత్వ చౌక దుకాణాలలో నిరుపేదలకు పంపిణీ చేసే నీలికిరోసిన్ ధరను లీటరు రూ.4 చొప్పున పెంచి పేదలపై ప్రభుత్వం భారం మోపింది. ఈ నెల కోటా నుంచి పెంచిన ధరలు అమలు కానున్నాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాలలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి లీటరు చొప్పున , గ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం రూ.14.75 పైసలు పంపిణీ చేస్తుండగా డీలర్లు రూ.15లు వసూలు చేస్తుండేవారు. ప్రస్తుతం రూ.4 పెంచడంతో ఆ ధర రూ.19కి చేరుకుంది. నియోజకవర్గంలో మొత్తం 71, 286 రేషన్‌కార్డులు ఉండగా అందులో గ్యాస్ కనెక్షన్లు లేనికార్డులు 25,408 , గ్యాస్ కనెక్షన్లు ఉన్నవి 45,878 కార్డులు ఉన్నాయి. ఇప్పటికే కరువు కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం లీటరు కిరోసిన్‌పై రూ.4లు పెంచడం అదనపు భారమని పేద ప్రజలు మండిపడుతున్నారు. ఈనెల నుంచే అమలు: కిరోసిన్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఈనెల నుంచే అమలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా రేషన్ డీలర్లను రూ.19 ధర మేరకే డీడీలు తీయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కార్డుదారులందరికీ ఈ ధర వర్తిస్తుందా లేక గ్యాస్కనెక్షన్ ఉన్న కార్డుదారులకే ఈధర వర్తిస్తుందా అనేదానికి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో డీలర్లు అయోమయానికి గురవుతున్నారు. పేదలపై పెనుభారం : ప్రస్తుతం లీటరు కిరోసిన్‌పై రూ.4లు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలపై పెనుభారం మోపనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 45,878 మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్న కార్డుదారులుండగా వారికి ఇచ్చే లీటర్ కిరోసిన్ ప్రకారం ప్రతినెలా రూ.1, 83,512 భారం పడనుంది. ఒకవేళ ప్రభుత్వం కార్డుదారులందరికీ పెంచిన ధరలు వర్తింపచేస్తే రూ.3,86,776లు భారం పడనుంది. మొత్తం కార్డులు