రాష్ట్ర విభజనను నిరసిస్తూ మదనపల్లె ఇందిరానగర్‌కు చెందిన బండి చిన్నప్ప కుమారుడు మల్లికార్జున్(41) మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు
మదనపల్లె అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మదనపల్లె ఇందిరానగర్‌కు చెందిన బండి చిన్నప్ప కుమారుడు మల్లికార్జున్(41) మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కిరోసిన్ పోసుకుని సమైక్య నినాదాలు చేస్తుండడంతో స్థానికులు అడ్డుకుని కిరోసిన్ డబ్బాను లాక్కొన్నారు. మల్లికార్జున మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రు లు ప్రకటన చేయడం బాధ కలిగించిందన్నారు.
రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. మల్లికార్జున్ ఈనెల 6వ తేదీన రాత్రి సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అడ్డుకునేందుకే తెలంగాణవాదులు ప్రయత్నించడంతో మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. టుటౌన్ పోలీసులు నచ్చజెప్పి కిందకు దింపారు.