నిప్పంటించుకొని మహిళ ఆత్మహత్య
Published Sun, Mar 26 2017 11:11 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
ఓర్వకల్లు: క్షణికావేశంతో ఓ యువతి నిప్పటించుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన కురువ పెద్ద వెంకటస్వామి కుమారుడు రామకృష్ణకు బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన జానకి (22)తో రెండేళ్ల క్రితం వివాహైంది. జానకి గత ఏడాది నుంచి మానసిక రుగ్మతకు లోనైంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జ్ ఎస్‌ఐ మల్లికార్జున, పోలీసులు అక్కడికి చేరుకొని జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కానున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement