కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం చికిత్స పొందుతూ యువకుడి మృతి
పెద్దశంకరంపేట: భర్తపై కోపంతో మానసిక వికలాంగుడైన కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిందో కన్నతల్లి. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట మండలం జూకల్‌కి చెందిన బూర్ల సంగయ్య, సత్యమ్మ దంపతులకు మానసిక వికలాంగుడైన కుమారుడు బూర్ల యేసు (21), ఓ కుమార్తె ఉన్నారు.
ఇటీవల సంగయ్య ఆరు కుంటల భూమిని కొనుగోలు చేశాడు. డబ్బు సరిపోకపోవడంతో భార్య వద్ద ఉన్న బంగారు ఇవ్వాలని కోరాడు. ఇదే విషయమై శనివారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్త మీద కోపంతో యేసుపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు ఆదివారం మృతి చెందాడు.
మానసిక వికలాంగుడిపై కన్నతల్లి కర్కశం
Published Mon, May 4 2015 12:58 AM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM
Advertisement
Advertisement