
భార్య ఒంటిపై కిరోసిన్ పోసి...
తిరుమలగిరి :వేదమంత్రాల సాక్షిగా వివాహమాడాడు.. బంధువులందరి సమక్షం లో కలకాలం కాపాడుతానని ప్రమా ణం చేశాడు.. అదనపు కట్నం తేలేదంటూ ఆ .. భార్యనే అగ్నికి ఆహుతి చేశాడు.. కూతురిలా చూసుకుంటామన్న అత్తా, మామ కూడా సహకరించి ఆ అభాగ్యురాలిని కాటికి సాగనంపారు. ఈ దారుణ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాలలో శుక్రవా రం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి వాంగ్మూలం, బంధువులు, స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మమత(25)కు వెలిశాల గ్రామానికి చెందిన పులుసు మల్లేష్‌తో 16 నెలల క్రితం వివాహం జరిగింది. రూ.6 లక్షలు, 3 తులాల బంగారం, ఇతర లాంఛనాలను వివాహ సమయంలో ముట్టజెప్పారు.
కొద్దిమాసాలకే వేధింపులు షురూ..
కోటి ఆశలతో కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఆ వధువు కలలు కల్లలయ్యా యి. డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త తాగుడుకు బానిసగా మారాడు. ఏదో సాకు చూపుతూ నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఆరు మాసాల నుంచి అదన పు కట్నం కింద రూ.లక్ష, మరో రెండు తులాల బంగారం కావాలంటూ వేధింపులకు గురిచేశాడు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆ అభాగ్యురాలు మెట్టినింటిలోనే నరకయాతన అనుభవించింది.
వచ్చాడు.. కొట్టాడు.. ఆపై కాల్చేశాడు..
గ్రామంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మల్లేష్ శుక్రవా రం పూటుగా మద్యం సేవించాడు. ఒంటి గంట రాత్రి ఇంటికి వచ్చి అదనపు కట్నం విషయంలో మమతతో ఘర్షపడ్డాడు. తను ఇక పుట్టింటి వారిని డబ్బులు అడిగేది లేదని స్పష్టం చేయడంతో తీవ్రంగా కొట్టాడు. నువ్వు ఇలా వినవంటూ కిరోసిన్ డబ్బా తీసుకొచ్చి మమత ఒంటిపై పోశాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మమత అత్త రాజమ్మ, వెంకన్న ఆ మృగాడిని వారించకుండా సహకరించారు. దీంతో రెచ్చిపోయిన మల్లేష్ అగ్గివెలిగించి మమతకు అంటించాడు.
కాపాడండి.. కాపాడండి..
ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించడంతో కాపాడండి.. కాపాడండి అంటూ మమత ఆర్తనాదాలు మిన్నంటాయి. చుట్టుపక్కల వారు దీనిని గమనించి వెంటనే వచ్చారు. అగ్నికి ఆహుతి అవుతున్న మమతను రక్షించేందుకు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల దాడితో పరార్
మమతను భర్త, అత్త,మామలు కలిసి హత్య చేసేం దుకు ప్రయత్నించారని గ్రహించి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాతుకానికి ఒడిగట్టిన మల్లేష్, అత డి తలిదండ్రులను పట్టుకుని చితకబాదుతుండగా తప్పిం చుకుని పరారయ్యారు.
వాంగ్మూలం ఇచ్చి కన్నుమూత
తీవ్ర గాయాలపాలైన మమతను స్థానికులు వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి నాలుగో తరగతి న్యాయమూర్తి ఎదుట భర్త, అత్త, మామలు అదనపు కట్నం కోసం తన ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని మమత వాం గ్మూ లం ఇచ్చింది. తదనంతరం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహిం చి బంధువులకు అప్పగించారు. మృతురాలి తం డ్రి కుంభం అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కూతురు రాజయ్య తెలిపారు.