పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు! | lover asked to marry but he tried to kill with kerosene | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు!

Published Wed, Dec 18 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

lover asked to marry but he tried to kill with kerosene

 బాధితురాలు బీటెక్ విద్యార్థిని, పరిస్థితి విషమం
 సాక్షి, నల్లగొండ: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రేమికురాలిపై కిరోసిన్‌పోసి నిప్పంటిం చాడో ఘనుడు. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో జరిగింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదే మండల పరిధిలోని దర్వేశిపురానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నకిరేకంటి సైదులు, అరుణ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌లో ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. అప్పటికే వివాహం జరిగిన సైదులుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అరుణ కొంతకాలంగా అడుగుతూ వస్తోంది. ఈ క్రమంలో సైదులు తన కార్యాలయంలోకి మధ్యాహ్నం సమయంలో ఆమెను పిలిచాడు. ఒక్కసారిగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అరుణకు 95 శాతానికిపైగా గాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.  నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement