- కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
- రెండో వివాహమే గొడవకు కారణం
కర్నూలు : కర్నూలు శరీర్‌నగర్‌కు చెందిన మన్సూర్ అలియాస్ రాజు.. తన భార్య బేబి (30) ఒంటికి నిప్పుపెట్టి సజీవ దహనం చేశాడు. బేబి మొదటి భర్తను వదిలేసి రాజును రెండవ పెళ్లి చేసుకొంది. వడ్డెగేరిలో నివాసం ఉన్నప్పుడు పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకొని శరీర్‌నగర్‌లో కాపురం ఉంటున్నారు. ఈమెకు కొడుకు, కూతురు సంతానం. అయితే రాజు మరోమహిళను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో బేబి నిలదీసింది. 15 రోజుల క్రితం భర్తతో గొడవ పడి సోదరి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో రాజు ఆదివారం ఉదయం ఇంటికి పిలుచుకొని వచ్చి గొడవ పడ్డాడు. రెండో పెళ్లి విషయంలో ఆమె గట్టిగా నిలదీయడంతో ఆగ్రహించిన రాజు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు నాల్గవ పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు.