పరిస్థితి విషమం.. గాంధీ ఆస్పత్రికి తరలింపు
మెదక్ రూరల్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని బొడుభూపతిపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి కిషన్ రాజమణి దంపతులకు ముగ్గురు పిల్ల లు. అందులో లక్ష్మణ్, రాము కవల పిల్లలు (అన్నదమ్ములు). గ్రామంలో 7వ తరగతి చదువుతున్నారు.
కాగా కిషన్, రాజమణి బతుకు దెరువుకోసం కొంతకాలంనుంచి నిజమాబాద్ వెళ్లిపోగా లక్ష్మణ్, రాము తన నానమ్మ వెంకటమ్మ వద్ద ఉంటూ గ్రామంలో చదువుకుంటున్నా రు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉండటంతో ఉదయం నుంచి ఇంట్లోనే పడుకుని ఉన్న లక్ష్మణ్ మధ్యాహ్నం వేళ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు.ఇరుగు పొరుగువారు మంటలనార్పి మెదక్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేసినట్లు రూరల్ పోలీసులు పేర్కొన్నారు. కాగా విద్యార్థి ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో తెలియరాలేదు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పోచయ్య తెలిపారు.
నిప్పంటించుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Published Sat, Mar 7 2015 2:17 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
Advertisement
Advertisement