
గాయపడ్డ విద్యార్ధిని
మనూరు(నారాయణఖేడ్): మనూరు మండల పరిధిలోని శెల్గిరా మోడ్ వద్ద బుధవారం ఆటోపల్టీ కొట్టడంతో ముగ్గురు పదోతరగతి విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బోరంచ, తుమ్నూర్‌కు చెందిన పదోతరగతి విద్యార్థులు శెల్గిరాలో చివరి పరీక్ష రాసి ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోను స్థా«నిక మోడ్ వద్ద ఎదురుగా వస్తున్న ఓ బైక్ ఢీట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో తొమ్మిది మంది విద్యార్థులు ఉండగా, అందులో తుమ్నూర్‌కు చెందిన రాకేశ్, మౌనిక, బోరంచకు చెందిన అపర్ణకు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులను బోరంచ హెచ్‌ఎం నూరందయ్య, ఉపాధ్యాయులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment