![కార్మికుడి ఆత్మహత్యాయత్నం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41435228736_625x300.jpg.webp?itok=t-W7bkQj)
కార్మికుడి ఆత్మహత్యాయత్నం
మెదక్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలంలోని చార్మినార్ బ్రేవరీస్ కర్మాగారం ఎదుట గురువారం ఉదయం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. చార్మినార్ బ్రేవరీస్ కర్మాగారంలో గత పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న మిర్యాల కిట్టయ్య(38)ను ఇక ముందు పనికి రావద్దని కాంట్రాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెందిన కిట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన తోటి కార్మికులు అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.