అడ్డగుట్ట (హైదరాబాద్) : మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి కథనం ప్రకారం... తుకారాంగేట్ ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో నివసించే లెల్లెల శ్రీనివాస్(40), యాదమ్మ దంపతులు. కాగా నిత్యం శ్రీనివాస్ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. డబ్బులు ఇవ్వకుంటే చచ్చిపోతానని బెదిరించేవాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ రాత్రి పది గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవపడి తుకారాంగేట్‌లోని కేజీ ఆస్పత్రిలో పని చేసే తల్లి దగ్గరకు వెళ్లాడు. తనకి డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. ఆమె కూడా నిరాకరించడంతో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మద్యానికి డబ్బివ్వలేదని నిప్పంటించుకున్నాడు
Published Sat, Jul 11 2015 5:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement