
శుభకార్యానికి పంపలేదని.. కూతురుకు నిప్పంటించి..
పెబ్బేరు: శుభకార్యానికి పంపిం చలేదన్న కారణంతో ఓ తల్లి తన ఏడునెలల చిన్నారిపై కిరోసి న్ పోసి నిప్పంటించింది. తర్వా త తానూ అంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం జానంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఎండీ సాదిక్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అతని భార్య సుల్తానా తరఫు బంధువు ఇంటికి వచ్చి శుభకార్యానికి పంపించాలని సాదిక్‌ను అడిగాడు. తన కూతురు ఆసియాబేగం ఆరోగ్యం సరిగా లేదని, శుభకార్యానికి పంపించలేనని చెప్పాడు.
దీంతో సుల్తా నా తీవ్ర మనస్తాపం చెందింది. మంగళవారం రాత్రి భర్తతో గొడవ పడి, ఇంట్లో కి వెళ్లి గడియపెట్టుకొని కిరోసిన్‌ను తన ఏడు నెలల కూతురుపై పోసి నిప్పంటించింది. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకుంది. గమనించిన భర్త, చుట్టుపక్కల వారు తలుపులు విరగ్గొట్టి వారిద్దరినీ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ బుధవారం వేకువజామున ఇద్దరు చనిపోయారు. అత్తింటి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు.