నల్ల బజారుకు రేషన్ సరుకులు | Ration of black market | Sakshi

నల్ల బజారుకు రేషన్ సరుకులు

Published Mon, Sep 9 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

Ration of black market

 కొడిమ్యాల, న్యూస్‌లైన్: పేదల కు అందాల్సిన రేషన్ సరుకులు నల్ల బజారుకు తరలుతున్నాయనేందుకు మరో నిదర్శనమిది. అక్రమాలకు అలవాటుపడిన రేషన్ డీలర్ కిరోసిన్‌ను బ్లాక్‌లో విక్రయిస్తుండగా పలువురు యువకులు పట్టుకున్నారు. శనివారం మండలంలోని తిప్పయ్యపల్లెలో రేషన్ డీలర్ వేముల పద్మజ నల్లగొండ గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఐదు లీటర్ల కిరోసిన్‌ను అక్రమంగా విక్రయించింది. గమనించిన స్థానిక యూత్‌క్లబ్ సభ్యులు కిరోసిన్‌ను పట్టుకొని జగిత్యాల ఆర్డీవోకు సమాచారమందించారు. దీంతో ఆయన వెంటనే స్థానిక తహశీల్దార్ చిలుక గంగారాంను గ్రామానికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశించారు. తహశీల్దార్ వచ్చి విచారణ జరపగా అక్రమం బయటపడింది. డీలర్ పది లీటర్ల కిరోసిన్‌లో ఐదు లీటర్ల కిరోసిన్‌ను నల్లగొండకు చెందిన గంగరాజు అనే యువకుడికి అక్రమంగా విక్రయించినట్లు తేలిందని చెప్పారు.  కాగా సరుకులను అక్రమంగా అమ్ముకుంటున్న రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement